లక్షల జీతం వదులుకుని.. Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
లక్షల జీతం వదులుకుని..
సొంతంగా శిక్షణ సంస్థ ఏర్పాటు
సాంకేతిక నైపుణ్యాల్లో యువతకు శిక్షణ
యువతకు ఆదర్శంగా
నిలుస్తున్న పెరుగు రాజు

వరంగల్, 07-02-2018: పుట్టిన ఊరు, చదువుకున్న గ్రామానికి, జిల్లాకు ఎంతోకొంత సాయపడాలని సంవత్సరానికి రూ.11 లక్షల ఉద్యోగాన్ని వదిలేశాడు.. తన కాళ్లపై నిలబడి ఉపాధి పొందుతూ మరి కొందరికి ఉపాధినివ్వాలనుకున్నదే తడవుగా తాను నేర్చుకున్న సాంకేతిక విద్యకు ఆధునిక సాంకేతిక మెళకువలను జోడించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నాడు.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఆరితేరిన స్నేహితుల సహకారంతో ప్రయోగాత్మక విద్యను బోధిస్తున్నాడు... గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మా ధ్యమంలో చదివిన వారికి తమ సంస్థలోనే ఉపాధి క ల్పించి ఆదర్శంగా నిలుస్తున్న ఆ యువకుడు వరంగల్‌ న్యూ శాయంపేటకు చెందిన పెరుగు రాజు. లక్షల రూపాయలు సంపాదించిపెట్టే ఉద్యోగాన్ని వదిలి స్వయం ఉపాధిమార్గంలో సాధించిన విజయాలు ఆయన మాటల్లోనే...
 
నాన్న పెరుగు లచ్చయ్య ప్రభుత్వ ఉద్యోగి, అమ్మ గృహిణి. అన్నయ్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు అక్కలు. వారికి వివాహం అయ్యింది. మాకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉండటంతో ఆ రంగంలో కూడా అనుభవం ఉంది. హసన్‌పర్తిలోని విద్యారణ్య పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు చదివి, పదో తరగతి మహాత్మగాంధీ హైస్కూల్‌లో పూర్తి చేశాను. ఇంటర్‌మీడియట్‌ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదివాను. రామప్ప ఇంజినీరింగ్‌ కళాశాలలో బి.టెక్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తరువాత లండన్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ కోర్సు చదివాను.
 
2010లో పోలారీస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాను. సంవత్సరానికి రూ.5 లక్షల జీతం నుంచి రూ.11 లక్షల వరకు పెరిగింది. 2013 వరకు అదే సంస్థలో పని చేశాను. లక్షల జీతం వస్తున్నా నాలో ఏదో తీరని కోరిక వెంటాడుతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించిన నేను మరి కొందరికి నేర్పించాలని ఆలోచనలు మొదలయ్యాయి. వెంటనే ఉద్యోగానికి రాజీనామ చేశాను. సాఫ్ట్‌వేర్‌ సంస్థలలో స్థిరపడిన కొంతమంది స్నేహితుల సహకారంతో 2014లో కంపెనీ వరంగల్‌ నగరంలో వెరిటాస్‌ టెక్‌సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను ప్రారంభించాను.
 
డిజిటైజేషన్‌ రంగం
మేము స్థాపించిన సంస్థలో బి.టెక్‌, ఎం.టెక్‌, విద్యార్థులతో పాటు బి.ఫాం, ఎం.ఫార్మసి విద్యార్థులకు కూడా వారి రంగాల్లోని సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నాం. సంస్థను ప్రారంభించిన సంవత్సరంలోనే ఎం.టెక్‌ కూడా పూర్తి చేశాను. 2016లో ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో డిజిటైజన్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఫార్మసి రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువనే అపోహలున్నాయి. స్టాటస్టికల్‌ అనాలసిస్‌ ఆఫ్‌ సిస్టమ్‌ అనే కోర్సు నేర్చుకుంటే ఫార్మసి రంగంలోనే అవకాశాలు ఎక్కువని తెలియజేశాం.
 
ఉచిత శిక్షణ...
బ్యాంకింగ్‌ లావాదీవీలు, ఇన్సూరెన్స్‌, ప్రభుత్వ వెబ్‌సైట్ల నిర్వహణ ఇతర కార్యక్రమాలపై అన్ని రంగాల వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యావంతులైన వారికి కార్పొరేట్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవల్‌పమెంట్‌ కోర్సులను ఉచితంగా శిక్షణ ఇచ్చి మల్టీ నేషనల్‌ కంపెనీలలో ఉపాధి అవాకాశాలు లభించేలా చేశాం. తెలుగు మాద్యమంలో డిగ్రీలు పూర్తి చేసి కంప్యూటర్‌ విద్యలో ఆరితేరినప్పటికీ ఆంగ్లభాషపై పట్టుసాధించలేని వారికి మా కంపెనీలోనే ఉపాధి కల్పించాం. రెండేళ్లలో దాదపు 15 మందికి మల్టీ నేషనల్‌ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగావకాశాలు కల్పించాం.
 
ఎతికల్‌ హాకింగ్‌ కోర్సులు
నిత్యం ఎదో ఒక చోట సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు మాయం చేశారని వార్తలు వింటూనే విన్నాం. అకౌంట్లకు సంబంధించిన వివరాలను పకడ్బందీగా ఏర్పాటు చేసుకోకపోవడం లేదా గోప్యంగా ఉండాల్సిన వివరాలను బహిర్గతం చేసుకోవడంతో ఆన్‌లైన్‌ మోసాలబారిన పడి లబోదిబోమని మొత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రవేశపెట్టబడిందే ఎతికల్‌ హాకింగ్‌ కోర్సు.
రాష్ట్రంలో హైదరాబాద్‌లో, తరువాత వరంగల్‌లో మాత్రమే ఈ కోర్సు చదువుకునే అవకాశాం ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించి సర్టిఫికెట్‌ కూడా లభిస్తుంది. ఏ అర్హత లేనివారు ఈ కోర్సును పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. కంప్యూటర్‌ విద్య , ఆంగ్లభాషపై పట్టు ఉన్నవారెవరైనా ఈ కోర్సును నేర్చకోవచ్చు. శిక్షణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి.
 
నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్య
విద్యావంతులైన యువతీ, యువకులకు కంప్యూటర్‌ సాంకేతిక విద్యలో నైపుణ్యం అందించాలన్నదే మా లక్ష్యం. ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసున్న విద్యార్థులలో నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగావకావశాలు పొందలేకపోతున్నారు. కంప్యూటర్‌ విద్యతో పాటు గ్రూప్‌-2 పరీక్షలకు హాజరయ్యే యువతకు శిక్షణ ఇస్తున్నాము. స్వంత సంస్థలో యజమానిగా, ఉద్యోగిగా ఉండటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. కేవలం ఉద్యోగం కోసమే ఎదురు చూస్తూ కాలం వృథా చేయకుండా స్వయం ఉపాధితో ఇతరులకు ఉపాధి కల్పించగలిగే స్థాయికి యువత ఎదగాలి.
- కాకతీయ కాలనీ(హన్మకొండ)