డిజిటల్‌ జమానాలో నయా జాబ్స్‌ JobCorner-Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
డిజిటల్‌ జమానాలో నయా జాబ్స్‌
ప్రపంచాన్నే శాసిస్తున్న టెక్‌ రెవల్యూషన్‌ ఇంటర్నెట్‌. భవిష్యత్‌లో జరిగే ప్రతి అవిష్కరణ ఇంటర్నెట్‌ కేంద్రంగానే ఉండబోతోంది. ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌ రూపకల్పన, ప్రొడక్ట్‌ బ్రాండింగ్‌ వంటి అన్నిటికి ఆన్‌లైన్‌ మాధ్యమాలే ఆధారంగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ సైట్లకు హ్యాకింగ్‌ రూపంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలను మేనేజ్‌ చేసేందుకు దోహదపడే నెక్ట్స్‌ జనరేషన్‌ జాబ్స్‌కు ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. న్యూఏజ్‌ జాబ్స్‌గా వ్యవహరిస్తున్న అటువంటి జాబ్స్‌లో కొన్ని..
 
న్యూ ఏజ్‌ జాబ్స్‌లో అధిక శాతం కమ్యూనిటీలు, బ్లాగ్స్‌, సోషల్‌ నెట్‌వర్క్‌(ఫేస్‌బుక్‌, లింక్డన్‌ వంటివి) వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌ ఆధారంగానే బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
 
గ్రోత్‌ హ్యాకర్స్‌
ఆన్‌లైన్‌ వీక్షకుల ప్రెజెన్స్‌ ఆధారంగా బాధ్యతలు నిర్వహించే నెట్‌ సావే పర్సన్‌ను ‘గ్రోత్‌ హ్యాకర్స్‌గా వ్యవహరిస్తారు. కమ్యూనిటీలు, బ్లాగ్స్‌, సోషల్‌ నెట్‌వర్క్‌ (ఫేస్‌బుక్‌, లింక్డన్‌ వంటివి) వంటి మాధ్యమాల్లో నిర్ణీత కాలంలో వెబ్‌సైట్‌ను ఎంత మంది వీక్షించారు, జరిగిన బిజినెస్‌ వంటి అంశాలపై గ్రోత్‌ హ్యాకర్స్‌ పని చేస్తారు. ఈ క్రమంలో వెబ్‌సైట్లు, సోషల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, నెట్‌వర్క్‌లలో ఆన్‌లైన్‌ వీక్షకుల సంఖ్యను మెరుగుపరిచే బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైనవి రూపొందించడం, అనుసరించడం అనే బాధ్యతలు కూడా గ్రోత్‌ హ్యాకర్స్‌ పరిధిలో ఉంటాయి.
 
సర్క్యూట్‌ డిజైన్‌ స్పెషలిస్ట్‌
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌ అన్ని బ్యాటరీ ఆధారంగా పనిచేస్తున్నాయి. దీంతో అధిక కాలం మన్నేలా రూపొందే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌ లేదా 3డి డిజైన్‌ సర్క్యూట్‌ బోర్డ్స్‌ భారీగా అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు సర్క్యూట్స్‌ బోర్డ్స్‌ లేదా చిప్స్‌, సెన్సార్స్‌తో కూడిన మల్టీ పర్పస్‌సర్క్యూట్‌ బోర్డ్స్‌ను డెవలప్‌ చేసే నిపుణులను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి.
 
ఇన్‌ఫ్లూయెన్షియల్‌ మార్కెటర్స్‌
ప్రభావితం చేయగల(ఇన్‌ఫ్లూయెన్స్‌) వ్యక్తులను అన్వేషించడం ఇన్‌ఫ్లూయెన్షియల్‌ మార్కెటర్స్‌ బాధ్యత. వీరు ముందుగా కమ్యూనిటీలు, బ్లాగ్స్‌, సోషల్‌ నెట్‌వర్క్‌(ఫేస్‌బుక్‌, లింక్డిన్‌..) వంటి వాటిల్లో ఎక్కువ మంది అనుసరించే (ఫాలోవర్స్‌) వారిని గుర్తిస్తారు. తరవాత తమ బ్రాండ్‌ను ఆయా ఆన్‌లైన్‌ సైట్లలో ప్రచారానికి వారి సేవలను వినియోగించుకునేలా మేనేజ్‌ చేయడం ఇన్‌ఫ్లూయెన్షియల్‌ మార్కెటర్స్‌ బాధ్యత. మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తులు ఈ జాబ్‌ రోల్స్‌కు సరిపోతారు.
 
కమ్యూనిటీ మేనేజర్స్‌
ఆన్‌లైన్‌లో వివిధ రకాల వినియోగదారులు ఉంటారు. వారీ అభిరుచులు, ఆసక్తులు వేర్వేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వారివారి అభిరుచి, ఆసక్తులను గుర్తించి అందుకు అనుగుణమైన బ్రాండ్స్‌ను ఆన్‌లైన్‌లో ప్రమోట్‌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి బాధ్యతలను నిర్వహించడానికి కంపెనీలు కమ్యూనిటీ మేనేజర్స్‌ను నియమించు కుంటున్నాయి. ఆన్‌లైన్‌లో ఒక బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయడం కమ్యూనిటీ మేనేజర్స్‌ విధి. ఇందుకు వీరు ఆన్‌లైన్‌లో తమదైన సోషల్‌ ఐడెంటిని క్రియేట్‌ చేసుకుంటారు. దీని ద్వారా సంబంధిత వినియోగదారులలో తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తుంటారు.
 
డిజిటల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌
ఒక వైబ్‌సైట్‌, బ్లాగ్‌, కమ్యూనిటిలో పబ్లిష్‌ అయిన కంటెంట్‌ మొత్తానికి డిజిటల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌దే బాధ్యత. ఆయా సైట్లలో ఉపయోగించిన టెక్ట్స్‌, ఇమేజెస్‌, ఆడియో, వీడియో, మల్టిమీడియా ఎలిమెంట్స్‌ వంటివన్నీ ఇతని పర్యవేక్షణలోనే జరుగుతాయి. డిజిటల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కెరీర్‌ ప్రారంభిచాలంటే కంటెంట్‌ను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా, ఆన్‌లైన్‌లో ఎలా ప్రెజెంట్‌ చేయాలి అనే విషయాల్లో ఒక అవగాహన ఉండాలి. దాంతోపాటు ఇందుకు ఉపకరించే సాఫ్ట్‌వేర్‌, మల్టిమీడియా టూల్స్‌ వంటి సాంకేతిక అంశాలపై కూడా పరిజ్ఞానం తప్పనిసరి.
 
సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్టక్చర్‌
ఐటీ రంగం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ భద్రత పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో వివిధ సంస్థల వెబ్‌సైట్లు హ్యాకర్ల దాడికి గురికావడం, కొన్ని సంస్థల డేటాను తస్కరించడమే ఇందుకు తార్కాణం. దీంతో కంపెనీలు హ్యాకింగ్‌ నుంచి తమ సర్వర్లను కాపాడుకోవడానికి సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్‌వర్క్‌ సెక్యూరిటీ డెవలపర్స్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ప్రోగ్రామర్స్‌కు లక్షల్లో వేతనాలు చెల్లించి మరీ నియమించుకుంటున్నాయి.
 
డిజిటల్‌ స్టోరీ టెల్లర్‌
సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆన్‌లైన్‌ సైట్లలో కంటెంట్‌ను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఆడియో, వీడియో ఫార్మాట్స్‌ ఆధారంగా ప్రెజెంట్‌ (రాయడం) చేసే బాధ్యతను డిజిటల్‌ స్టోరీ టెల్లర్స్‌ నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం కంటెంట్‌ బేస్డ్‌ వెబ్‌సైట్లు అన్నీ ఇన్ఫోగ్రాఫిక్స్‌, ఆడియో, వీడియో, స్లయిడ్‌షోస్‌ను కలిగి ఉంటున్నాయి. అంతేకాకుండా వీటికే వీక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ తరహాలో కంటెంట్‌ను ప్రెజెంట్‌ చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
 
ఎథికల్‌ హ్యాకర్స్‌
ఎథికల్‌ హ్యాకర్స్‌ లీగల్‌గానే వెబ్‌సైట్స్‌ను హ్యాక్‌ చేస్తుంటారు. ఇందుకు వారికి కొన్ని కంపెనీలు వేతనాలు కూడా చెల్లిస్తాయి. ఆన్‌లైన్‌ సెక్యూరిటీ సిస్టమ్‌లోని లోపాల ఆధారంగా కోడ్స్‌ను బ్రేకప్‌ చేయడం ద్వారా హ్యాకింగ్‌ చేయడం ఈ రోజుల్లో సర్వ సాధారణమైంది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఆన్‌లైన్‌ లోపాలను తెలుసుకోవడానికి డబ్చులిచ్చి మరీ ఎథికల్‌ హ్యాకర్స్‌ ద్వారా వెబ్‌సైట్స్‌ను హ్యాకింగ్‌ను చేయించుకుంటాయి. తద్వారా ఏవైనా లోపాలు కనిపిస్తే వాటిని సరిదిద్దుకుంటున్నాయి. ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది ఇంటర్నెట్‌ సెక్యూరిటీ జాబ్‌. కంప్యూటర్స్‌, ఆన్‌లైన్‌ సైట్స్‌పై సుదీర్ఘ సమయం గడిపే ఆసక్తి ఉన్న వారికి ఈ కెరీర్‌ చక్కగా సరిపోతుంది.