మీ గురించి చెప్పండి! JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
మీ గురించి చెప్పండి!
ఇంటర్వ్యూ ప్రశ్నలు
ఉద్యోగ సాధనలో ఇంటర్వ్యూ పాత్ర కీలకం. ఈ దశను దాటేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా సాగుతుంది.. రిక్రూటర్లు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది అర్థం చేసుకోవడం ఉద్యోగార్థులకు పెద్ద సవాలు. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో ఈ ఆందోళన మరీ ఎక్కువ. ఆ ప్రయత్నంలో వారు ఎదుర్కొనే తొలి ప్రశ్న ‘టెల్‌ మి ఎబౌట్‌ యువర్‌ సెల్ఫ్‌’. వినడానికి సులువైన ప్రశ్నలా అనిపించినా, అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయించే ప్రశ్న. కొద్దిపాటి అవగాహన, అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే ఈ తరహా ప్రశ్నలతోపాటు మౌఖిక ప్రక్రియను విజయవంతంగా ముగించుకొని కలల కొలువును కొట్టేయవచ్చు.
 
మనల్ని మనం ఆవిష్కరించుకొనేలా..
నీ గురించి చెప్పు అనగానే అసలు రిక్రూటర్‌ ఏమి కోరుకుంటున్నారో అర్థం కాదు. ఏం చెప్పాలో తెలియదు. అదే ఒకింత ఆందోళన కలుగజేస్తుంది. దరిమిలా ఈ ప్రశ్న అంటేనే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒక రకమైన భయం ఏర్పడటం సహజం. అయితే కొద్దిగా ప్రిపేరైతే దీనికి చాలా జాగ్రత్తగా జవాబు చెప్పవచ్చని అనుభవజ్ఞుల అభి ప్రాయం. వాస్తవానికి ఇది మనల్ని మనమే ఆవిష్కరించు కొనేందుకు అవకాశం కలుగజేసే ప్రశ్న. ఇంటర్య్వూ ప్రక్రియ మరింత ముందు సాగడమనేది ఈ ప్రశ్నపైనే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. రెజ్యూమె మన గురించిన సమాచారాన్ని పరోక్షంగా తెలియజేస్తుంది. అందులోనే అంతా తెలుసుకొన్నప్పుడు అడిగేందుకు ఇంకేముందన్న సందేహం రావచ్చు. అక్కడే ఉంది అసలు తిరకాసు. సావధానంగా ఆలోచిస్తే విషయం అర్థమవు తుంది. రెజ్యూమెలో ఉన్నది తెలుసుకుని, మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. దాదాపుగా అదే అర్థం కలిగే రీతిలో ప్రశ్న అడుగుతున్నారు. అంటే అందులో లేనిది, ఇంకా ఏదైనా ఉంటే చెప్పండని అర్థం. ‘టెల్‌ మి ఎబౌట్‌ యువర్‌సెల్ఫ్‌’ అన్న ప్రశ్నకు రెజ్యూమెలో ఉన్న అంశాలు ఒకటి రెండు పేర్కొన్నప్పటికీ, ఇతర అంశాల ద్వారా మనల్ని మనం ఆవిష్కరించుకొనేలా చెప్పాలన్న మాట. మన నేపథ్యం.. లేదంటే అర్హతలు ఇంకా కాదంటే అనుభవం..నైపుణ్యాలు ప్రస్తుతం చేయాలని అనుకుంటున్న ఉద్యోగానికి ఎలా ఉపయోగపడతాయో చెప్పగలగాలి. మనం కంపెనీకి ఎలా బెని‘ఫిట్‌’ అవుతామో నిరూపించు కునే ప్రయత్నం చేయాలి.
 
రెజ్యూమె వల్లె వేయవద్దు..
ఎంప్లాయర్‌ మన నుంచి ఏమి ఆశిస్తున్నారో అంచనా వేయగలిగితే చాలు, సులువుగా ఈ ప్రశ్నను ఎదుర్కోవచ్చు. ఇక్కడ ఒక తప్పు మాత్రం చేయవద్దు. రెజ్యూమెలో ఉన్న విషయాలనే వల్లె వేయవద్దు. అమూల్యమైన సమయాన్ని వృథా చేయవద్దు, చేసుకోవద్దు. ప్రత్యేకంగా అడిగితే తప్ప హాబీలు, వ్యక్తిగత ప్రాధాన్యాలను చెప్పవద్దు. ఆశిస్తున్న జాబ్‌కు అవసరమైన అనుభవం లేదంటే సాధించిన
లక్ష్యాలను చెప్పవచ్చు.
 
ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి దృక్పథం నుంచి ఆలోచిస్తే ‘టెల్‌ మి ఎబౌట్‌ యువర్‌సెల్ఫ్‌’ అనేది అభ్యర్థితో మాటలు కలపడానికి వీలు కల్పించే మొదటి ప్రశ్న. ఉద్యోగానికి సరిపోయే వ్యక్తిని ఎంపిక చేయాలన్నది రిక్రూటర్‌ లక్ష్యం. సదరు జడ్జిమెంట్‌లో ఫెయిల్‌ అయితే తనకే ఇబ్బంది. నిజానికి ఈ ప్రశ్న అడగడం ద్వారా మాట్లాడటానికి మీకు అవకాశం కల్పించానన్న భావనలో రిక్రూటర్‌ ఉంటారు. అతనికి మంచి ఇంప్రెషన్‌ కలిగించేందుకు వీలు కల్పించే ప్రశ్న కూడా ఇదే. ఒక రకంగా ఈ ప్రశ్నను ‘ఎలివేటర్‌ పిచ్‌’గా కూడా అభివర్ణించవచ్చు. అంటే మిమ్మల్ని సూక్ష్మం గా ఆవిష్కరించుకోవడంగా చెప్పొచ్చు. ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల్లోపు వివరించగలగాలి. అందుకోసం ముందుగానే ప్రిపేర్‌ అయి ఉంటే మంచిది.
 
సమాధానాలు ఇలా ఉంటే బెస్ట్‌
ఆ ఉద్యోగానికి సరిపోయే అర్హతలు ఉంటే వాటిని పేర్కొనండి. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు. సదరు ఉద్యోగానికి ఎలా మీరు సరైన అభ్యర్థో తెలియ జేస్తూనే ఆ రంగంలో అనుభవం గురించి చెప్పొచ్చు.
మీ సాంకేతిక నైపుణ్యాలు, పొందిన ప్రత్యేకమైన శిక్షణ తదితరాలను ప్రత్యేకంగా వివరించవచ్చు. అలాగే ఆ ఉద్యోగానికి మీరు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో కూడా తెలియజేయాలి.
జాబ్‌ సైట్స్‌ ఏమి చెబుతున్నాయంటే...
మీరు ఎవరో వారికి వివరించాలి. అలాగే మీ బలాలను తెలపాలి.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇప్పటికే మీ రెజ్యూమెని క్షుణ్ణంగా పరిశీలించి ఉంటాడు. అయినప్పటికీ మిగి లిన వారికి మీకు తేడా చూపించే 2, 3 పాయింట్ల ను అయినా ప్రత్యేకంగా చెప్పండి.
ఇంటర్వ్యూకు ఎందుకు వచ్చారో వివరించాలి.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఇష్టమే అయినప్పటికీ జాబ్‌ అనేది మరింత చాలెంజింగ్‌గా ఉండాలను కుంటున్నట్లు పేర్కొనాలి. అందుకే ఈ ఉద్యోగంలో చేరడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని లాంటి సమాధానాలు బెటర్‌.
అంతేకాని ఆ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, మా బాస్‌తో నాకు పడడం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు అందుకే కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాను వంటివి చెప్పడం ఏమాత్రం సరికాదు.
గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమంటే ఇంట ర్వ్యూ అనేది ఎప్పుడూ డైలాగ్‌ల రూపంలో జరగాలి. ఏకపాత్రాభినయం తరహాలో ఒక్కరే మాట్లాడుతూ పోతే అది మంచి ఇంటర్వ్యూ కాదు.