నిలిచి... గెలిచింది! Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నిలిచి... గెలిచింది!
ఇప్పుడు నిషా... ఓ విజయవంతమైన అథ్లెట్‌
ఓ స్ఫూర్తిదాయక మహిళ!
ప్రతి ఒక్కరి జీవితంలో ఓ పోరాటం ఉంటుంది. మనలోని శత్రువుతోనే కొన్నిసార్లు చేయక తప్పదు. అలాగే నిషా గుప్తా జీవితంలోనూ ఉంది. యుద్ధం చేసింది. తన శరీరం తెచ్చిన వైకల్యం కన్నా, నిరాశ, నిస్పృహలనే అతి పెద్ద వైకల్యాలతో పోరాడింది. చివరికి విజేతగా నిలిచింది.
 
30 ఏళ్ల వయసులో 12...
నిషాకు ప్రమాదం జరిగినప్పుడు 12వ తరగతి చదువుతోంది. అకస్మాత్తుగా చదువుకు బ్రేక్‌ పడింది. ఇప్పుడామెకు 30 ఏళ్లు. ఈ వయసులో మళ్లీ చదువును కొనసాగించాలన్న ఉద్దేశంతో 12వ తరగతికి ప్రైవేటుగా ఫీజు కట్టి చదువుకుంటోంది.
 
నాలుగేళ్లు నరకం చూశా...
ఆపరేషన్‌ తర్వాత నాలుగేళ్లు నరకం చూశా. ఏం చేస్తున్నామో తెలీదు... ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఉండకూడదు. ఒకవేళ నాలాంటి పరిస్థితి వచ్చినా వాళ్లు తమ జీవితాలను తాము తీర్చిదిద్దుకోవాలి. ఆ నాలుగేళ్ల నా నెగటివ్‌ ఆలోచనలు, వాటి వల్ల నేను ఎదుర్కొన్న కష్టాలు ఇక ఎవరూ ఎదుర్కోకూడదు. అందుకే నాలాగా బాధపడుతున్న వారికి నేను మాటలతోనే ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నా!
‘‘జాగ్రత్త నిషా’’ అంటూ ఆమెను తండ్రి వారించాడు. అప్పుడు నిషా గుప్తాకు 16 ఏళ్లు. ముంబై నుంచి కుటుంబంతో కలిసి కాశీ పర్యటనకు వెళ్లింది. రోడ్డు పక్కన మామిడి చెట్టు కనబడింది. పక్కనే ఉన్న గోడ ఎక్కి, పండ్లు కోయాలనుకుంది. కానీ పట్టు తప్పి జారి కింద పడింది. బాధతో విలవిల్లాడింది. నొప్పి తట్టుకోలేక గట్టిగా అరుస్తోంది. నిషా ఇద్దరు సోదరులు ప్రయత్నించినా లేపలేకపోయారు. ఆమె కాళ్లు కదలడం లేదు. పాము కాటేయడం వల్ల కదల్లేకపోతోందని అందరూ భావించారు. మరో ఇద్దరి సాయంతో ఆమెను కూర్చోబెట్టి డాక్టర్‌ను పిలిపించారు. మందులు ఇచ్చాడు. కానీ కొంత సేపటికి మళ్లీ పరిస్థితి మామూలే. ఈ సారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాలు తీవ్రమైనవి కావడంతో వేరే హాస్పిటల్‌కు షిఫ్ట్‌ చేయమన్నాడు లోకల్‌ డాక్టర్‌. అసలే పెళ్లిళ్ల సీజన్‌, కారు దొరకడం చాలా కష్టమైంది. కారులో స్పృహ కోల్పోయింది. ఆమె మళ్లీ కళ్లు తెరించింది ఆసుపత్రిలోనే!
 
మామూలు ఫ్రాక్చర్‌ అనుకున్నారు
తలకు, వెన్నుపూసకు ఎక్స్‌రే తీశారు. నిషా వెన్నుపూసకు ఫ్రాక్చర్‌ అయిందని నిర్ధరించారు. ఆపరేషన్‌ చేయాలన్నారు అక్కడి డాక్టర్లు. కానీ ఆమె తండ్రి మాత్రం ముంబాయి వెళ్లడానికి మొగ్గు చూపారు. వెంటనే కారులో ముంబైకి బయలుదేరారు. కారు కుదుపుల్లో నొప్పి తట్టుకోలేక ఆమె బాధతో అరుస్తోంది. అందరిలో ఏమవుతుందోమోనన్న భయం.... ఆ రాత్రి ప్రయాణాన్ని ఇవన్నీ ఆమెకు చేదు జ్ఞాపకంగా మార్చాయి. చేతులో, కాళ్లో ఫ్రాక్చర్‌ అయ్యాయేమో అనుకుంది నిషా. ముంబై చేరుకున్నాక, వారు వెళ్లని హాస్పిటల్‌ లేదు. కలవని డాక్టర్‌ లేడు.
 
ఆపరేషన్‌ తప్పలేదు
ఎంత మంది డాక్టర్లను కలిసినా, ౅వెన్నుముకకు శస్త్రచికిత్స చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. కానీ ఇక జీవితంలో ఆమె ఇక నడవలేదన్న కఠోర వాస్తవం ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. 2004లో ఆమెకు ఆపరేషన్‌ జరిగింది వీల్‌చైర్‌ ఆమె ఆశలకు సంకెళ్లు వేసింది. నిషా శారీరక స్థితిని అర్థం చేసుకుని మానసికంగా దృఢంగా కావాలన్న ఉద్దేశంతో ఆమెను పునరావాస కేంద్రానికి పంపించారు తల్లిదండ్రులు. అయిదు నెలల పాటు అక్కడే ఉంది. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్‌ చేశారు. కానీ కథ మామూలే. తినడం, టీవీ చూడటం, నిద్రోపోవడం... ఇదే రోజూ వారీ జీవితం. నాలుగేళ్లు ఆమె ఇంటికే పరిమితమైంది. ఆమెకు విసుగెత్తిపోయింది. ‘ఎవరో రావాలి... సహాయం చేయాలి...! ఏంటీ జీవితం’ అనిపించింది. తనకు కాళ్లు లేవన్న సంగతి తలుచుకుని కుమిలిపోయింది. క్రమంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. తల్లిదండ్రుల సలహాతో మళ్లీ పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి వైద్యుల్ని కలిసింది. వెన్నుముక దెబ్బతిన్న రోగులకు చికిత్స చేస్తున్న నినా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ గురించి వారి మాటల్లో ఆమెకు తెలిసింది.
 
వీల్‌ చైర్లో నృత్యం
నైనా ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్‌ కేత్నా మెహతాను నిషా కలిసి తన పరిస్థితిని వివరించింది. ఒక రోజు అక్కడ ఫంక్షన్‌కు రమ్మని ఎన్జీవో నుంచి కబురు వచ్చింది. అక్కడికెళ్లితే, ఆ దృశ్యాలను చూసి నమ్మలేకపోయింది. అందరూ తన లాంటి వాళ్లే... ఎంతో ఆనందంగా ఉన్నారు. తనలా డీలా పడిపోలేదు. జీవితం మీద ఏదో భరోసా, నమ్మకం వాళ్ల కళ్లల్లో మెరుస్తోంది. ఇంతలో స్టేజ్‌ పైకి వెళ్లి కేత్నాడి అనే పేషంట్‌ వీల్‌ చైర్లోనే నృత్యం వేయడం చూసి ఆశ్చర్చపోయింది. అగాధంలోకి వెళిపోతున్న ఆమె ఆలోచనల్నీ వెలుగు వైపు మళ్లించిన సంఘటలివి.
 
ఆట మార్చిన జీవితం
ఆటలు ఆడతానని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అనుకోనిది జరిగినప్పుడే జీవితం కొత్త దారుల్లోకి తీసుకెళుతుంది. ఒకసారి ఆ ఫౌండేషన్‌ నిర్వహించిన ఓ మారథాన్‌ను చూడటానికి వెళ్లింది నిషా. తనలాంటి పరిస్థితులు ఉన్నవాళ్లు జీవితాన్ని ఆస్వాదిసున్నారు. కష్టాలను, బాధలను తట్టుకొని ఎదురీదుతున్నారు. అదే కావాలి. తనూ మారాలి. ప్రపంచంలో ఇలా బాధపడుతున్నది తను మాత్రమే కాదు... ఇంకా చాలా మంది ఉన్నారని ఆమె గ్రహించింది. తన మనసుకు తానే కావాలని వేసుకున్న సంకెళ్లను తెంచుకోవాలనుకుంది. ఈ మానసిక సంఘర్షణలో ఆమెకు తోడుగా నిలిచి, వెన్నుతట్టిన స్నేహితుడు ఆలివర్‌. అదే మారథాన్‌లోనే పరిచయమయ్యాడు. అమె వ్యక్తిత్వాన్ని దృఢంగా చేసిన స్నేహితుడు అతను. ‘‘స్వతంత్రంగా ఎలా ఉండాలి, ఎవరి తోడు లేకుండా ఎలా ప్రయాణించాలి... దేనికీ భయపడకుండా ఎలా జీవించాలి’’ అనే విషయాలను తనే నేర్పించాడు’’ అని చెబుతుంది నిషా. అతని ప్రోత్సాహంతోనే స్విమ్మింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే బాస్కట్‌బాల్‌ కూడా. ఎందుకంటే అలాంటి ఆరోగ్య స్థితి ఉన్నవారికి వ్యాయామం చాలా అవసరం. ఇంట్లో కూడా సరేనన్నారు. రోజూ కఠోర సాధన, దానికి తగ్గ ఆహారం... ఇవన్నీ ఆమెను అథ్లెట్‌గా మార్చాయి. ఇప్పుడు నిషాకు ఆటలే జీవితం! 2013లో ఆమెకు వివాహమైంది.
నిషా తొలి టోర్నమెంట్‌లో ఆడింది మాత్రం 2015లో ఆడింది. వీల్‌చైర్‌ బాస్కట్‌బాల్‌ టోర్నమెంట్‌లో రెండో స్థానం సాధించి తన సత్తా చాటింది. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటివరకూ ఆమె జాతీయస్థాయిలో బాస్కట్‌బాల్‌ ఆటలో మూడు బంగారు పతకాలు, స్విమ్మింగ్‌లో మూడు రజత పతకాలు సాధించింది.
 
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
ఇండోనేసియాలోని బాలిలో జరిగిన ఇంటర్నేషనల్‌ బాల్‌ టోర్నమెంట్‌లో ఆమెకి మూడో స్థానం దక్కింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఉమెన్స్‌ వీల్‌చైర్‌ బాస్కట్‌బాల్‌ టీమ్‌లో సభ్యురాలు. ఒకప్పుడు ‘ఎలా బతకాలి?...’, ‘ఏం చేయలేనా..’ అని ప్రశ్నలతో నిరాశా, నిస్పృహలతో కాలం గడిపేసిన నీతూకూ, ఇప్పటి నిషాకు ఎంతో వ్యత్యాసం ఉంది. ‘ఎలాగైనా బతకాలి... సాధించాలి’ అన్న కసితో, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది.