మంచి ఇంక్రిమెంట్‌ కావాలా.. ఇలా చేయండి JobCorner-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
మంచి ఇంక్రిమెంట్‌ కావాలా.. ఇలా చేయండి
జాబ్‌ పరంగా మంచి పనితీరును కనబరిచారు. అయినా ఆశించిన విధంగా ప్రమోషన్‌, శాలరీ ఇంక్రిమెంట్‌ లభించలేదు. ఈ విషయాన్ని మేనేజర్‌తో ఏవిధంగా డిస్కషన్‌ చేయాలి? అందుకు ఏవిధంగా సిద్ధం కావాలి? వంటి అంశాలను చూద్దాం..
 
శాలరీని పోల్చుకోవాలి
ప్రస్తుత శాలరీని, అదే జాబ్‌ రోల్‌కు మార్కెట్‌ స్టాండర్డ్స్‌పరంగా లభిస్తున్న శాలరీని పోల్చుకోవాలి. ఆన్‌లైన్‌ శాలరీ చెక్కర్‌ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు.
సరైన సమయం
ఇటువంటి విషయాలను చర్చిండానికి సమయం కూడా కీలకమే. కాబట్టి బిజినెస్‌ అవర్స్‌లో కాకుండా రోజులో సెకండాఫ్‌ను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే అప్పుడు మేనేజర్స్‌ కొంత రిలాక్స్‌డ్‌గా కనిపిస్తారు.
ముందే అవగాహన
ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అంశాలపై ముందే అవగాహనతో ఉండటం మంచిది. డిస్కషన్‌ ఆశించిన మేరకు లేకుంటే రాజీనామా చేస్తాను అనే బెదిరింపు ధోరణిలో మాట్లాడకూడదు. ఎంత శాలరీ ఆశిస్తున్నారనే విషయంలో ఒక అంచనా ఉండాలి.
పని తీరు
పని తీరు ఆధారంగా శాలరీ ఇంక్రిమెంట్‌, ప్రమోషన్‌ గురించి మాట్లాడటం మంచిది. ఇందుకు గడచిన ఆరు నెలల కాలంలో మీరు సాధించిన విజయాలతో ఒక రిపోర్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ ఇవ్వాలి.
ఫ్యూచర్‌
కంపెనీ పని తీరు మెరుగుపరచడానికి మీ దగ్గర ఉన్న వ్యూహాలను ఉదాహరణలతో వివరించాలి. కంపెనీ రెవెన్యూ పెరగడానికి దోహదపడే ఐడియాలను కూడా ఇవ్వాలి. ఇది ప్రమోషన్‌ అవకాశాలను మెరుగుపరుస్తుంది.
క్లియర్‌ పిక్చర్‌
ఎంత ఇంక్రిమెంట్‌ ఆశిస్తున్నారు అనే విషయంలో ఒక స్పష్టతతో ఉండాలి. అంతేకాకుండా కంపెనీ మీ నుంచి ఏమి ఆశిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంగా ఎస్‌, నో కంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడూ అనే ప్రశ్నలను అడగటం మంచిది.