గేట్‌ కటాఫ్‌ ఎంత..? Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
గేట్‌ కటాఫ్‌ ఎంత..?
గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌).. ఇంజనీరింగ్‌ పీజీ కోర్సుల్లో చేరడంతోపాటు పీఎస్‌యూల్లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్స్‌, ట్రైనీ ఇంజనీర్స్‌ కొలువుల భర్తీకి పరిగణనలోకి తీసుకొనే పరీక్ష. ఈ ఏడాది గేట్‌ వ్యవహారాలను ఐఐటీ - గౌహతి పర్యవేక్షించింది. ఈ నెల 3, 4, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా 199 కేంద్రాల్లో గేట్‌ - 2018 పరీక్షను నిర్వహించారు. ఇటీవలి సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి గేట్‌ పరీక్ష కొంత సులభంగా ఉన్నట్టు నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో ముఖ్యమైన బ్రాంచ్‌లకు సంబంధించి విశ్లేషణ...
 
గతేడాదితో పోల్చితే ఈ సారి గేట్‌ పరీక్షలో కొన్ని పేపర్లు క్లిష్టంగా, మరికొన్ని మధ్యస్తంగా ఉన్నాయి. చాలా వరకు కాన్సెప్ట్‌ బేస్డ్‌గా ప్రశ్నలను అడగటానికి ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఫండమెంటల్స్‌ (ప్రాథమిక్‌ భావనలు), కోర్‌ కాన్సెప్ట్స్‌పై పట్టు ఉన్నవారు ఈ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తిస్తారు. గేట్‌ పరీక్షలో మొత్తం 23 సబ్జెక్ట్‌ పేపర్లు ఉన్నాయి. ప్రతి పేపర్‌లో 65 ప్రశ్నలు ఇచ్చారు. కేటాయించిన మార్కులు 100. సమాధానాలను ఇవ్వడానికి మూడు గంటల సమయం కేటాయించారు. న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు, మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉన్నాయి. ఫలితాలను మార్చి 23న ప్రకటిస్తారు.
 
ఈసీఈ
ఈసీఈ సబ్జెక్టు ప్రశ్నల రూపకల్పనలో కూడా ప్రాథమిక భావనలకు ప్రాధాన్యం ఇచ్చారు. కామన్‌ అంశాలు మినహాయిస్తే కోర్‌ సబ్జెక్టు ప్రశ్నలు కొంచెం కష్టమే. రెండు సెషన్లలో విభాగాల వారీగా ఇచ్చిన వెయిటేజీ.. ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ (29 మార్కులు), ఎలక్ర్టానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్‌ (22 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (30 మార్కులు), సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్‌ (21 మార్కులు), డిజిటల్‌ సర్క్యూట్స్‌ (22 మార్కులు) కంట్రోల్‌ సిస్టమ్‌ (20 మార్కులు).
 
గత కటాఫ్‌ మార్కులు
సంవత్సరం    జనరల్‌     ఓబీసీ     ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌
2017    25.00    22.50     16.60
2016    25    22.5     16.6
2015    25    22.5     16.67
2014    25.56    23.01     17.04
2013    25    22.25     16.67
 
సివిల్‌ ఇంజనీరింగ్‌
సివిల్‌ ఇంజనీరింగ్‌లో ప్రశ్నలు కాన్సెప్ట్‌ బేస్డ్‌గా ఉన్నాయి. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, జియోటెక్నికల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ అంశాలకు అధిక వెయిటేజీ ఇచ్చారు. స్ట్రక్చరల్‌ అనాలిసిస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌, సీఎంఎం, స్టీల్‌ స్ట్రక్చర్‌ అంశాలు కొంత వరకు కఠినంగా ఉన్నాయి.
 
గత కటాఫ్‌ మార్కులు
సంవత్సరం    జనరల్‌     ఓబీసీ     ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌
2017    28.7    25.8    19.1
2016    25    22.5    16.6
2015    25    22.5    16.67
2014    26.57    23.91    17.71
2013    27.13    24.42    18.09
 
మెకానికల్‌
ఈ పేపర్లో అడిగిన ప్రశ్నలు భావలన ఆధారంగా ఉన్నాయి. ఇతర విభాగాలతో పోల్చుకుంటే జనరల్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథమెటిక్స్‌ సులభమని భావించవచ్చు. కోర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు 50 శాతం సులభంగా, 30 శాతం మధ్యస్తంగా, 20 శాతం క్లిష్టంగా ఉన్నాయి.
 
రెండు సెషన్లలో ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ (27 మార్కులు), ఇంజనీరింగ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (33 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (30 మార్కులు) విభాగాలకు అధిక ప్రాధాన్యం లభించింది.
 
తరవాత మెకానిక్స్‌ మెటీరియల్‌ (22 మార్కులు), థర్మోడైనమిక్స్‌ (22 మార్కులు), థియరీ ఆఫ్‌ మెకానిక్స్‌ (15 మార్కులు), ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ (19 మార్కులు) వెయిటేజీ ఇచ్చారు.
 
గత కటాఫ్‌ మార్కులు
సంవత్సరం    2017    2016    2015    2014    2013
జనరల్‌    32.87    29.6    32.73    28.86    25
ఓబీసీ     29     26.6     29.46     25.97    22.25
ఎస్సీ /ఎస్టీ
/ పీహెచ్‌     21     19.7     21.82     19.24    16.67
 
సీఎస్‌
సీఎస్‌లో అడిగిన ప్రశ్నలు కూడా ఎక్కువగా భావనల చుట్టూ తిరిగాయి. కామన్‌ అంశాలైన జనరల్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథమెటిక్స్‌ విభాగాలు సులభమని చెప్పవచ్చు. సీఎస్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు 50 శాతం సులభంగా, 30 శాతం మధ్యస్తంగా, మిగతావి కష్టంగా ఉన్నాయి.
 
ఈ పేపర్‌లో విభాగాల వారీగా ఇచ్చిన వెయిటేజీ.. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (15 శాతం), కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (11 శాతం), డిస్ర్కిట్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ గ్రాఫ్‌ థియరీ (12 శాతం), ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్‌ (10 శాతం), ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (10 శాతం), ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ (7 శాతం), థియరీ ఆఫ్‌ కంప్యూటేషన్‌ (7 శాతం), కంపైలర్‌ డిజైన్‌ (6 శాతం).
 
గత కటాఫ్‌ మార్కులు
సంవత్సరం    జనరల్‌     ఓబీసీ     ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌
2017    25.00    22.50    16.60
2016    25.00    22.50    16.60
2015    25.00    22.50    16.67
2014    25    22.25    16.67
2013    25    22.25    16.67
 
ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌
ఇందులో అడిగిన ప్రశ్నలు చాలా కాన్సెప్ట్‌ బేస్డ్‌గా నేరుగా ఉన్నాయి. పవర్‌ ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ర్టికల్‌ మెకానిక్స్‌, పవర్‌ సిస్టమ్‌ సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యం లభించింది. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల క్లిష్టత మధ్యస్తంగా ఉంటే, ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌, పవర్‌ ఎలక్ర్టానిక్స్‌, కంట్రోల్‌ సిస్టమ్‌, సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్‌, పవర్‌ సిస్టమ్‌ విభాగాలు క్లిష్టంగా ఉన్నాయి. ఈ పేపర్‌లో విభాగాల వారీగా ఇచ్చిన వెయిటేజీ.. జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (15 శాతం), కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (11 శాతం), ఎలక్ర్టికల్‌ మెకానిక్స్‌ (12 శాతం), పవర్‌ సిస్టమ్స్‌ (10 శాతం), పవర్‌ ఎలక్ర్టానిక్స్‌ (10 శాతం), కంట్రోల్‌ సిస్టమ్‌ (8 శాతం), అనలాగ్‌ సర్క్యూట్స్‌ (8 శాతం), నెట్‌వర్క్‌ థియరీ (8 శాతం), డిజిటల్‌ సర్క్యూట్స్‌ (7 శాతం).
 
గత కటాఫ్‌ మార్కులు
సంవత్సరం    జనరల్‌     ఓబీసీ    ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌
2017    25.20    25.20    16.70
2016    25.1    22.5    16.7
2015    25    22.5    16.67
2014    25    22.5    16.67
2013    25.74    23.17    17.16
 
2018 కటాఫ్‌ (అంచనాలు)
పేపర్‌కోడ్‌    బ్రాంచ్‌    జనరల్‌    ఓబీసీ    ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌
సీఎస్    కంప్యూటర్‌ సైన్స్‌    26    23     17
బీటీ    బయోటెక్నాలజీ    39    34     22
ఈఈ    ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌     26    24    17
సీహెచ్    కెమికల్‌ ఇంజనీరింగ్‌     40     36    22
ఐన్    ఎలక్ర్టానిక్స్‌ అండ్‌
ఇన్‌స్ట్రుమెంటేషన్‌    35    27     19
ఈసీ    ఎలక్ర్టానిక్స్‌ అండ్‌
కమ్యూనికేషన్‌     26     23    17
సీఈ    సివిల్‌ ఇంజనీరింగ్‌     29     25    18
ఎంఈ    మెకానికల్‌ ఇంజనీరింగ్‌    33     28    21