బీటెక్ తర్వాత పీహెచ్‌డీ... నెలకు రూ.75 వేల ఫెలోషిప్‌ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బీటెక్ తర్వాత పీహెచ్‌డీ... నెలకు రూ.75 వేల ఫెలోషిప్‌
పరిశోధనలపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మంచి అవకాశం. మేథో వలసను నిరోధించడంతోపాటు దేశంలో ఆవిష్కరణలకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక బడ్జెట్‌లో ‘ప్రైమ్‌ మినిస్టర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (పీఎంఆర్‌ఎఫ్‌)’ పథకాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద 1000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.75 వేల ఫెలోషిప్‌ను అందజేస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ. 1,800 కోట్లను కేటాయించింది. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధిత విశేషాలు..
 
గతేడాది వివిధ కంపెనీల సీఈఓలతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి సమావేశ మయ్యారు. మేకిన్‌ ఇండియాను మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) రంగాలకు రెట్టింపు కేటాయిం పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో పోల్చితే ఆర్‌ అండ్‌ డీపై మనదేశం చేస్తున్న ఖర్చు స్వల్పమే. గత రెండు దశాబ్దాలుగా జీడీపీలో 0.6-0.7 శాతాన్ని మాత్రమే ఇందుకు కేటాయిస్తున్నట్లు ఆర్థిక సర్వే 2017-18 పేర్కొంది. కాబట్టి పరిశోధనలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అందులో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో పీఎంఆర్‌ఎఫ్‌ ఒకటి. వాస్తవానికి ప్రతిపాదన కొత్తదేమీ కాదు. గతేడాది సెప్టెంబరు 7న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తూ.. పరిశోధనల దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభావంతులైన వెయ్యి మంది విద్యార్థులకు నెలకు రూ. 75 వేల స్కాలర్‌షిప్‌ను అందజేస్తామని వెల్లడించారు. ఇప్పుడు దాన్ని కేంద్ర బడ్జెట్‌లో చేర్చారు.
 
అర్హులు
ఐఐటీ, నిట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), ఐఐఎస్సీ, ఐఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) తదితర ప్రధాన విద్యా సంస్థ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
మంచి ప్రతిభావంతులై ఉండాలి. 8 సీజీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ కొంత కఠినంగా ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉన్న ఉత్తమ విద్యార్థులనే ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
 
లక్ష్యాలు - చర్యలు
పీఎంఆర్‌ఎఫ్‌ ప్రధాన లక్ష్యం.. మేథోవలసను ఆరికట్టడం, అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులను పరిశోధనల దిశగా ఆకర్షించడం. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో. పరిశోధనల కోసం మన విద్యార్థులు విదేశీ యూనివర్సిటీలను ఎంచుకోవడానికి ప్రధానంగా మూడు అంశాలను ప్రధాన కారణాలుగా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అవి..
 
పరిశోధన చేసేందుకు అనువైన సౌకర్యాలు, ఉత్తమ గైడెన్స్‌, స్కాలర్‌షిప్స్‌. ఈ మూడు వసతులను దేశంలోనే కల్పిస్తే బ్రెయిన్‌ డ్రెయిన్‌ (మేథోవలస) నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పీఎంఆర్‌ఎఫ్‌ తోడ్పతుందని ప్రభుత్వం ఆశిస్తుంది.
 
నాణ్యమైన మౌలిక సదుపాయాల కోసం విశ్వజిత్‌ ప్రాజెక్ట్‌, ఉచ్ఛతర్‌ ఆవిష్కార్‌ యోజన (యూఏవై) పథకాల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుంది.
 
ఐఐటీలు ఎదుర్కొంటున్న ఫ్యాకల్టీల కొరతను కొంతవరకు తగ్గించడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంపికైన విద్యార్థులు కొంత సమయం బోధనను నిర్వహిస్తారు. తద్వారా బోధనపై ఆసక్తి ఉన్నవారు భవిష్యత్‌లో నాణ్యమైన ఫ్యాకల్టీగా రూపొందడానికి సైతం ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
 
అమలు ఇలా..
  • ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా ప్రధానమైన ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి 1000 మంది బీటెక్‌ విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • ఈ విధానంలో మొత్తమ్మీద మూడేళ్లపాటు 3000 మందిని ఎంపిక చేస్తారు.
  • వీరికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) ద్వారా పీహెచ్‌డీ చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
  • ఎంపికైన వారికి ఐదేళ్లపాటు నెలకు రూ. 75 వేల ఫెలోషిప్‌ను అందజేస్తారు.
  • వీరు పరిశోధనలకే పరిమితం కాకుండా వారానికి కొన్ని గంటలపాటు బోధన చేయాల్సి ఉంటుంది.