అండర్‌ క్వాలిఫైడ్‌.. స్మార్ట్‌గా డీల్‌ చేయాలి JobCorner-Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
అండర్‌ క్వాలిఫైడ్‌.. స్మార్ట్‌గా డీల్‌ చేయాలి
ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మాధ్యమం ఏదైనా హైరింగ్‌ కాలమ్‌ చూడగానే జాబ్‌ సీకర్స్‌ అటెన్షన్‌ అటువైపే వెళుతుంది. సంబంధిత వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇన్నాళ్ళూ ఎదురు చూస్తున్న అవకాశం ఇదేనేమో అనే ఆలోచన మొదలవుతుంది. అంతే ఉత్సాహంతో హైరింగ్‌ నోటిఫికేషన్‌ను చదవడం ప్రారంభిస్తాం.
 
అందులో పేర్కొన్న కొన్ని అర్హతలు మనలో ఉంటే, మరికొన్ని ఉండకపోవచ్చు. అంటే సదరు జాబ్‌కు అండర్‌ క్వాలిఫైడ్‌ అన్నమాట. దాంతో అప్లయ్‌ అనే ఆప్షన్‌ను ఫ్రీజ్‌ చేయడానికి వెనుకడుగు వేస్తాం. అయితే ఈ అంశాన్ని నెగిటివ్‌గా కాకుండా స్ఫూర్తిగా తీసుకుంటే ఎన్నో అవకాశాలు ముంగిట నిలుస్తాయి. కొంత స్మార్ట్‌ వర్క్‌ చేయటం ద్వారా అండర్‌ క్వాలిఫైడ్‌ కూడా విన్నర్‌గా మారవచ్చు. అది ఎలాగో చూద్దాం..
ఏదైనా జాబ్‌ నోటిఫికేషన్‌లోనే దానికి కావాల్సిన అర్హత, నైపుణ్యాలను స్పష్టంగా పేర్కొంటారు. అయితే అందులో పేర్కొన్న వాటి కంటే తక్కువ అర్హతలు ఉంటే దానిని అండర్‌ క్వాలిఫైడ్‌గా భావించవచ్చు. చాలా మందికి ఇటువంటి సమస్య ఎదురవుతుంది. కాకపోతే సదరు జాబ్‌ పట్ల అవగాహన, నైపుణ్యాలు వంటి అంశాల్లో మిమ్మల్ని మీరు బెస్ట్‌గా బ్రాండింగ్‌ చేసుకుంటే అండర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ అవకాశం దక్కవచ్చు.
 
రెండూ కీలకం
అండర్‌ క్వాలిఫైడ్‌ అయినప్పటికీ జాబ్‌కు అప్లయి చేస్తున్నప్పుడు కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. టెక్నికల్‌ స్కిల్స్‌, జాబ్‌ను ఎంత సమర్థంగా నిర్వహించగలరు అనేవే ఆ రెండూ. వాస్తవానికి ఆ రెండూ అంశాలపైనే ఎంప్లాయర్స్‌ దృష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాబ్‌ను నిర్ణయించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. మోడ్రన్‌ వర్క్‌ప్లేస్‌లో టెక్నికల్‌గా, జాబ్‌ నిర్వహణకు సంబంధించి మీకున్న నాలెడ్జ్‌తో ఎంప్లాయర్‌ను ఆకట్టు కోగలిగితే అండర్‌ క్వాలిఫైడ్‌ అనే అడ్డంకిని సులువుగా అధిగమించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వడానికి ఎంప్లాయర్‌ వెనుకాడక పోవచ్చు.
 
సాఫ్ట్‌గా
ఒక్కోసారి హైరింగ్‌ కాలమ్‌లో పేర్కొన్న విధంగా హార్డ్‌ స్కిల్స్‌(సంబంధిత ఇండస్ర్టీ కోరుకునే ప్రత్యేకమైన టెక్నికల్‌ స్కిల్స్‌) ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జాబ్‌ నిర్వహణలో హార్డ్‌ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌(కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, జట్టుగా పని చేసేందుకు సంసిద్ధత, నాయ కత్వ లక్షణాలు వంటివి) కూడా కీలకం. హార్డ్‌ స్కిల్స్‌ పోలిస్తే సాఫ్ట్‌ స్కిల్స్‌కు చాలా మంది ఎంప్లాయర్స్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
 
ఎందుకంటే వర్క్‌ప్లేస్‌ను సాఫ్ట్‌ స్కిల్స్‌ అత్యంత ప్రభావితం చేస్తాయి. ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి ప్రొడక్టవిటీని పెంచుకోవడానికి ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. అందుకే సాఫ్ట్‌ స్కిల్స్‌పరంగా ఎంప్లాయర్స్‌తో మీరు బెస్ట్‌ అనిపించు కోవాలి. ఇందుకు విద్యార్థిగా ఉన్నప్పుడు లేదా మరే ఇతర సందర్భంలోనైనా సాఫ్ట్‌ స్కిల్స్‌ను ఉపయోగించి ఎటువంటి విజయాలు సాధించారో ఆసక్తిగా వివరించాలి. ఇది పాజిటివ్‌గా పని చేస్తుంది. హార్డ్‌ స్కిల్స్‌లో శిక్షణనిచ్చి తరవాత జాబ్‌లోకి తీసుకునే అవకాశాన్ని ఎంప్లాయర్‌ కల్పించవచ్చు.
 
రెడీ టు లెర్న్‌
అండర్‌ క్వాలిఫైయిడ్‌ ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన మరో కీలక విషయం నేర్చుకునే సంసిద్ధత. కొంత మంది ఎంప్లాయర్స్‌ కావాల్సిన అర్హతలు లేనప్పటికీ, నేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండే వారిని నియ మించుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొంత అనుభవం ఉన్న వారితో పోల్చితే ఇటువంటి వారికి కంపెనీ అవసరాలకు అనుగుణంగా శిక్షణనిచ్చి బెస్ట్‌గా తీర్చిదిద్దడం సులభమని భావించడమే దీనికి కారణం. కాబట్టి నేర్చుకోవడంలో స్వీయప్రేరణ, కొత్త విషయాలను, మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవడానికి చూపే ఆసక్తిని ఎంప్లాయర్‌ గమనించేలా వ్యవ హరించాలి. రెడీ టు లెర్న్‌గా ఉండాలి. నేను అండర్‌ క్వాలిఫైడ్‌ కావచ్చు కాకపోతే నేర్చుకోవడంలో మాత్రం కాదు, నేర్చుకోవడానికి దీన్ని మంచి అవకాశంగా భావిస్తాను అనే తరహాలో సమాధానం ఇవ్వాలి.
 
స్కిల్స్‌ ఉంటే
ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ అకడమిక్స్‌ కంటే స్కిల్స్‌కే ప్రాధాన్యం ఇస్తోంది. కాబట్టి మీలోని నైపుణ్యాలను ఒక్క సారి విశ్లేషించుకోవాలి. ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. మిగతా వారితో పోల్చినప్పుడు ఆ నైపుణ్యం మిమ్మల్ని స్టాండవుట్‌గా నిలుపుతుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించండి. ఇది అప్లయ్‌ చేసిన జాబ్‌కు ఏవిధంగా ప్రయోజనకరమో విశ్లేషించాలి.
 
దాని ఆధారంగా సదరు జాబ్‌కు మీరే బెస్ట్‌ అనే విధంగా మిమ్మల్ని మీరు బ్రాండింగ్‌ చేసుకోవాలి. ఉదాహరణకు లెక్కలు బాగా చేయగలుగుతారు. కానీ అకౌంటింగ్‌లో అనుభవం లేదు. కాబట్టి లెక్కలు బాగా చేసే నైపుణ్యం అకౌంటింగ్‌లో ఎలా ఉపయోగపడుతుందో వివరించి ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు జాబ్‌ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.