వీడియో ఇంటర్వ్యూలో ఈ పొరపాట్లు వద్దు JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
వీడియో ఇంటర్వ్యూలో ఈ పొరపాట్లు వద్దు
సాధారణంగా అభ్యర్థులుసంప్రదాయ ఇంటర్వ్యూకు ఇచ్చినంత అటెన్షన్‌ వీడియో లేదా టెలీఫోన్‌ ఇంటర్వ్యూలకు ఇవ్వరు. దీంతో మంచి స్కిల్స్‌ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా వీడియో ఇంటర్వ్యూల సమయంలో సమాధానాలు సరిగ్గానే చెప్పినప్పటికీ బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్సింగ్‌, లొకేషన్‌ తదితరాలను పట్టించుకోకపోవడంతో అభ్యర్థిపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల కొన్ని రిక్రూటింగ్‌ ఏజెన్సీలు జరిపిన సర్వేల్లో కూడా ఇదే వెల్లడైంది.
 
ఆరు వందల మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఇంటర్వ్యూ చేసిన స్టాఫింగ్‌ ఏజెన్సీ ఒకటి వీడియో ఇంటర్వ్యూల్లో అభ్యర్థులు చేస్తున్న ప్రధాన పొరపాట్లను గుర్తించింది. ఇవన్నీ కూడా అభ్యర్థుల నాన్‌ సీరియ్‌సనె్‌సను తెలుపుతున్నాయని పేర్కొంది. వాటిలో మూడింటిని ప్రముఖంగా హైలైట్‌ చేసింది.
 
అవరోధాలు: టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు పదేపదే చెబుతున్న మాట ఇది. అక్కడున్న కెమెరాలను పెంపుడు జంతువులు పక్కకు లాగడం, ఇంటర్వ్యూ మధ్యలో కుటుంబ సభ్యులతో మాట్లాడడం వంటి వాటివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతోందని రిక్రూటర్లు అంటున్నారు.
 
అనుచిత ప్రవర్తన: కొంత మంది అభ్యర్థులు వీడియో ఇంటర్వ్యూను సాదాసీదా వ్యవహారంగా తీసుకుంటున్నారు. అతి సౌకర్యంగా ఫీలవుతున్నారు. మంచంమీద కూర్చొనో లేదా సోఫాలో జారగిలపడో మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఏదో తింటూ, దుస్తులు వేసుకుంటూ, వీడియో గేమ్స్‌ ఆడుతూ కనిపిస్తుంటారు..
 
లొకేషన్‌పరంగా ఇబ్బంది: మరికొంత మంది ఇంటర్వ్యూ అని డాబాపైకి లేదా ఇంటి బాల్కనీలోకి వెళాతారు. అంతవరకు బాగానే ఉన్నా ఔట్‌డోర్‌లో ఎక్కువ శబ్దాలు ఉంటాయి. ఇవన్నీ అభ్యర్థి మాటను రిక్రూటర్‌కు వినిపించకుండా చేసే అవకాశం ఉంది. అక్కడి శబ్దాలకు ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాదు. అస్సలు మాటలు వినిపించవు.
 
ఇంటర్వ్యూని అభ్యర్థులు సీరియ్‌సగా తీసుకోనందువల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ఆర్థిక సంస్థలో సీనియర్‌ పొజిషన్‌ కోసం ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. రెజ్యూమే చాలా బాగుంది. అందులో పేర్కొన్న విషయాలు సైతం చాలా వరకు నిజం. అయితే వీడియో ఇంటర్వ్యూ సమయంలో వెబ్‌కామ్‌ ముందు కూర్చున్న తీరు ఎబ్బెట్టుగా ఉంది. స్నానానికి వెళ్ళే ముందు వేసుకునే డ్రెస్‌తో ఉన్నాడు. తల సరిగ్గా దువ్వుకోలేదు. చివరకు కట్టుడు పళ్ళను సైతం పెట్టుకోలేదు. వంటగది కనిపిస్తోంది. వెనక ఫ్రిడ్జ్‌ ఉంది. భరించశక్యం కాని గొంతుతో ఆ ఇంటర్వ్యూ సాగింది. యావత్తు వ్యవహారం ఒక హారిబుల్‌ అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఎంపికను ఇక ఊహించుకోవచ్చు.
ఉద్యోగానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియలో ప్రతి దశ కీలకమే అన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించటం లేదు. వెబ్‌కామ్‌ ముందు సరిగ్గా కూర్చుని కనిపించడం అన్నది వీడియో ఇంటర్వ్యూలకు సంబంధించి ముఖ్యమైన అంశం. అది లైవ్‌ కావచ్చు. లేదంటే ప్రీ రికార్డెడ్‌ ఇంటర్వ్యూ కావచ్చు. ఏదైనా మొదట కుదురుగా కూర్చోడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ వరుసలో.....
 
కాల్‌ రావడానికి ముందే: వీడియో ఇంటర్వ్యూకి సంబంధించి కాల్‌ అందుకోవడానికి ముందే దాని కోసం ట్రై చేస్తుంటారు. వెక్కిళ్ళు వంటివి నివారించడానికి తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ప్రిరికార్డెడ్‌ అయిన పక్షంలో మార్గదర్శకాలు తెలుసుకోవాలి. అలాగే ప్రి రికార్డెడ్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నకు స్పందించేందుకు మూడు నిమిషాలకు మించి సమయం ఇవ్వరు.
 
హోమ్‌ వర్క్‌ తప్పనిసరి: ప్రత్యక్షమైనా, వీడియో ఇంటర్వ్యూ అయినా సరే, సదరు కంపెనీ వెబ్‌సైట్‌ను లోతుగా అధ్యయనం చేయాలి. ముందుగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. సొంతగా రూపొందించుకున్న ప్రశ్నలతో ముందుకు రావాలి. అలాగే తమ నేపథ్యం, లక్ష్యాలు, అచీవ్‌మెంట్స్‌పై మాట్లాడేందుకు సన్నద్ధం కావాలి. రెజ్యూమె కాపీని పక్కన ఉంచుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది.
సరైన ప్లేస్‌లో కూర్చోవాలి: ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో సరైన కమ్యూనికేషన్‌ ఉండేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కూర్చున్న గదికి తలుపులు మూసుకుని పెట్టుకోవాలి. తద్వారా అవాంతరాలను అధిగమించవచ్చు. అనుకోని ఇబ్బందులు ఎదురైన పక్షంలో వెంటనే క్షమాపణలు కోరడం చాలా మంచిది. ఫలితంగా అభ్యర్థి మెచ్యూరిటీ అంతకు మించి ప్రొఫెషనలిజం వ్యక్తమవుతుంది.
 
బాస్‌ ఆలోచనల్లోకి: రిక్రూటర్‌ ఆలోచనల్లోకి మమేకం కావాలి. అంటే వారి ఆలోచనలను అర్థం చేసుకోవాలి. అసలు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఏమి అడుగుతున్నారు, మననుంచి మరేమి కోరుకుంటున్నారు అన్నవి గమనించాలి. మధ్యలో వేరే కాల్‌ తీసుకోవడం, బెడ్‌ రూమ్‌లో కూర్చోవడం అలాగే అక్కడ చిందరవందరగా మన దుస్తులు ఉంచడం చేస్తే రిక్రూటర్‌కు మనపై మంచి అభిప్రాయం కలుగదు.
 
ఫాలోఅప్‌ తప్పనిసరి: ఇంటర్వ్యూ పూర్తయిన తరవాత, అది ఏ రూపంలో ఉన్నప్పటికీ ఫాలోఅప్‌ తప్పనిసరి. అలా చేస్తేనే అభ్యర్థికి వృత్తిపై అసక్తి ఉందన్న విషయం వెల్లడవుతుంది. ఇంటర్వ్యూ పూర్తయిన తరవాత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ-మెయిల్‌ పంపించాలి. అలా చేయడంవల్ల అందరిలో మీ ప్రత్యేకత వ్యక్తమవుతుంది.