గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌ JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌
గూగుల్‌.. ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న సెర్చ్‌ ఇంజిన్‌. ఇంటర్నెట్‌లో ఎటువంటి సమాచారం కోసమైనా ముందుగా సెర్చ్‌ మొదలు పెట్టేది గూగుల్‌తోనే. ఒక క్లిక్‌తో సెకన్ల వ్యవధిలోనే లక్షల పేజీల ఇన్ఫర్మేషన్‌ను అందుబాటులోకి తేవడం గూగుల్‌ స్టైల్‌. కేవలం బ్రౌజింగ్‌ లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఎంప్లాయి ఫ్రెండ్లీ ఆఫీస్‌లలో ఏటా గూగుల్‌ నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలుస్తోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్లికేషన్స్‌ను డెవలప్‌ చేస్తూ టెక్‌ వరల్డ్‌లో ఒక వండర్‌గా నిలుస్తోంది గూగుల్‌. అటువంటి దిగ్గజ సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఆఫర్‌ లెటర్‌తో మీ ముందు క్యూ కడతాయి. అయితే గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ ఎలా, ఎక్కడ, ఏవిధంగా చేయాలి అనే అంశాలను తెలుసుకుందాం.
 
గూగుల్‌... సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి. అత్యాధునిక హంగులు, టెక్నాలజీని సరికొత్త పుంతలు తొక్కించే దిశగా నిరంతర పరిశోధనలు వంటివి గూగుల్‌ కార్యకలాపాలు (ఉదాహరణకు డ్రైవర్‌లెస్‌ కారు). టెక్నాలజీ పరంగా ప్రపంచం కంటే ఒక అడుగు ముందు ఉండే గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేయడాన్ని విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి ద బెస్ట్‌ అని నిరూపించుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. గూగుల్‌ నుంచి ద బెస్ట్‌ అనే ట్యాగ్‌ కెరీర్‌ పరంగా మిమ్మల్ని ఎవరెస్ట్‌ శిఖరంపైనే నిలబెడుతుందనడంలో సందేహం లేదు.
 
ఏయే విభాగాల్లో..?
గూగుల్‌ రెండు విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తుంది. అవి.. టెక్నికల్‌ ఇంటర్న్‌షిప్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్న్‌షిప్‌. కంప్యూటర్‌ సైన్స్‌ లేదా సంబంధిత విభాగాలకు చెందిన గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే కాకుండా ఇతర స్ర్టీమ్‌ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. అయితే వారికి కోడింగ్‌, అల్గోరిథమ్స్‌పై మంచి అవగాహన ఉండాలి. గ్రాడ్యుయేట్స్‌ సాధారణంగా కోర్సులోని మూడు లేదా నాలుగో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేస్తారు.
 
ఎంబీఏ విద్యార్థులు కూడా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి గూగుల్‌ చేపట్టేఅన్ని రకాల కార్యకలాపాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం ఉంటుంది. 10 నుంచి 12 వారాల వ్యవధి ఉండే ఈ ఇంటర్న్‌షిప్స్‌ కోసం ఎంబీఏ విద్యార్థులు కోర్సులోని మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 
దరఖాస్తు ఎప్పుడు?
సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ కోసం ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఫిబ్రవరి నెలకు ముందుగానే ఇంటర్న్‌షిప్స్‌ అన్నీ భర్తీ చేస్తారు. కాబట్టి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
 
ఆన్‌లైన్‌లో...
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి (వెబ్‌సైట్‌: https://summerofcode.withgoogle.com/). ఇందుకు రెజ్యూమె (పీడీఎఫ్‌ రూపంతోపాటు ట్రాన్స్‌క్రిప్ట్‌గా కూడా ఉండాలి) ప్రాజెక్ట్‌ ప్రపోజల్‌, చక్కటి కవర్‌ లెటర్‌, మీ విజయాలను చూపే సర్టిఫికెట్స్‌, సంబంధిత డాక్యుమెంట్లను జత చేయాలి. గూగుల్‌ ఎంప్లాయి రిఫరల్‌ ఉండాలి. అయితే అందరికి గూగుల్‌ ఉద్యోగులు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారు లింక్డన్‌, ఫేస్‌బుక్‌ సహాయంతో గూగుల్‌ ఎంప్లాయిస్‌ను గుర్తించి వారి సహాయం తీసుకోవచ్చు. రిఫరల్‌ అనేది కేవలం రెజ్యూమె పోస్టింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ప్రాసెస్‌ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి రిఫరల్‌ తప్పనిసరి కాదు. ప్రీవియస్‌ గూగుల్‌ ఎంప్లాయి లేదా గతంలో గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేసిన వారి నుంచి ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మెయిల్‌ తెలుసుకుని హెచ్‌ఆర్‌ విభాగానికి నేరుగా కూడా రెజ్యూమెను మెయిల్‌ చేయవచ్చు.
 
ఎంపిక విధానం
వచ్చిన రెజ్యూమెలను స్ర్కీనింగ్‌ చేసిన తర్వాత టెక్నికల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో డేటా స్ట్రక్చర్స్‌, అల్గోరిథమ్స్‌, కోడింగ్‌ మీద ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి లింకడ్‌ లిస్ట్‌, స్టాక్‌, క్యూస్‌, హీప్స్‌, హ్యషింగ్‌, బైనరీ సెర్చ్‌ ట్రీ, బేసిక్‌ గ్రాఫ్‌ ట్రావర్సల్‌, ట్రైస్‌, బిట్‌ మానిప్యులేషన్‌ వంటి డేటా స్ట్రక్చర్స్‌పై అవగాహన కచ్చితంగా ఉండాలి. ఇంటర్వ్యూలను ఫోన్‌, గూగుల్‌ ప్లస్‌, హ్యాంగవుట్స్‌ వంటి మాధ్యమాల ద్వారా లేదా భారత్‌లోని గూగుల్‌ ఆఫీసుల్లో నిర్వహిస్తారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, గుర్గాంవ్‌లలో గూగుల్‌ ఆఫీసులు ఉన్నాయి.
 
తర్వాత రెజ్యూమె హైరింగ్‌ కమిటీకి చేరుతుంది. సంబంధిత డాక్యుమెంట్లను రివ్యూ చేస్తారు. హోస్ట్‌ మ్యాచింగ్‌ చివరి దశ. మీరు ఎంచుకున్న విభాగంలో ఖాళీ ఉంటే రెండు - మూడు రౌండ్ల పాటు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది నాన్‌ - టెక్నికల్‌ రౌండ్‌. అభ్యర్థి గుణగణాలు, వర్క్‌ కల్చర్‌, టీం వర్క్‌ సామర్థ్యాలను పరీక్షిస్తారు.
 
స్టయిఫండ్‌
ఇంటర్న్‌షిప్‌లో మొదటి నెల పూర్తిగా ఆర్గనైజేషన్‌ యాక్టివిటీస్‌పై సమగ్ర అవగాహన కల్పిస్తారు. తర్వాత మూడు నెలలపాటు మోంటార్స్‌ పర్యవేక్షణలో నిర్దేశించిన విధంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో సమయంలో నెలకు రూ.30,000 స్టయిఫండ్‌ లభిస్తుంది. వీటితోపాటు ఆహారం, టీం అవుటింగ్స్‌ అన్నీ ఖర్చులను గూగులే భరిస్తుంది.
 
గూగుల్‌ స్పాన్సర్‌ ప్రోగ్రామ్‌
గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌ అనేది గూగుల్‌ స్పాన్సర్‌ చేస్తున్న గ్లోబల్‌ ప్రోగ్రామ్‌. గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌ అంటే కచ్చితంగా గూగుల్‌ ఆఫీస్‌లోనే చేయాలని ఏమీ లేదు. సమ్మర్‌ కోడ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం గూగుల్‌ కొన్ని ఆర్గనైజేషన్స్‌ను ఎంపిక చేస్తుంది (వెబ్‌సైట్‌: https://summerofcode. withgoogle.com/organizations/). వాటిల్లో విద్యార్థులు మెంటార్స్‌ సహాయంతో ఇండిపెండెంట్‌గా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ కోసం ఆయా సంస్థల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్‌ను గూగుల్‌ పర్యవేక్షిస్తుంది.
 
స్కాలర్‌షిప్‌తో శిక్షణ
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో సాంకేతిక నిపుణులను తయారుచేసేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా 1.3 లక్షల మంది విద్యార్థులకు వివిధ సాంకేతిక అంశాల్లో స్కాలర్‌షిప్స్‌తో కూడిన శిక్షణను అందజేయనుంది. ఇందుకోసం గూగుల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ ప్లూరల్‌ సైట్‌, ఎడ్యుకేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఉడాసిటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
ప్లూరల్‌సైట్‌ సంస్థ ద్వారా 1,00,000 మందికి, ఉడా సిటీ సంస్థ ద్వారా 30,000 మందికి శిక్షణ ఇస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఆండ్రాయిడ్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌లకు సంబంధించి వివిధ టూల్స్‌పై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఉంటుంది. అందులో భాగంగా ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, మొబైల్‌ వెబ్‌ స్పెషలిస్ట్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, డేటా ఇంజనీర్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, మొబైల్‌ అండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఏఆర్‌ / వీఆర్‌, క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు.
 
గూగుల్‌, ప్లూరల్‌సైట్‌, ఉడాసిటీ సంస్థల్లోని నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తద్వారా భవిష్యత్‌లో టెక్నాలజీ రంగంలో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
 
అర్హత: గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా అనుబంధ బ్రాంచ్‌లో ప్రవేశం పొంది, 18 సంవత్సరాల వయసు ఉండాలి.
 
ఇంటర్‌నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవడం, స్థానిక భాషల్లో సేవలందించడం లక్ష్యంగా గూగుల్‌ శిక్షణ, నియామకాలు చేపడుతోంది.
 
ఉడాసిటీలో రిజిస్ర్టేషన్‌కు చివరి తేదీ: జనవరి 31, 2018.
 
రిజిస్ర్టేషన్‌ లింక్‌: https://in.udacity.com/
 
ప్లూరల్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.
 
రిజిస్ర్టేషన్‌ లింక్‌: https://app.pluralsight.com/id?