సివిల్స్‌ రాస్తానంటే...ముందు పది పాసవ్వమన్నారు... Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
సివిల్స్‌ రాస్తానంటే...ముందు పది పాసవ్వమన్నారు...
అడుగడుగునా నిరుత్సాహపరిచారు..
మీడియం బిడియం అక్కర్లేదు, పట్టుదలే ముఖ్యం
19ఏళ్లకే టీచర్‌ ఉద్యోగం వచ్చింది.. పట్టుదలతో గ్రూప్స్‌కు ప్రిపేరయ్యా..
చదువంతా సర్కారీబడి తెలుగు మీడియంలోనే..
చిన్నప్పటి నుంచే అధికారి కావాలనుకున్నా..
ఐఏఎస్‌ హోదా కల్పించడం ఆనందంగా ఉంది..
ఆంధ్రజ్యోతితో జాయింట్‌ కలెక్టర్‌ హరిత
 
సివిల్స్‌ సాధిస్తానంటే ముందు పదో తరగతి పాసవమని పరిహసించారు.. పట్టుదలతో గ్రూప్స్‌-1లో ర్యాక్‌ సాధించి అందరిచేత శభాష్‌ అనిపించు కున్నారు.. జాయింట్‌ కలెక్టర్‌ ముండ్రాతి హరిత. 19ఏళ్ల వయసులోనే ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత గ్రూప్స్‌ ప్రిపేరయ్యానని పేర్కొన్నారు. లక్ష్యం నిర్ధేశించుకుని కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అంటున్నారు. తను పుట్టింది మధ్యతరగతి కుటుంబంలోనేనని, చదువంతా ప్రభుత్వ బడిలో తెలుగు మీడియంలోనే సాగిందన్నారు. ఇంగ్లీష్‌ రాదన్న భావన నుంచి బయటపడాలని సూచిస్తున్నారు. ఇటీవలే ఐఏఎస్‌ హోదా రావడం సంతోషంగా ఉందని, జేసీ ఆంధ్రజ్యోతితో తన అనుభవాలను వెల్లడించారు.
 
పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిం చవచ్చని.. ప్రతీ ఒక్కరు లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు కుసాగాలని అంటున్నారు జాయింట్‌ కలెక్టర్‌ ముండ్రాతి హరిత. ఇటీవల ఆమెకు ఐఏఎస్‌ హోదా కల్పించడంపై ఆనందం వ్యక్తంచేస్తూ ఆంధ్రజ్యోతితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.
 
మా అన్నయ్య ఫ్రెండ్స్‌ అనడంవల్లే...
మాది మధ్య తరగతి కుటుంబం. మొత్తం ఏడుగురం. నలుగురు అమ్మాయిలం, ముగ్గురు మగవాళ్లు. తెలుగు మీడి యం సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ఆవరేజ్‌ స్టూడెంట్‌ని. నేను తొమ్మిదో తరగతి చదివే సమయమది. ఒకరోజు మా అన్నయ్య మిత్రులంతా ఒక దగ్గర కూర్చుని, జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆ అంశంపై మాట్లాడుకుంటున్నారు. నేను ఆ చర్చలోకి వెళ్లి నేను సివిల్స్‌ సాధించాలని అనుకుంటున్నాను అన్నాను. అంతే ఒక్కసారి వాళ్లంతా నువ్వు ముందు పది పాస్‌ అవ్వు అన్నారు. నేను చాలా బాధపడ్డాను. నేను నిజంగా పాస్‌ కాలేనా, సివిల్స్‌ ర్యాంకు నాకు రాదా అని ప్రశ్నించుకున్నాను. ఆ రోజు నా లక్ష్యమేంటో తెలిసింది. దానివైపు కష్టపడ్డాను. ఆనాడు పడిన కష్టం ఫలితంగానే జాయింట్‌ కలెక్టర్‌ అయ్యాను. నా సేవలను గుర్తించి ప్రభుత్వం ఐఏఎస్‌ హోదా కల్పించడం ఆనందంగా ఉంది.
 
కోచింగ్‌ సెంటర్‌లో నో...
హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ ఇచ్చే ఓ ప్రముఖ సంస్థ నా సర్టిఫికేట్లను చూసి మీకు కష్టమన్నారు. కారణం అడిగితే తెలుగుమీడియం బ్యాంక్‌ గ్రౌండ్‌తో సివిల్స్‌ కష్టమని వాళ్ల అభిప్రాయం. అక్కడ లాభం లేదని, మా స్నేహితుల మెటీరియల్‌తో పాటుగా, ఇతర వార్తా పత్రికల్లో సివిల్స్‌ సాధించిన వారి తీరు, వాళ్ల మెటీరియల్‌ను రోజుకు 18గంటల పాటు చదివాను. నేను ప్రీపేర్‌లో ఉన్న సమయంలో మా తమ్ముడు
మెడిసిన్‌ సీటు కోసం ఎంసెట్‌కు చదువుతున్నాడు. ఇద్దరం కలిసి 20గంటల పాటు చదివేవాళ్లం. చివరకు కళ్ల కింద కురుపులు కావడంతో ఆడియో సిస్టంలో రికార్డు చేసుకొని వింటూ చదువుకున్నాం. 2003లో సివిల్స్‌ కంటే ముందుగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చింది. దానికి దరఖాస్తు చేశాను. 2004 లో ప్రిలీమ్స్‌, 2005లో మెయిన్స్‌, 2006లో ఇంటర్వ్యూ లు జరిగాయి. ఐదేళ్ల అనంతరం 2006-07లో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం మెరిట్‌లో వచ్చింది. ఐదేళ్ల పాటు గ్రూప్‌-1పై నమ్మకంతో చదవడంతో సివిల్స్‌లో దృష్టి పెట్టలేదు.
 
కఠోర శ్రమే విజయానికి దారి
మనపై మనకు నమ్మకం ఉండాలి. పోటీ ప్రపంచంలో పట్టుదలతో చదివితే అన్నీ సాధ్యమే. తెలుగు మీడియం అంటూ ఏవో సాకులతో మనకు మనమే తప్పించుకోవద్దు. సాకుల కారణంతో లక్ష్యాన్ని వదిలిపెట్టుకోకుండా విజయం సాధించడానికి దారులను ఎంచుకోవాలి. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చా. మా కుటుంబంలో గొప్ప ఉద్యోగం చేసిన వారు లేరు. మా ఊళ్లో బాగా చదివేవాళ్లంతా నాతో పోటీ పరీక్షలు రాసేవాళ్లు. నేను ఆవరేజీగా చదివేదాన్ని. నాకు అవకాశాలు రావని వాళ్లు అనుకునే వాళ్లు. అలాంటి వాళ్లకంటే ముందే నాకు ఉద్యోగం రావడంతో వాళ్లు ఖంగుతిన్నారు. అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించాలి. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తే అన్నీ సాధ్యమే.
 
చదువంతా తెలుగు మీడియంలోనే...!
మాది పూర్వపు మెదక్‌ జిల్లా సిద్దిపేట. నా చదవంతా ప్రభుత్వ పాఠశాలనే. తెలుగు మీడియంలోనే చదివాను. పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ తర్వాత హిస్టరీ, ఎకనామిక్స్‌ అంశాలుగా ఇంటర్‌ల హెచ్‌ఈసీ గ్రూపు తీసుకున్నాను. ఎనిమిదో తరగతి నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంటి దగ్గరుండే చిన్నపిల్లలం అప్పట్లో లభించే చందమామ, బాలభారతం లాంటి పుస్తకాలను చదవేవాళ్లం. అలా మొదలైన పుస్తకపఠనం ఆ తర్వాత అలవాటుగా మారింది. చాలా వేగంగా 300 పేజీల పుస్తకాలను సైతం సునాయాసంగా చదివే స్థాయికి చేరుకున్నాను. ఇంటర్‌ విద్యను తెలుగులో పూర్తి చేసిన అనంతరం అప్పటి నుంచే కాంపిటేటివ్‌ పరీక్షలకు సిద్ధమయ్యాను. 1994లో ఇంటర్‌ పూర్తికాగానే టీటీసీ చేశాను. ఈ తర్వాత 1995లో ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. 19ఏళ్ల సమయంలోనే నాకు ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది.
 
డబ్బులుంటనే కొలువు వస్తుందన్నారు....
హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే భయమేసింది. తెలుగు మీడియంలో చదివిన నాకు గ్రూప్స్‌లో అవకాశం వస్తుందా అనే ఆలోచన ఉక్కిరిబిక్కిరి చేసింది. నాతో ఉన్నవాళ్లందరూ నీకేం వస్తుంది అంటూ కామెంట్‌ చేసేవాళ్లు. ఒక్కరు కూడా వస్తుందని చెప్పలేదు. అలాంటి సమయంలో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ 1999లో వచ్చింది. ఏపీపీఎస్సీలో డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటారని పోటీ పరీక్షలు రాసే సమయంలో అందరు నన్ను నిరుత్సాహపరిచారు. టీచర్‌ ఉద్యోగం చేస్తూ లీవ్‌ పెట్టి చాలా పట్టుదలతో చదివి గ్రూప్‌-2 రాశాను. ఊహించినట్టుగానే 6వ జోన్‌లో మహిళా టాపర్‌గా నిలిచా ను. వాణిజ్య పన్నుల విభాగంలో ఎస్‌టీవోగా రెండో ఉద్యోగం వచ్చింది. రెండోసారి మెరిట్‌లో ఉద్యో గం రావడంతో కష్టపడితే వస్తుందనుకున్నాను.
 
జాతకం చెప్పేవాళ్లు డిగ్రీ చేయవన్నారు...
మా ఊళ్లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో ఓ జాతకం చెప్పే ఆయన నన్ను చూసి నువ్వు డిగ్రీ చేయవన్నారు. ఇదేంటీ బాగానే చదువుతున్నా, ఇలా ఎందుకు చెప్పాడని ఆలోచించా. ఇదే సమయంలో నాన్న చనిపోవడంతో డిగ్రీకి అడ్డంకులు పడ్డాయి. ఎవరి మీద ఆధార పడకూడదని మెరిట్‌ ద్వారా వచ్చిన టీచర్‌ ఉద్యోగంలో చేరా. సిద్దిపేట నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని శివంపేట పాఠశాలలో పోస్టింగ్‌ వచ్చింది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఎలాగైనా డిగ్రీ చేసి జాతకం తప్పు అని నిరూపించాలని ఉద్యోగం చేస్తూనే ఉస్మానియా యూనివర్సిటీలో 1995లో వన్‌ సిట్టింగ్‌ దూరవిద్య ద్వారా డిగ్రీలో చేరాను. పాఠశాలలో బోధన చేస్తూనే విరామ సమయంలో వెంట తెచ్చుకున్న రాజ్యాంగంకు సంబంధించిన పుస్తకాలు చదివాను. సిద్దిపేట దాటి ఇతర ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లింది లేదు. అలాంటిది నా లక్ష్యం కోసం హైదరాబాద్‌ బాట పట్టాను.