చిన్నప్పుడే తల్లిదండ్రుల మరణం.. నేడు గ్రూప్-2 ర్యాంకర్ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
చిన్నప్పుడే తల్లిదండ్రుల మరణం.. నేడు గ్రూప్-2 ర్యాంకర్
గ్రూప్‌-2లో రాయలసీమ జోన్‌లో 3వ ర్యాంక్‌
ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం సాధించిన విజయ్‌కుమార్‌

పత్తికొండ, కర్నూలు జిల్లా, ఏప్రిల్‌ 15: కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంజనీరింగ్‌ చదువులో రాణించాడు. ఇంజనీరింగ్‌ పోటీ విపరీతంగా ఉండడం, ఉద్యోగ అవకాశాలు ఇబ్బందికరంగా ఉండడంతో చదువు పూర్తి అయిన మూడేళ్లు ఖాళీగానే కాలం గడిపేశాడు. ఆ సమయంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలను సొంతంగా రాసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో వీఆర్వో రాతపరీక్షల్లో జిల్లా స్థాయి ర్యాంక్‌ సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన ఆ యువకుడు ఆ తరువాత గ్రూప్‌-2 పరీక్షలకు ప్రత్యేక కోచింగ్‌ తీసుకున్నాడు. రాయలసీమ జోన్‌లో 3వ ర్యాంక్‌సాధించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ అధికారిగా ఉద్యోగం సాధించారు. ఎప్పటికైనా గ్రూప్‌-1ను సాధించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నా డు పత్తికొండ పట్టణానికి చెందిన విజయ్‌ కుమార్‌..
 
పత్తికొండ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు, నాగరత్నమ్మ దంపతులకు శివకుమార్‌, విజయ్‌కుమార్‌ సంతానం. గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు విజయ్‌కుమార్‌కు 10ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు గుండెపోటుతో చనిపోయాడు. ఆ తరువాత భర్త ఉద్యోగాన్ని పొందిన నాగరత్నమ్మ కుటుంబ బాధ్యతను చేపట్టారు. అయితే భర్త చనిపోయిన 5ఏళ్లకే అనారోగ్యంతో మృతి చెందారు. అయితే నాన్నమ్మతోపాటు బంధువుల సహకారంతో అన్నదమ్ముళ్లు ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. 2012లో అన్న శివ కుమార్‌ గ్రామపంచాయతీలో క్లర్క్‌గా ఉద్యోగం సాధించి తమ్ముడు విజయ్‌కుమార్‌ చదువుకు తనవంతు సహకారాన్ని అందించారు. దీంతో విజయ్‌కుమార్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. అయితే ఇంజనీరింగ్‌లో ఉద్యోగ అవకాశాలకు ఉన్న ఇబ్బందులను చూసి నిరుత్సాహపడ్డాడు.
 
మూడేళ్లు నిరుద్యోగిగా కాలం గడిపాడు. ఆ సమయంలోనే సివిల్స్‌వైపు దృష్టి సారించిన విజయ్‌కుమార్‌ గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు సొంతంగా చదివి హాజరయ్యాడు. విజయం సాధించలేకపోయాడు. 2014లో వీఆర్వో రాత పరీక్షలకు హాజరై జిల్లాలో రెండో ర్యాంక్‌ను సాధించి ఆదోని రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు. ఈ నేపథ్యం లోనే గ్రూపు-2 నోటిఫికేషన్‌ రావడంతో 9 నెలలుపాటు ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాద్‌లో ప్రత్యేక కోచింగ్‌ తీసుకుని రాయలసీమ జోన్‌ బీసీ-బీ క్యాటగిరిలో 3వ ర్యాంక్‌, ఓపెన్‌ క్యాటగిరిలో 45వ ర్యాంక్‌ను సొంతం చేసుకుని ట్యాక్స్‌ డిపార్టమెంట్‌లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ పన్నుల అధికారిగా ఉద్యోగం సాధించాడు. సివిల్స్‌ తన ప్రస్థానం ఇంతటితో ఆగిపోదని గ్రూప్‌-1లో మంచి ఫలితం సాధించడమే లక్ష్యమని విజయ్‌ కుమార్‌ చెబుతున్నారు.