కలెక్టర్ అమ్రపాలి.. బీటెక్ టు కలెక్టర్.. పూర్తి ప్రస్థానమిది Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కలెక్టర్ అమ్రపాలి.. బీటెక్ టు కలెక్టర్.. పూర్తి ప్రస్థానమిది
ఆమె తండ్రిది ఒంగోలు పక్కన ఎన్‌.ఆగ్రహారం గ్రామం
విశాఖలో స్థిరపడిన కుటుంబం
చిన్నతనంలోనే అంగ్లసాహిత్యంపై పట్టు
బహుముఖ ప్రజ్ఞాశాలి
తొలి ప్రయత్నంలో ఐఏఎస్‌
తల్లి ప్రేరణ, చెల్లి స్ఫూర్తి
ఆదర్శ వివాహాలు.. తండ్రి బాటలో తనయ

అమ్రపాలి.. ఈ పేరు అంటే బహుశా తెలియని వారుండరు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ యువ ఐఏఎస్‌ది ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లోని నర్సాపురం అగ్రహారం గ్రామం. ఇటీవలి కాలంలో వివిధ కార్యక్రమాలతో ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తూ.. సంచలనం సృష్టిస్తూ డైనమిక్‌ లేడీగా పేరుగాంచారు. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌లో 39వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలుత వికారాబాద్‌లో శిక్షణ కలెక్టర్‌గా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చి ప్రస్తుతం కలెక్టర్‌గా తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
 
పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ చూపితే వారు అంత ప్రయోజకులు అవుతారో వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్‌ కాటా అమ్రపాలి కుటుంబమే అందుకు నిదర్శనం. డైనమిక్‌ లేడీగా, యువ కలెక్టర్‌గా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని నర్సాపురం అగ్రహారం అమ్రపాలి స్వగ్రామం. ఆమె చెల్లి మానస గంగోత్రి కూడా ఐఏఎస్‌కు ఎంపికై ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇరువురూ విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
బహుముఖ ప్రజ్ఞాశాలి
అమ్రపాలి చిన్నతనం నుంచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖ పట్నంలోని సత్యసాయి హైస్కూలులో ఆమె ప్రాథమిక, సెకండరీ విద్యను పూర్తి చేశారు. పాఠశాలలో నిర్వహించిన అన్ని పోటీల్లో పాల్గొంటూ అనేక బహుమతులు సాధించారు. పాఠశాలకు విద్యార్థి నాయకురాలిగా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలన్నింటిలో ఆమె పాల్గొని, అనేక బహుమతులు కూడా సాధించి తన సత్తా చాటారు. పాఠశాలల్లో పడిన మంచి నడవడిక, పునాది ఆమె భవిష్యత్‌కు బంగారు బాటలు వేసింది.
 
ఆంగ్ల సాహిత్యంపై పట్టు
అమ్రపాలి పదవ తరగతి పూర్తి అయ్యేనాటికే అంగ్లంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించింది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాల్లో తండ్రితో పాటు ఆంధ్రాయూనివర్శిటీ గ్రంథాలయానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ఆంగ్ల సాహిత్య పుస్తకాలను అధ్యయనం చేస్తూ గడిపేవారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేసేవారు. అమ్రపాలి 16 ఏళ్ళకే అంగ్లంలో కథలు, పద్యాలు రాయడం ప్రారంభించారంటే ఆంగ్లపై ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. అంగ్ల సాహిత్యంపై ఆమె సాధించిన పట్టు ఐఏఎస్‌ ఎంపికకు ఆమెకు ఎంతో దోహదం చేసింది.
 
అమెరికా వెళదామనుకొని ఐఏఎస్‌ అయ్యారు..
అమ్రపాలిని బీటెక్‌ అయిన తర్వాత ఎంఎస్‌ కోసం అమెరికాకు పంపుదామని తల్లిదండ్రులు భావించారు. ఇంటర్మీడియేట్‌లో మంచి మార్కులు సాధించి చెన్నై ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అమ్రపాలి ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరంలోనే అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు అవసరమైన అర్హతలు జీఆర్‌ఈ, టోఫేల్‌ రాశారు. ఈ రెండు పరీక్షల్లో నూరుశాతం మార్కులు సాధించి అనితర సాధ్యమైన రికార్డును సాధించారు. అమెరికాలోని ప్రముఖ యూనివర్శిటీల్లో ఆమెకు అడ్మిషన్‌ కూడా లభించింది. అయితే ఆఖరు నిమిషంలో అమెరికా వెళ్లాలన్న ప్రయత్నానికి పుల్‌స్టాప్‌ పెట్టి క్యాట్‌లో సాధించిన ర్యాంకుతో ప్రతిష్టాత్మక బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ సీటు రావడంతో ఎంబీఏలో చేరారు. ఎంబీఊ చివరి సంవత్సరంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఆమె యూకేకు చెందిన ప్రముఖ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించారు.
 
తండ్రిది నర్సాపురం అగ్రహారం
ఒంగోలు నగర పరిధిలోని నర్సాపురం అగ్రహారంలో జన్మించిన కాటా వెంకటరెడ్డి కుమార్తె అమ్రపాలి. ఆయన చిన్నతనం నుంచి కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రాథమిక విద్య అగ్రహారంలో పూర్తి చేసిన అనంతరం టంగుటూరులో సెకండరీ విద్య, ఒంగోలు సీఎ్‌సఆర్‌ శర్మా కళాశాలలో ఇంటర్మీడియేట్‌, డిగ్రీ కోర్సులు పూర్తి చేశారు. విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీలో పీజీ చేసి అక్కడే రీసెర్చ్‌ స్కాలర్‌గా పనిచేస్తూ యూనివర్శిటీలో అధ్యాపకుడిగా నియమితులయ్యారు. వెంకటరెడ్డి టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన తన మేనమామ కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నారు. అనంతరం ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్డ్‌ అయ్యారు. వెంకటరెడ్డి చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే మనస్తత్వం. అదే లక్షణాన్ని పునికి పుచ్చుకున్న కుమార్తెలు ఇద్దరూ చిన్నతనం నుంచి చదువులో బాగా రాణించారు. తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివారు. అమ్రపాలి ఐఎఎ్‌సకు, చిన్నకుమార్తె మానస గంగోత్రి ఐఆర్‌ఎ్‌సకు ఎంపికయ్యారు. అమ్రపాలి, మానస గంగోత్రి పేర్లు ఇ క్కడి సంప్రదాయ బద్ధంగా పెట్టే పేర్లకు కొంత భిన్నంగా ఉంటాయి. బుద్ధుడి శిష్యురాలైన అమ్రపాలి పేరును ఒక కుమార్తెకు , సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని చిన్న కుమార్తెకు మానస గంగోత్రి అని పేరు పెట్టారు.

తల్లిప్రేరణ, చెల్లి స్ఫూర్తి
 
అమ్రపాలికి తల్లి పద్మావతి ప్రేరణ, చెల్లి మానస గంగోత్రిల స్ఫూర్తితో అమె ఐఏఎస్‌కు ప్రయత్నించి మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు. తల్లి పద్మావతికి మొదటి నుంచి అమ్రపాలిని ఐఏఎస్‌గా చూడాలని కోరిక. పద్మావతికి వివాహమైన తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సు పీజీ చేశారు. దాంతో మొదట్లో ఉద్యోగంలో చేరాలని భావించిన పద్మావతి తర్వాత పిల్లల చదువే ముఖ్యమని, ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి పలికి వారికి దగ్గర ఉండి అన్ని చూసి వారిని ఉన్నత స్థాయికి తీసుకరావడంలో ఆమె కృషి చేశారు. ముంబాయిలోని యూకే బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేసిన అమ్రపాలి ఆ ఉద్యోగం నచ్చక ఏడాదికే రాజీనామా చేసింది. ఏదైనా పేదలకు సాయం చేయాలి అనే ఆలోచనతో ఉన్న అమ్రపాలి యూపీఎస్‌సీ పరీక్షల వైపు దృష్టి సారించింది. అప్పటికే 2007లో ముంబయి ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన చెల్లెలు మానస గంగోత్రి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికైంది. ఆమె కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్చైజ్‌ శాఖను ఎంపిక చేసుకొని బెంగళూరులో పనిచేస్తున్నారు.
 
బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన అమ్రపాలి చెల్లెలి వద్దకు వెళ్లి యూపీఎస్‌సీ పరీక్షల్లో ఎలా నెగ్గాలో తెలుసుకున్నారు. ఐఏఎస్‌కు దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్‌ పాసైన అమ్రపాలి మెయిన్‌లో ఇంగ్లీషు లిటరేచర్‌, సైకాలజి సబ్జెక్టులను ఎంపిక చేసుకొని మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 39వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. ఐఏఎస్‌లో ఉత్తమ ర్యాంకు రావడంతో ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. మొదట వికారాబాద్‌లో శిక్షణ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్‌ ఇచ్చిన అమ్రపాలిని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తర్వాత ఆమెలోని ప్రతిభాపాటవాలను గుర్తించి జిల్లాల సంఖ్య పెరగ్గానే వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా నియమించారు. తర్వాత రూరల్‌ కలెక్టర్‌గా కూడా అమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
 
ఆదర్శ వివాహాలు
అమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి చిన్నతనం నుంచి వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి. పిల్లలకు కూడా సమాజం, మంచీ చేడు విషయాలలో తార్కికదృష్టితో ఏలా చూడాలో వివరించేవారు. మంచి చేయాలని, చెడుకు దూరంగా ఉండాలని పిల్లలకు సూచించేవారు. తండ్రి మాటలను, ఆదర్శాలను ఇద్దరు కుమార్తెలు పుణికిపుచ్చుకున్నారు. ఇరువురు కుమార్తెలు ఆదర్శ వివాహాలకు సిద్ధమైనా వెంకటరెడ్డి ఆయన భార్య పద్మావతి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. మొదట చిన్నకుమార్తె మానస గంగోత్రి కేరళ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ నాయర్‌ కుటుంబం కోయంబత్తూరులో స్థిరనివాసం ఉంటుంది. ఇరువురు భాష వేరు, రాష్ట్రాలు వేరు అయినప్పటికి ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రవీణ్‌ నాయర్‌, మానస గంగోత్రిలు ఒక్కటయ్యారు. ప్రవీణ్‌నాయక్‌ ప్రస్తుతం తమిళనాడులో ఐఏఎస్‌ అధికారిగా పనిచేస్తూ ఇటీవల జరిగిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరించారు. మానసగంగోత్రి తమిళనాడు కస్టమ్స్‌ ఎక్సైజ్‌ విభాగంలో జాయింట్‌ కమిషనర్‌గా జీఎస్టీ విభాగంలో పనిచేస్తున్నారు.
 
18న అమ్రపాలి వివాహం
ఈనెల 18న అమ్రపాలి వివాహం జరగింది. అమ్రపాలి కూడా ఆదర్శ వివాహం చేసుకున్నారు. 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన అమ్రపాలి 2011 బ్యాచ్‌ ఐసీఎస్‌ షమీర్‌ శర్మలు నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల అంగీకారంతో అందరి సమక్షంలో వివాహం చేసుకోవాలనుకున్న వారు ఇరువురు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. షమీర్‌ శర్మ తండ్రి భారత సైన్యంలో లెప్ట్‌నెంట్‌ కల్నల్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. శర్మ తల్లి జమ్మూలో ఒక పాఠశాలను నిర్వహిస్తున్నారు. షమీర్‌ శర్మ డయ్యూడామన్‌లో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. వీరి ఇరువురి పెళ్లి ఈనెల 18న జమ్మూలో జరగింది. అనంతరం ఈనెల 25న సికింద్రాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.