అయిదేళ్ళ తరవాత మీ స్థాయి? JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
అయిదేళ్ళ తరవాత మీ స్థాయి?
  • ఇంటర్య్వూ...
  • తరచూ అడిగే ప్రశ్న..
అభ్యర్థులను ఇంటర్వ్యూయర్లు తరచూ అడిగే ప్రశ్న అయిదేళ్ళ తరవాత వృత్తిపరంగా నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నావు? సవాలు విసిరే ప్రశ్నల్లో ఇదొకటి. మనసుపొరల్లో దాగి ఉన్న ఆకాంక్షను వ్యక్తం చేయాలి. లేదంటే ఆ సంగతిని అదిమిపెట్టే ప్రయత్నాన్ని జాగ్రత్తగా చేయాలి. అభ్యర్థి ఏమేరకు విజనరీ అన్న విషయం తెలుసుకునేందుకు సాధారణంగా ఈ ప్రశ్న అడుగుతారు. ఇక్కడ మాటల మధ్య ఉన్న అర్థాన్ని వెతుక్కునే ప్రయత్నం ఇంటర్వ్యూయర్‌ చేస్తాడు. అలాగే ఈ ప్రశ్నకు సమాధానం అడిగినంత సులువూ కాదు. నిజానికి ఇంటర్వ్యూయర్‌ ఈ ప్రశ్న అడగడంలో రెండు విషయాలు ఇమిడి ఉన్నాయి. సుదీర్ఘకాలంలో ఏ స్థాయికి ఎదగాలని అభ్యర్థి కోరుకుంటున్నాడన్నది తెలుసుకోవడం మొదటిది. సంస్థ విజన్‌తో ఏ మేరకు కలిసిపోగలడో చూడటం రెండోది. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంబంధం కలిగిన ఉత్పత్తి కారకాలే. అభ్యర్థి ఆసక్తి, మోటివేషన్‌, కార్యాచరణలో సానుకూల ఆలోచన దృక్పథం అన్నీ ఈ ప్రశ్నతోనే రాబట్టవచ్చు.
 
సమాధానంలో వాస్తవికత కనిపించాలి..
ప్రొఫెషనలిజానికి సంబంధించి మార్పులు, చేర్పులు అవశ్యమైన ప్రపంచంలో అందుకుతగ్గట్టు చైతన్యం అభ్యర్థిలో ఉందా అన్నది తేల్చే ప్రశ్న ఇది. ఆయా విషయాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను తెలుసుకుం టారు. ప్రశ్నలో క్లిష్టత ఇమిడి ఉన్నప్పటికీ అతి అభిలాషను మాత్రం వ్యక్తం చేయకూడదు. కంపెనీ సిఇఒ కావాలనో, ఏడు అంకెల జీతం ఆశిస్తున్నానో చెప్పకూడదు. పది మంది మేనేజర్లు తనకు రిపోర్టు చేయాలన్న ఆకాంక్షనూ చెప్పకూడదు.
 
సమాధానంలో ఆచరణాత్మక, వాస్తవిక దృక్పథం కనిపించాలి. ఈ ప్రశ్నను తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. నిజాయతీ వ్యక్తం కావాలి. గౌరవప్రదంగా ఉండాలి. నన్ను నమ్మండి, నన్ను లైక్‌ చేయండి వంటి మాటలే రిక్రూటర్‌ రోజూ వింటూ ఉంటారు. అయిదేళ్ళు అంటే కెరీర్‌లో సుదీర్ఘకాలమే. అప్పటికి ఏమి కావాలని అనుకుంటు న్నామన్నది కరెక్ట్‌గా ఊహించడం కష్టమే అయినప్పటికీ వాస్తవిక దృక్పథంతో ఇంకా బాగా చెప్పాలంటే నేలపైనే నిలుచుని సమాధానం చెప్పగలగాలి.