ఉద్యోగం కావాలంటే అప్‌డేషన్‌ తప్పనిసరి JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఉద్యోగం కావాలంటే అప్‌డేషన్‌ తప్పనిసరి
జాబ్‌ మార్కెట్‌.. ప్రతిభావంతులకు ఎప్పుడూ రెడ్‌ కార్పెట్‌ వెలకమ్‌ చెబుతూనే ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పదుల సంఖ్యలో ఉండే అవకాశాలకు వేలల్లో పోటీ పడుతుంటారు. అయినా గెలిచేది, నిలచేది టాలెంట్‌ ఉన్నా ఆ పది మంది మాత్రమే. ఆ పది మందికి సాధ్యమైంది మిగతా వారికి ఎందుకు అసాధ్యమైంది? ఇతరుల కంటే వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించడం, ఒక విషయాన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించడం వంటి లక్షణాలే వారిని విజేతలుగా నిలబెడతాయి. ఈ నేపథ్యంలో సక్సెస్‌ఫుల్‌ జాబ్‌ సీకర్‌కు ఉండాల్సిన లక్షణాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
 
జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. తదనుగుణంగా జాబ్‌ సెర్చ్‌ వ్యూహాలను జాబ్‌ సీకర్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు కొన్ని అంశాల్లో అప్‌డేట్‌ కావాల్సి ఉంటుంది. సకె ్సస్‌ఫుల్‌ జాబ్‌ సీకర్‌గా నిలవాలంటే కొన్ని లక్షణాలు అలవర్చుకోవాలి. ఇవి సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌కు పునాది వేయడంతోపాటు పర్సనల్‌/ప్రొఫెషనల్‌ గ్రోత్‌కు దోహదపడతాయి.
భిన్నంగా నూతనంగా  చాలా మంది అవకాశాల కోసం ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల్లో సెర్చ్‌ చేస్తుంటారు. ఆ సందర్భంగా కనిపించిన వెకెన్సీ నోటిఫికేషన్‌ చూడగానే రెజ్యూమె ఫార్వర్డ్‌ చేస్తుంటారు. దాంతో అంతా జరుగుతుందనే భావనలో ఉంటారు. అది సరికాదు. ప్రస్తుతం పోటీ బాగా పెరిగింది. కాబట్టి మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సక్సెస్‌ఫుల్‌ జాబ్‌ సీకర్‌గా నిలవాలంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాలి. జాబ్‌ సీకర్‌గా నిత్యం క్రీయాశీలంగా ఉండాలి. జాబ్‌ సెర్చింగ్‌లో నూతన/ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టాలి. రెజ్యూమె ఫార్వర్డ్‌ చేయడమే కాకుండా కార్పొరేట్‌ అలూమ్ని గ్రూప్‌, ఫ్రెండ్స్‌, సీనియర్స్‌ ఇలా పరిచయం ఉన్న వారితో నిత్యం టచ్‌లో ఉండాలి. తద్వారా వారిలో ఏవరైనా తమ దృష్టిలో ఉన్న అవకాశాలకు మిమ్మల్ని రిఫర్‌ చేయవచ్చు. అంతేకాకుండా మీరు చేసిన ప్రాజెక్ట్‌ ద్వారా కంపెనీ హెచ్‌ఆర్‌ను నేరుగా ఆప్రోచ్‌ కావచ్చు. తద్వారా కూడా అవకాశం దక్కవచ్చు. ఇలా మీకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సద్వినియోగించుకునే ప్రయత్నం చేయాలి.
 
ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా
ప్రస్తుతం జాబ్‌ సెర్చింగ్‌ అనేది పూర్తిగా డిజిటల్‌ మోడ్‌లోకి మారిపోయింది. ఇటువంటి నేపథ్యంలో సక్సెస్‌ఫుల్‌ జాబ్‌ సీకర్‌గా నిలవాలంటే ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. రిక్రూటర్లు కూడా ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ ద్వారా తమకు కావల్సిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే అర్హతలు, నైపుణ్యాలు, అఛీవ్‌మెంట్స్‌, గత అనుభవం వంటి అంశాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అయితే రిక్రూటర్లు రెజ్యూమెతోపాటు అదనపు సమాచారం కోసం ఆన్‌లైన్‌/సోషల్‌ మీడియాలో మీ రెప్యూటేషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఆన్‌లైన్‌ ప్రొఫైల్‌ను జాబ్‌ సెర్చ్‌కు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. జాబ్‌/ఇండస్ర్టీకి సంబంధించిన కీ వర్డ్స్‌ ప్రొఫైల్‌ హెడ్డింగ్‌లో ఉండేలా చూసుకోవాలి. సంబంధిత రంగంలోని లేటెస్ట్‌ న్యూస్‌, అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ఉండాలి. తద్వారా ఆ రంగంపై మీకున్న నాలెడ్జ్‌, ఆసక్తి రిక్రూటర్లకు అర్థమవుతుంది. అంతేకాకుండా సంబంధిత గ్రూప్స్‌లోని ఇండస్ర్టీ నిపుణులు, ప్రొఫెషనల్స్‌తో ఇంటారాక్ట్‌ అవుతూ ఉండాలి.
 
ఏదో ఒక ప్రేరణ
ప్రతి మనిషి విజయం సాధించడానికి ఏదో ఒక ప్రేరణ తప్పనిసరి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంతో విజయం సాధించడానికి ప్రేరణ ఎంతో ముఖ్యం. కొందరికి ప్రోత్సాహం ద్వారా ప్రేరణ లభిస్తుంది. మరికొంత మంది చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్న ఆలోచన నుంచి ప్రేరణ పొందుతుంటారు. ఆ విధంగా మిమ్మల్ని విజయం దిశగా ప్రేరేపిస్తున్న అంశం ఏమిటి? ముందుగా దాన్ని అన్వేషించండి. అదే జాబ్‌ సీకర్‌గా మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చూపిస్తుంది.
నాలెడ్జ్‌, స్కిల్స్‌ అప్‌డేట్‌
జాబ్‌ సీకర్‌గా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం సంబంధిత రంగానికి చెందిన నాలెడ్జ్‌, స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండటం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. జాబ్‌కు కావల్సిన స్కిల్స్‌ అన్నీ మీలో ఉన్నాయి అనే భావన రిక్రూటర్‌లో కలగాలి. ఆన్‌లైన్‌ కోర్సులు, వెబినార్స్‌, వర్క్‌షాప్స్‌ ద్వారా స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. వీటన్నింటిని రెజ్యూమెలో అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. ఎందుకంటే డిగ్రీ పూర్తికాగానే చేస్తున్న ప్రయత్నాల వల్ల రెజ్యూమెలో గ్యాప్‌ కనిపిస్తుంది. ఆ గ్యాప్‌ను నాలెడ్జ్‌, స్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవడానికి సద్వినియోగం చేసుకున్నాడనే భావన కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ అంశం గ్యాప్‌ ఫిల్లర్స్‌గాను ఉపయోగపడుతుంది.
 
గణంకాల రూపంలో
మరో కీలక అంశం విషయాన్ని స్పష్టంగా వివరించడం. ఆన్‌లైన్‌/రెజ్యూమెలో మీరు సాధించిన విజయాలనుగణంకాల రూపంలో వివరిస్తే ప్రభావవంతంగా ఉంటుంది. ఉదాహరణకు చదువుకునే రోజుల్లో మీరు చేసిన ఒక సైన్స్‌ ప్రాజెక్ట్‌ వల్ల కాలేజీకి రెండు లక్షల రూపాయలు ఆదా ఆయ్యాయి. ఆ విషయాన్ని గణంకాల రూపంలో ప్రస్తావించాలి. ఒక వేళ జాబ్‌ చేస్తుంటే.. మీ నైపుణ్యంతో కంపెనీ ఎంత శాతం లాభం సాధించిందో గణంకాల సహాయంతో వివరించాలి. తద్వారా మీ నైపుణ్యంపై రిక్రూటర్లకు అంచనా ఏర్పడుతుంది. కాబట్టి ఆఛీవ్‌మెంట్స్‌ను నెంబర్స్‌ రూపంలో ప్రెజెంట్‌ చేయడం సక్సెస్‌ఫుల్‌ జాబ్‌ సీకర్‌కు ఉండాల్సిన మరో లక్షణం. అంతేకాకుండా మీరు ఎంచుకున్న రంగంలోని జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులపై అవగాహనతో ఉండాలి. ఈ విషయాలను ఆన్‌లైన్‌తోపాటు రెజ్యూమెలో కూడా పొందుపరడం మర్చిపోవద్దు.
 
ఫిట్‌గా హెల్దీగా
శారీరకంగా ఫిట్‌గా ఉండడం కూడా అవసరం. సౌండ్‌ మైండ్‌ ఇన్‌ ఏ సౌండ్‌ బాడీ అన్నారు. మనం ఎంత చురుగ్గా, ఫిట్‌గా ఉంటే మొదడు కూడా అంతే చురుగ్గా ఉంటుంది. తద్వారా ఎటువంటి ఒత్తిడి దరిచేరదు. జాబ్‌ సెర్చ్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చినా వాటిని స్పోర్టివ్‌గా తీసుకుని ముందుకు సాగడానికి కావాల్సిన ఆత్మ విశ్వాసం లభిస్తుంది. కాబట్టి రోజు ఎక్సర్‌సైజ్‌ చేస్తూ, హెల్దీ డైట్‌ తీసుకుంటూ ఎటువంటి ప్రతికూల ఆలోచనలు దగ్గరకు రాకుండా పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలి. అప్పుడే సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ను లీడ్‌ చేయగలం.