అందుకోండి 'స్మార్ట్' ఉద్యోగాలు JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
అందుకోండి 'స్మార్ట్' ఉద్యోగాలు
యాప్స్‌ డెవలప్‌మెంట్‌లో మంచి నైపుణ్యం ఉంటే ఉద్యోగమే చేయనవసరం లేదు, సొంతంగా కూడా కెరీర్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. మీ యాప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లోగానీ, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోగాని పబ్లిష్‌ చేయవచ్చు. సెల్లింగ్‌ యాప్స్‌, ఇన్‌ - యాప్‌ అడ్వర్టయిజింగ్‌, ఇన్‌ - యాప్‌ సేల్స్‌ తదితర ఛానెల్స్‌ ద్వారా సంపాదించవచ్చు.
 
స్మార్ట్‌ ఫోన్‌లు లేని జీవితాలను ఊహించలేని దశకు చేరుకున్నాం. ఇంట్లో సరుకులు కొనడం దగ్గర్నుంచి, పిల్లల ఫీజులు చెల్లించడం వరకు అన్నీ యాప్‌ల ద్వారానే జరిగిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌లు, యాప్‌ల సంస్కృతి బాగా విస్తరించడంతో ఈ రంగంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక నైపుణ్యాలతోపాటు సృజనాత్మక డిజైన్‌లు, నవ్యత్వంతో కూడిన యాప్‌లు తయారుచేయగలిగితే స్మార్ట్‌ కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.
 
యాప్స్‌ మార్కెట్‌లో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానాన్ని ఆక్రమించింది. పోటీవల్ల మొబైల్‌ యాప్స్‌ కూడా నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. అన్ని రకాల సేవలు యాప్‌ల రూపంలో అందుబాటులోకి వస్తున్నాయి. టెలివిజన్‌, ఇన్‌ కార్‌ నేవిగేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, షాపింగ్‌, కామర్స్‌, బ్యాంకింగ్‌ రంగాలకు కూడా యాప్‌ సంస్కృతి విస్తరించింది. తద్వారా నిపుణుల అవసరం పెరుగుతోంది.
 
మూడు లక్షల ఉద్యోగాలు
సమీప భవిష్యత్తులో ఈ రంగం ఉద్యోగావకాశాల కల్పనలో ముందుండనుంది. మొబైల్‌ యాప్స్‌లో నూతన ఆవిష్కరణలకు ఆదరణ పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే సమర్థవంతులైన డెవలపర్స్‌ కోసం కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతోంది. 2020 నాటికి సుమారు మూడు లక్షల మంది యాప్‌ డెవలపర్స్‌ అవసరమవుతారని ఐటి రిక్రూటర్స్‌ చెబుతున్నారు. వీటిలో సింహభాగాన్ని ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యాప్స్‌ ఆక్రమిస్తాయి. అందువల్ల ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. నవ్యత్వంతోపాటు అత్యంత సరళతరమైన యాప్‌లను రూపొందించే సత్తా పెంచుకోవాలి.
 
యాప్‌ డెవలపర్‌ కావాలంటే...
మొబైల్‌ వినియోగదారుల్లో అన్ని వయోవర్గాలకు చెందినవారు ఉంటారు. ముఖ్యంగా యువతకు ఆకట్టుకొనే రీతిలో డిజైన్‌లు, యాప్‌లు తయారుచేయడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి సి, సి++, జావా వంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో పట్టు ఉండాలి. ఐ ఫోన్స్‌, ఐపాడ్స్‌, ఆండ్రాయిడ్స్‌లో మెరుగైన అప్లికేషన్స్‌ రాయడానికి ఈ స్కిల్‌ తోడ్పడుతుంది.
 
ఏ కోర్సులు చేయాలి?
మొబైల్‌ యాప్‌ డెవలపర్‌గా స్థిరపడాలంటే సాఫ్ట్‌వేర్‌ డిజైనింగ్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ కంప్యూటింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉండాలి. లేదా ప్రొగ్రామింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌ ప్రధానాంశాలుగా ప్రత్యేక కోర్సులు చేసినవారు కూడా ఈ రంగంలో నిలదొక్కుకోగలుగుతారు.
 
మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రధానాంశంగా ఎంటెక్‌ కోర్సులు చేయవచ్చు.
ఆన్‌లైన్‌ కోర్సుల నిర్వహణలో పేరు పొందిన Udacity, గూగుల్‌ సహకారంతో ప్రాథమిక దశ నుంచి అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ వరకు కోర్సులు నిర్వహిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐ ఫోన్‌ రెంటికీ ఉపయోగపడేలా అత్యంత సులభమైన పద్ధతుల్లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ని అందిస్తోంది.
 
ఎన్నో రకాల అవకాశాలు
స్మార్ట్‌ ఫోన్‌ టెక్నాలజీ రంగంలో యాప్‌ డెవలప్‌మెంట్‌తోపాటు ఎన్నో రకాల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. హ్యాండ్‌సెట్ల తయారీ, బాగుచేయడం, మెయింటెనెన్స్‌ మాత్రమే కాకుండా వైర్‌లెస్‌ మొబైల్‌ టెక్నాలజీకి సంబంధించి అవకాశాలు ఉంటాయి. మొబైల్‌ ఫోన్‌ సిస్టం ఇంజనీర్‌, అప్లికేషన్స్‌ డెవలపర్‌, అప్లికేషన్స్‌ టెస్టింగ్‌ స్పెషలిస్ట్‌, ఐప్యాడ్‌ డెవలపర్‌, గేమ్‌ డెవలపర్‌, మొబైల్‌ ఆర్కిటెక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫారమ్‌ ఆర్కిటెక్ట్‌, టెక్నీషియన్స్‌, ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్‌ మెకానిక్‌, టవర్‌ ఇన్‌స్టాలేషన్‌ ్క్ష మెయింటెనెన్స్‌ ఇంజనీర్‌, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌, కస్టమర్‌ కేర్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌, కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.
 
ఎలాంటి కోర్సులు చేయాలి?
మొబైల్‌, స్మార్మ్‌ ఫోన్‌ టెక్నాలజీ రంగంలో ప్రవేశించాలంటే మొబైల్‌ కంప్యూటింగ్‌, వైర్‌లెస్‌, టెలి కమ్యూనికేషన్‌, నెట్‌వర్కింగ్‌ సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ తప్పనిసరి. ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, మొబైల్‌ అండ్‌ నెట్‌వర్క్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో బిఇ / బిటెక్‌; వైర్‌లెస్‌ సెన్సార్‌ నెట్‌వర్క్స్‌, ఐటి- మొబిలిటీ, మొబైల్‌ టెక్నాలజీ అండ్‌ బిజినెస్‌ ప్రధానాంశాలుగా ఎంటెక్‌ చేసినవారిని స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. మొబైల్‌ టెక్నాలజీ, వైర్‌లెస్‌ నెట్‌వర్కింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసినా మంచిదే. టెలీ కమ్యూనికేషన్స్‌, వైర్‌లెస్‌ నెట్‌వర్క్స్‌, మొబైల్‌ కంప్యూటింగ్‌, మొబిలిటీ, సెక్యూరిటీ, వైర్‌లెస్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో పిహెచ్‌డి చేసిన అభ్యర్థులకు మంచి డిమాండ్‌ ఉంది.
 
షేర్‌ పాయింట్‌ అండ్‌ మొబైల్‌ ఎక్స్‌పర్ట్‌
ఈ విభాగంలో ప్రవేశించాలనుకునే అభ్యర్థులకు మైక్రోసాఫ్ట్‌ షేర్‌ పాయింట్‌ 2007 / 2010లో నైపుణ్యం ఉండాలి. వర్క్‌ ఫ్లోస్‌, సొల్యూషన్స్‌, టెంప్లేట్స్‌, ఇంటెగ్రేషన్‌ ఆఫ్‌ షేర్‌ పాయింట్‌ వంటి అప్లికేషన్లతోపాటు ఎఎస్‌పి.నెట్‌, ఎడిఒ.నెట్‌, ఎస్‌క్యుఎల్‌, సిల్వర్‌ లైట్‌లో పూర్తి పరిజ్ఞానం అవసరం. కె2 బ్లాక్‌ పెరల్‌, కనెక్ట్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఇన్‌ఫో పాత్‌, కస్టమ్‌ వెబ్‌ పార్ట్‌ డెవలప్‌మెంట్‌, డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫీచర్స్‌ డెవలప్‌మెంట్‌ ఆధారంగా వర్క్‌ ఆటొమేషన్‌ చేయగలగాలి. ఫీచర్స్‌, అప్లికేషన్‌ ్క్ష సైట్‌ పేజెస్‌, వెబ్‌ పార్ట్స్‌, కస్టం లిస్ట్‌ టైప్స్‌, సైట్‌ కాలమ్స్‌, కంటెంట్‌ టైప్స్‌, కస్టం వర్క్‌ఫ్లోస్‌, సైట్‌ డెఫినిషన్స్‌, ఇన్‌ఫో పాత్‌ ఫార్మ్స్‌ డిజైన్‌ ్క్ష పబ్లిషింగ్‌, బిడిసి, ఎక్సెల్‌ క్యాలుక్యులేషన్‌ సర్వీసెస్‌, షేర్డ్‌ సర్వీసెస్‌లో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్‌ ఉంది.
 
మొబైల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డిజైనర్‌
డిజైన్‌, యుఐలను వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారుస్తుండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వెబ్‌ డిజైనింగ్‌, కొత్త టెక్నాలజీల్లో అవగాహన ఉంటే తేలిగ్గా ఈ ఉద్యోగాలను సాధించవచ్చు. వైర్‌ఫ్రేమ్స్‌ క్రియేషన్‌తోపాటు మొబైల్‌ వెబ్‌, ఐ ఫోన్‌, ఆండ్రాయిడ్‌లలో అప్లికేషన్‌ డిజైన్‌ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
మొబైల్‌ రిపేర్‌ ఇంజనీర్‌
అభ్యర్థులకు బేసిక్‌ ఎలకా్ట్రనిక్స్‌లో పట్టు ఉండాలి. ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసినవారు కూడా ప్రయత్నించవచ్చు. మొబైల్‌ని రిపేర్‌ చేయడంలో పూర్తి పరిజ్ఞానంతోపాటు బిజిఏ, మైక్రో బిజిఏ ఐసి రీప్లేస్‌మెంట్లలో పనితనం ఉండాలి. ఫాల్ట్‌ అనాలిసిస్‌, రిమూవల్‌ టెక్నిక్స్‌ తెలిసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
సర్టిఫికేషన్‌లు ఉంటే మంచిది
బీటెక్‌ / ఎంటెక్‌ కోర్సులతోపాటు ఆథరైజ్డ్‌ సర్టిఫికేషన్‌లు కూడా ఉద్యోగవేటలో అభ్యర్థులకు చాలా ఉపయోగపడతాయి. సర్టిఫికేషన్‌లు కొన్ని...
OESF ఆథరైజ్డ్‌ సర్టిఫికేషన్‌ ఇంజనీర్‌ ఫర్‌ ఆండ్రాయిడ్‌
బ్లాక్‌ బెర్రీ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ బ్లాక్‌ బెర్రీ
విండోస్‌ ఫోన్‌ డెవలపర్‌ ఫర్‌ విండోస్‌ మొబైల్‌
ఐఔస్‌ డెవలపర్‌ ప్రోగ్రామ్‌
CompTIA మొబైల్‌ యాప్‌ సెక్యూరిటీ +
ఒరాకిల్‌ సర్టిఫైడ్‌ అసోసియేట్‌ (OCA)
ఒరాకిల్‌ సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ (OCP)
అభ్యర్థులకున్న విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని కంపెనీలు మంచి వేతనాలను ఆఫర్‌ చేస్తున్నాయి. రూ. 4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.