మేనేజ్‌మెంట్‌ కెరీర్‌కు.. నైపుణ్యాల బాసట JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మేనేజ్‌మెంట్‌ కెరీర్‌కు.. నైపుణ్యాల బాసట
ప్రస్తుతం జాబ్‌ మార్కెట్లో విజయం సాధించాలంటే అర్హతకు తోడు నైపుణ్యాలు ఉండాల్సిందే. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ స్కిల్స్‌ లేకుంటే అవకాశాలు లభించడం చాలా కష్టం. ముఖ్యంగా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తమని తాము సిద్ధంగా ఉంచుకుంటే తప్ప మేనేజ్‌మెంట్‌ కెరీర్‌లో రాణించడం అంత సులభం కాదు. కాబట్టి చదువుతోపాటే నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు కోర్సు ప్రారంభమైన మొదటి రోజు నుంచే కృషి చేయాలి. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకొవాలనుకునే వారు ఎలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలో చూద్దాం..
 
మేనేజ్‌మెంట్‌ కోర్సులు అంటే నిర్వహణ నైపుణ్యాలను అందించే కోర్సులుగా భావించవచ్చు. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) లేదా పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం) లేదా మరేతర మేనేజ్‌మెంట్‌ కోర్సులను చదివినప్పటికీ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ అలవడతాయి. అయితే కేవలం తరగతి గది బోధన వల్ల సామర్థ్యాలు పెంపొందవు. వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించలేవు. కాబట్టి కోర్సుతోపాటు ప్రాపంచిక దృక్పథం, వాస్తవ పరిస్థితులు, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని నూతన పోకడలు, సాంకేతిక మార్పులు.. ఇలా మేనేజ్‌మెంట్‌ రంగానికి సంబంధించిన ప్రతి అంశంపై సమగ్ర పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. తదనుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.
 
మల్టి కల్చర్‌ - మల్టి డిసిప్లినరీ
మేనేజ్‌మెంట్‌ ఔత్సాహికులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయి. అయితే వాటిని అందుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా ఓపెన్‌ మైండ్‌తో ఉండటం నేర్చుకోవాలి. భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్నాయి. విదేశీ కంపెనీలు మన దేశంలో పెద్ద ఎత్తున కార్యకలాపాలను ప్రారంభి స్తున్నాయి. కాబట్టి ఆయా కంపెనీలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అంతేకాకుండా విభిన్న ప్రదేశాలు, పరిస్థితుల మధ్య పని చేసేందుకు దోహదపడే మల్టి కల్చర్‌ - మల్టి డిసిప్లినరీ పని సంస్కృతిని అలవర్చు కోవాలి. వివిధ దేశాల్లోని పని సంస్కృతులపై అవగాహన పెంచుకోవాలి. ఆయా దేశాల్లో ఉద్యోగుల పనితీరును గమనిస్తూ ఉండాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలను దక్కించుకోవచ్చు.
 
నేర్చుకోవడానికి సిద్ధం
మరో ముఖ్యమైన అంశం.. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం. మేనేజ్‌మెంట్‌ అభ్యర్థులు మరిన్ని అవకాశాలను దక్కించుకోవాంటే కొన్ని విదేశీ భాషలను నేర్చుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా జపాన్‌, కొరియా, జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగం చేయడానికి అక్కడి భాష తెలిసి ఉండటం అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది.
 
పరిజ్ఞానం పెంచుకునే మార్గం
తరగతి గది పాఠాలతోపాటు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు ఉంటాయి. వాటన్నింటిని ఉపయోగించుకోవాలి. ప్రముఖ కంపెనీల సీఈఓలు, వ్యవస్థాపకులు లేదా మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌ ఎన్నో పుస్తకాలు రాస్తుంటారు. వాటిని చదవడం ద్వారా నాలెడ్జ్‌ను విస్తృతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంత మంది నిపుణులు సెమినార్స్‌, వర్క్‌ షాప్స్‌ వంటివి నిర్వహిస్తుంటారు. వాటికి హాజరు కావడం ప్రయోజనకరం. ఫిక్కీ, అసోచామ్‌ వంటి సంస్థలు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత రంగంలో వాస్తవంగా చోటు చేసుకుంటున్న పరిణమాలపై అవగాహన వస్తుంది. ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అనే విషయంపై స్పష్టత కూడా వస్తుంది. ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా చదువు తరవాత ఎంటర్‌ప్రెన్యూర్‌గా స్థిరపడాలనుకునే వారికి సెమినార్స్‌, వర్క్‌షాప్స్‌ చాలా చక్కగా ఉపయోగపడతాయి.
 
సమస్య పరిష్కార సామర్థ్యం
సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్న వారిని నియమించుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం వంటి వాటిని అలవర్చుకోవాలి. ఇవన్నీ అనుభవ పూర్వకంగా వస్తాయి. అయితే ఇటువంటి సందర్భాలను ప్రస్తావించే పుస్తకాలు, కేస్‌ స్టడీస్‌ వంటి వాటిని అధ్యయనం చేయాలి. తద్వారా సంబంధిత అవగాహన ఏర్పడుతుంది. అప్పుడే అవకాశాల్లో ఇతరుల కంటే ముందుంటారు. కొంత పరిధి మేరకు అంటూ తమని తాము నియంత్రించుకునే వారిని నియమించుకోవడానికి కంపెనీలు ఉత్సాహం చూపించవు.
 
విశ్లేషణాత్మకత సామర్థ్యం
మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లకు విశ్లేషణాత్మకత సామ ర్థ్యం కూడా ఉండాలి. ఒక నిర్ణయానికి వచ్చే ముందు దాని పర్యవసానాలను క్షుణ్నంగా ఆలోచించుకోవాలి. ప్రతి విష యాన్ని పరిస్థితులకు అన్వయించే దృక్పథంతో వ్యవహరిం చగల నేర్పు ముఖ్యం. నేటి కాలంలో కంపెనీల్లో నిర్వహణ, విధానాల పరంగా నిరంతరం మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని విశ్లేషింనే నేర్పును అలవర్చుకోవాలి.
 
కాలానికి అనుగుణంగా
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు, పోటీ, ఉత్పత్తి వ్యయం తదితర కారణాల వల్ల చాలా కంపెనీలు తమకు కావల్సిన సేవలను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పొందుతున్నాయి. దీంతో ఆ రంగంలో అవకాశాలను దక్కించుకోవాలంటే అనలిటికల్‌ స్కిల్స్‌, కాలానికనుగుణంగా వ్యాపార నమూనాల్లో వస్తున్న మార్పులను అవగాహన చేసుకునే సామర్థ్యం ఉండటం తప్పనిసరి. అంతేకాకుండా ఇంటర్‌ డిసిప్లినరీ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. ఈ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూనే ఉండాలి.
 
నలుగురితో కలిసి పని చేయడం
అకడమిక్స్‌తోపాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా నలుగురితో కలిసి పని చేయడం, వివిధ అంశాలను సమన్వయం చేసుకోవడం వంటి నైపుణ్యాలు అలవడుతాయి. ప్రస్తుతం ప్రతి కాలేజీలో సెమినార్స్‌, వర్క్‌షాప్స్‌ వంటి వాటిని విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. వాటిల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలి. తద్వారా నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను రూపొందించడం, జట్టుగా పని చేసే తత్వం, భిన్నమైన నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంప్రదింపులు చేయడం, సమయపాలన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ల సమయంలోనూ కంపెనీలు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 
గుర్తుపెట్టుకోవాల్సినవి
మల్టిటాస్కింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. ఒకే సమయంలో నాలుగైదు వ్యవహారాలను చక్కబట్టే నేర్పు పెంపొందించుకోవాలి. సమయపాలన కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఏరోజు పనులు ఆరోజే పూర్తయ్యేలా ప్రణాళికలను రూపొందించుకోవాలి.
సహోద్యోగుల్లో స్ఫూర్తి నింపుతూ ఒక జట్టుగా పని చేసేందుకు దోహదపడే ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోవాలి. పరిశ్రమల సందర్శన ద్వారా సంబంధిత విభాగాల్లో విధులు, కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరును అక్కడి సీనియర్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక సంస్థ లేదా కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా వాస్తవిక పరిస్థితులు, వర్క్‌ కల్చర్‌పై అవగాహన ఏర్పడుతుంది.
 
వీటికే రిక్రూటర్ల ఓటు..
జీమ్యాక్‌ రిక్రూటర్స్‌ సర్వే ప్రకారం.. మేనేజ్‌ మెంట్‌ అభ్యర్థులను నియమించుకోవడానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్న నైపుణ్యాలు..
కంపెనీ పని విధానంలో కలిసి పని చేయడం
జట్టుగా, సమిష్టితత్వంతో పని చేసే నేర్పు
సహచరుల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రభావ వంతంగా పని చేయించుకోగల చాతుర్యం
బాధ్యతలను స్వీకరించడంలో ముందు ఉండటం
నైతిక విలువలు
 
సాంకేతికంగా కూడా
కేవలం డొమైన్‌ నాలెడ్జ్‌ కాకుండా సాంకేతికంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం నేటి పరిస్థితుల్లో తప్పనిసరి. క్లయింట్లకు సమర్థంగా, వేగంగా సేవలు అందించే క్రమంలో కంపెనీలకు టెక్నాలజీ తప్పనిసరిగా మారుతోంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి టెక్నికల్‌ స్కిల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అటువంటి వాటిల్లో కొన్ని..
ఎక్సెల్‌
పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌
వ్యాపార / వాణిజ్య / తదితర కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో నిర్వహించే సామర్థ్యం
స్కైప్‌, షేర్‌ పాయింట్‌, గూగుల్‌ హ్యాంగవుట్స్‌, గో టు మీటింగ్‌ వంటి వాటిపై అవగాహన.
 
ప్రాక్టికల్‌గా ప్రాజెక్ట్‌వర్క్‌
థియరీ నాలెడ్జ్‌ ఎంత ముఖ్యమో, ప్రాక్టికల్‌ పరిజ్ఞానం కూడా అంతే కీలకం. ఈ విషయంలో ప్రాజెక్ట్‌ వర్క్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం రిక్రూటర్లు తప్పకుండా పరిశీలిస్తున్న ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలు దీని ద్వారా అలవడతాయి. కాబట్టి ప్రాజెక్ట్‌ వర్క్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. నేర్చుకోవాలనే ఉత్సాహంతో రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్‌ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. క్షేత్ర స్థాయిలో ఒక సంస్థలో పని చేేస అవకాశం వీటి వల్ల లభిస్తుంది. తద్వారా ఆ సంస్థలో కార్యకలాపాల నిర్వహణ, విధానాలు, సమస్యలు - సవాళ్లు, పరిష్కారాలను తెలుసుకోవచ్చు. కొన్ని సమస్యలకు మీరు పరిష్కారాన్ని సూచించే అవకాశం కూడా లభిస్తుంది.