సిఎంఏ ఫైనల్‌..సొంత నోట్సు మేలు JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సిఎంఏ ఫైనల్‌..సొంత నోట్సు మేలు
సిఎంఏ ఫైనల్‌ పరీక్షలకు హాజరుకాబోతున్న విద్యార్థులు ఎనిమిది సబ్జెక్టుల్లో ఏవైౖనా నాలుగింటిమీద ఎక్కువ దృష్టి పెడితే వాటిలో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఒకే మెటీరియల్‌ను ఫాలో కావాలి. ఇటీవల చేసిన సవరణలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. ఫైనల్‌ పరీక్షల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
 
కార్పొరేట్‌ లాస్‌ అండ్‌ కాంప్లయన్స్‌ (పేపర్‌ 13)
ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌ ఎలో కార్పొరేట్‌ లా (75 మార్కులు), సెక్షన్‌ బిలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అండ్‌ రెస్పాన్సిబిలిటీస్‌ (25 మార్కులు) ఉంటాయి.
కంపెనీలా (2013)కు సంబంధించిన నిబంధనలను, పరీక్షలకు ఆర్నెల్ల ముందు చేసిన సవరణలను జాగ్ర త్తగా చదువుకోవాలి. ప్రాక్టికల్‌ ప్రశ్నలు, విధానాలు, సమ్మతి సమస్యలపై (ప్రొసీజర్‌ అండ్‌ కాంప్లయన్స్‌ ఇష్యూస్‌) దృష్టి పెట్టాలి. సందర్భ పరిశీలన (కేస్‌ స్టడీ) ప్రశ్నలకు సమాధానాలు రాసేటపుడు ఎనాలసిస్‌ ఆఫ్‌ ప్రొవిజన్‌ (నియమ విశ్లేషణ) చేయాలి.
 
అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (పేపర్‌ 14)
ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌ సి, డిలు తేలికైన అధ్యాయాలు. వీటి నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
 
సెక్షన్‌              విభాగం                                                మార్కులు
                   ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ అండ్‌                     30
                      ఇనిస్టిట్యూషన్స్‌
బి                  ఫైనాన్షియల్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌                  25
సి                  సెక్యూరిటీ ఎనాలిసిస్‌ అండ్‌                          20
                     ఫోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌
డి                  ఇన్వెస్ట్‌మెంట్‌ డెసిషన్స్‌                              25
 
 
బిజినెస్‌ స్ట్రాటజీ అండ్‌ స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (పేపర్‌ 15)
ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌ ఎలో బిజినెస్‌ స్ట్రాటజీ (50 మార్కులు), సెక్షన్‌ బిలో స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (50 మార్కులు) ఉంటాయి. రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
బిజినెస్‌ స్ట్రాటజీ అనేది థియరీ సబ్జెక్టు. స్టడీ మెటీరియల్‌లో ఉండే కంటెంట్‌ను అభ్యసిస్తే సరిపో తుంది. స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పాక్షికంగా థియరీ అయినప్పటికీ సమస్యాత్మక ప్రశ్నలు కూడా ఉంటాయి. స్కానర్‌లో ఇచ్చిన ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి.
 
టాక్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రాక్టీస్‌ (పేపర్‌ 16)
సెక్షన్‌ ఎలో టాక్స్‌ మేనేజ్‌మెంట్‌ (70 మార్కులు), సెక్షన్‌ బిలో టాక్స్‌ ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్స్‌ (30 మార్కులు) విభాగాలు ఉంటాయి డైరెక్ట్‌ టాక్స్‌, ఇన్‌ డైరెక్ట్‌ టాక్స్‌ అంశాలు సబ్జెక్టులో మిళితమై ఉంటాయి. ప్రాథమిక భావనలు(బేసిక్‌ కాన్సెప్ట్స్‌), హెడ్స్‌ ఆఫ్‌ ఇన్‌కం గురించి ఇక్కడ పరీక్షించరు.
సన్నద్ధత ప్రణాళిక ప్రకారం ఉండాలి. వంద మార్కులకు ఎక్కువ సిలబస్‌ కవర్‌ చేస్తారు. ప్రొసీజరల్‌ యాస్పెక్ట్స్‌, పెనాల్టీస్‌ ప్రాసిక్యూషన్స్‌, అజ్యుడికేషన్స్‌, అప్పీల్స్‌, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌యాక్షన్స్‌ వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేస్‌ స్టడీ ప్రశ్నలను కూడా సాధన చేయాలి.
 
స్ట్రాటజిక్‌ పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (పేపర్‌ 17)
సెక్షన్‌ ఎలో పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (60 మార్కు లు), సెక్షన్‌ బిలో ఐటి అండ్‌ ఎకనోమెట్రిక్‌ టూల్స్‌ ఇన్‌ పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ (20 మార్కులు), సెక్షన్‌ సిలో ఎంటర్‌ప్రైజ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (20 మార్కులు) ఉంటాయి. ఈ విభాగాలకు సంబంధిం చిన స్టడీ మెటీరియల్‌ను క్షుణ్నంగా చదివితే చాలు.
 
కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ (పేపర్‌ 18)
ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. ముందుగా సెక్షన్‌ డి, తరవాత ఇ, ఆ తరవాత ఎ మీద దృష్టి పెట్టాలి. సెక్షన్‌ బి, సి లనుంచి 10 లేదా 15 ప్రశ్నలను ఆశించవచ్చు. వీటిలో చిన్న చిన్న కాన్సెప్ట్స్‌ని కూడా వదలకూడదు.
 
సెక్షన్‌           విభాగం                                               మార్కులు
                జనరల్లీ యాక్సెప్టెడ్‌ అకౌంటింగ్‌              10
                    ప్రిన్సిపుల్స్‌
బి                బిజినెస్‌ కాంబినేషన్స్‌                           25
                   అకౌంటింగ్‌ ్క్ష రిపోర్టింగ్‌
సి                గ్రూప్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌               25
డి               డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌              25
                 రిపోర్టింగ్‌
             గవర్నమెంట్‌ అకౌంటింగ్‌ ఇన్‌                  15 
                ఇండియా
 
 
 
కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ (పేపర్‌ 19)
సెక్షన్‌ ఎలో కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ (60 మార్కులు), సెక్షన్‌ బిలో ఇంటర్నల్‌ ఆడిట్‌ అండ్‌ ఆపరేషనల్‌ ఆడిట్‌ (20 మార్కులు), సెక్షన్‌ సిలో కేస్‌ స్టడీ ఆన్‌ పర్ఫార్మెన్స్‌ ఎనాలిసిస్‌ (20 మార్కులు) ఉంటాయి. ఇవి ఫైనల్‌ పరీక్షల్లో అత్యంత కఠినమైన వని చెప్పవచ్చు. అయినప్పటికీ సిఎంఏ ఇనిస్టిట్యూట్‌ రిలీజ్‌ చేసిన సప్లిమెంటరీ మెటీరియల్‌పై ఎక్కువ దృష్టి పెడితే మంచి మార్కులు తెచ్చుకొనే వీలుంటుంది.
కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ పైనా, స్కానర్‌లోని ప్రశ్నల పైనా, చాప్టర్‌ చివర ఇచ్చే సారాంశాలపైనా శ్రద్ధ పెట్టాలి. ఆపరేషనల్‌ ఆడిట్‌, మేనేజ్‌మెంట్‌ ఆడిట్‌ అంశాలపై కాన్సెప్ట్యువల్‌ ఐడియా అవసరం. సెక్షన్‌ సిలో 20 మార్కులకు కేస్‌ స్టడీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
 
ఫైనాన్షియల్‌ ఎనాలిసిస్‌ అండ్‌ బిజినెస్‌ వాల్యుయేషన్‌ (పేపర్‌ 20)
సెక్షన్‌ ఎలో ఫైనాన్షియల్‌ ఎనాలిసిస్‌ (50 మార్కులు), సెక్షన్‌ బిలో బిజినెస్‌ వాల్యుయేషన్‌ (50 మార్కులు) ఉంటాయి ఇది పూర్తిగా ప్రాబ్లమేటిక్‌ పేపర్‌ కాబట్టి చాలా తేలికగా 60కి పైగా మార్కులు సాధించవచ్చు. స్టడీ మెటీరియల్‌తోపాటు స్కానర్‌లోని ప్రశ్నలను సాధన చేస్తే చాలు.
ఫైనల్‌కి సన్నద్ధత
శిక్షణ సమయంలోనే రోజుకి రెండు పేపర్లను పునశ్చరణ చేసుకోవాలి. విద్యార్థులు ఎవరికివారు సొంతంగా ఫాస్ట్‌ ట్రాక్‌ నోట్స్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. ప్రాబ్లమ్స్‌ సాధన చేస్తున్నపుడే అనవసరం అనుకున్నవాటిని తీసివేస్తూ వెళ్లడం వలన పునశ్చరణ సులువవుతుంది.
ఫార్ములాలన్నింటినీ ఒకేచోట రాసుకోవాలి (నోట్‌బుక్‌లో). ఫ్లో ఛార్ట్స్‌ వేయడం ప్రాక్టీస్‌ చేయాలి. పాత ప్రశ్నాపత్రాలను అభ్యాసం చేయడం ప్రయోజనకరం. స్టడీ మెటీరియల్‌, ఆర్‌టిపి, యంటిపి, పిటిపి ల్లోని ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి. ఈ ప్రశ్నలకు జవాబులు ఎలా సూచించారో నిశితంగా పరిశీలించాలి.
సిలబస్‌లోని అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రతి ఛాప్టర్‌ వెయిటేజీని చూసుకోవాలి. ఛాప్టర్‌ మొదటి పేజీలో వెయిటేజీ తాలూకు వివరాలు ఉన్నాయి. క్వశ్చన్‌ పేపర్‌ తయారుచేసేటపుడు సిఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ కచ్చితంగా వెయిటేజీ నిబంధనలను పాటిస్తుంది. అందుకే ప్రతి విద్యార్థి ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి.
గతంలోలాగ ప్రతి పేపర్‌లో టాపిక్‌ వైజ్‌ వెయిటేజీ కాకుండా సెక్షన్‌ వైజ్‌ వెయిటేజీకి మార్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశించిన సబ్జెక్టుల్లోనే.. అంటే సెలక్టివ్‌ స్టడీ విధానంలో సన్నద్ధం కాకూడదు. ప్రతీ అంశంపై అవగాహన అవసరం.