ఆర్కిటెక్చర్‌ కెరీర్‌కు.. నాటా బాట Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆర్కిటెక్చర్‌ కెరీర్‌కు.. నాటా బాట
దేశంలో ఆర్కిటెక్చర్‌ విద్యకు సంబంధించిన ప్రమాణాలను నిర్దేశించే ద కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (సీఓఏ) నాటా పరీక్షను ఏటా నిర్వహిస్తుంది.
 
450కిపైగా కాలేజీల్లో
ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు మినహా దేశవ్యాప్తంగా ఉన్న 450కిపైగా కాలేజీల్లో బీఆర్క్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. నాటా స్కోర్‌ 2018-19 విద్యా సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
 
అర్హత
50 శాతం మార్కులతో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా 10+2/తత్సమానం/చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులే.
50 శాతం మార్కులతో మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా 10+3 విధానంలో ఏదైనా డిప్లొమా/చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులే.
పదేళ్ల స్కూలింగ్‌ తరవాత 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్నేషనల్‌ బ్యాకులరేట్‌ డిప్లొమా / చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు అర్హులే.
 
రాత పరీక్ష
రాత పరీక్షకు 200 మార్కులు కేటాయించారు. ఇందులో పార్ట్‌-ఎ, పార్ట్‌-బి విభాగాలు ఉంటాయి.
ఇందులో మేథమెటిక్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌, డ్రాయింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నల విభజన, మార్కుల కేటాయింపు ఇలా ఉంటుంది.
విభాగం                       ప్రశ్నలు                  మార్కులు
పార్ట్‌-ఎ మేథమెటిక్స్‌      20                          40
జనరల్‌ ఆప్టిట్యూడ్‌        40                          80
పార్ట్‌-బి డ్రాయింగ్‌          2                           80
మొత్తం                                                    200
 
పార్ట్‌-ఎలోని మేథమెటిక్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ విభాగానికి కేటాయించిన మొత్తం మార్కులు 120. ఇందులో సమాధానాలను గుర్తించడానికి 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కులు లేవు.
పార్ట్‌-బిలోని డ్రాయింగ్‌ విభాగాన్ని ఆఫ్‌లైన్‌లో (పేపర్‌ - పెన్సిల్‌ విధానం) నిర్వహిస్తారు. ఇందుకు ఏ4 సైజ్‌ పేపర్లను ఇస్తారు. వాటిపై రెండు డ్రాయింగ్స్‌ను గీయాలి. 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.
 
కనీస మార్కులు తప్పనిసరి
పార్ట్‌-ఎలో కనీసం 25 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. అంటే 120కి 30 మార్కులను సాధించాలి. అదేవిధంగా పార్ట్‌-బిలో కూడా 25 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్దేశించారు. అంటే 80కి 20 మార్కులను సాధించాలి. ఈ విధంగా సాధించిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని మెరిట్‌ లిస్ట్‌ను ప్రిపేర్‌ చేస్తారు. వీరికి మాత్రమే బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
 
సిలబస్‌
మేథమెటిక్స్‌: ఇందులో ఆల్జీబ్రా, లాగరిథమ్స్‌, మ్యాట్రిక్స్‌, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్‌ జ్యామెట్రీ, 3డైమెన్షనల్‌ కోఆర్డినేట్‌ జ్యామెట్రీ, థియరీ ఆఫ్‌ క్యాలిక్యులస్‌, అప్లికేషన్‌ ఆఫ్‌ క్యాలిక్యులస్‌, పర్మిటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌, స్టాటిస్టిక్‌ అండ్‌ ప్రొబబిలిటీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జనరల్‌ ఆప్టిట్యూడ్‌: ఇందులో ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన అవగాహనను పరీక్షించేందుకు వివిధ ఆకృతులు, 2, 3 డైమెన్షనల్‌ ఆబ్జెక్ట్స్‌, ఆర్కిటెక్చర్‌ రంగంలో ఇటీవల జాతీయ/ అంతర్జాతీయ స్థాయుల్లో చోటు చేసుకున్న సంఘటనలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వాటితోపాటు మేథమెటికల్‌ రీజనింగ్‌, సెట్స్‌ అండ్‌ రిలేషన్స్‌, అనలిటికల్‌ రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
డ్రాయింగ్‌: సృజనాత్మకతను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం. ఇందులో డ్రాయింగ్‌ పట్ల విద్యార్థి ఆసక్తి, నైపుణ్యం, వివిధ ఆకృతులను చిత్రించే నేర్పు, ఊహశక్తి వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఒక వస్తువు లేదా నమూనాను ఇస్తారు. దాన్ని యథాతథంగా చిత్రించడం, ఒక వస్తువును ఇచ్చి దాన్ని విభిన్న ఆకారాల్లో గీయమనడం, నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఊహించి స్కెచెస్‌ వేయడం, నిర్ణీత ఆకారాలను ఆకట్టుకునే రంగులతో పూరించడం వంటి ప్రశ్నలను అడుగుతారు. ఈ పేపర్‌ను ఒకటి కంటే ఎక్కువ మంది ఎగ్జామినర్లు మూల్యాంకనం చేస్తారు. ఈ నేపథ్యంలో వారందరూ ఇచ్చిన మార్కుల సగటు తీసుకుంటారు. దాని ఆధారంగా ఈ విభాగానికి మార్కులను ఇస్తారు.
 
ముఖ్య సమాచారం
వయసు: 17 ఏళ్లు (2018 జూలై 31 నాటికి)
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 2, 2018.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 29, 2018
తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, చీరాల, గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం.
ఫలితాల వెల్లడి: జూన్‌ 1, 2018.
వెబ్‌సైట్‌: http://www.nata.in/