నెస్ట్‌తో సైన్స్‌లో సమున్నత కెరీర్‌ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
నెస్ట్‌తో సైన్స్‌లో సమున్నత కెరీర్‌
పరిశోధనలు, శాస్త్రీయ అధ్యయనం వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తోంది నెస్ట్‌ (నేషనల్‌ ఎంట్రెన్స్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌). ఈ పరీక్ష ద్వారా ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశంతోపాటు సైన్స్‌ రంగంలో సమున్నతంగా స్థిరడటానికి చక్కటి అవకాశం లభిస్తుంది. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కెరీర్‌ను ఎంచుకోవాలనుకునే వారికి నెస్ట్‌ ఉత్తమ ప్రత్నామ్నాయంగా నిలుస్తోంది. నెస్ట్‌ - 2018 ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్షా విధానం, దృష్టి సారించాల్సిన అంశాలు తదితర అంశాలపై విశ్లేషణ..
నెస్ట్‌ ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైసర్‌) - భువనేశ్వర్‌ (వెబ్‌సైట్‌: http://www.niser.ac.in/), యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై - డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఆటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్స్‌ - సీఈబీఎస్‌, ముంబై (వెబ్‌సైట్‌: http://www.cbs.ac.in/) సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశం పొం దొచ్చు. ఈ రెండు సంస్థలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ (డీఏఈ) ఏర్పాటు చేసింది. బేసిక్‌ సైన్సెస్‌, అప్లయిడ్‌ సైన్సెస్‌లో అత్యుత్తమ బోధనతోపాటు ఆయా రంగాల్లో పరిశోధనలకు సిద్ధంగా ఉన్న ప్రతిభావంతులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ సంస్థలను ప్రారంభించారు. నైసర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ డిగ్రీని హోమిబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రదానం చేస్తుంది.
కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ
స్పెషలైజేషన్స్‌: బయాలజీ, కెమిస్ర్టీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌. వ్యవధి: ఐదేళ్లు
సీట్లు: నైసర్‌ - భువనేశ్వర్‌: 202,
సీఈబీఎస్‌, ముంబై - 47.
 
అర్హత
2016 లేదా 2017లో 60 శాతం మార్కులతో (ఎస్సీ/ ఎస్టీ, పీడీ విద్యార్థులకు 55 శాతం) ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియెట్‌ / 10+2 పూర్తి చేసి ఉండాలి. 2018లో ఇంటర్మీడియెట్‌ / 10+2 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నవారు కూడా అర్హులే.
వయసు: ఆగస్టు 1, 1998 తరవాత జన్మించి ఉండాలి. ఎస్సీ / ఎస్టీ, పీడీ విద్యార్థులకు ఐదేళ్ల సడలింపు ఇస్తారు.
 
రాత పరీక్ష ఇలా
దేశ వ్యాప్తంగా రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 180 నిమిషాల (3 గంటలు) సమయం కేటాయిస్తారు. పరీక్షలో ఐదు విభాగాలు ఉంటాయి. అయితే ఆయా విభాగాల్లో అడిగే ప్రశ్నల సంఖ్య మారుతూ ఉంటుంది.
సెక్షన్‌ - 1: జనరల్‌ విభాగం. దీనికి 30 మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. 2017లో ఈ విభాగంలో 10 ప్రశ్నలు ఇచ్చారు.
సెక్షన్‌ 2 - 5: ఇందులో సెక్షన్‌ - 2, 3, 4, 5 అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఈ విభాగాల్లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు ఇస్తారు. సబ్జెక్ట్‌ పరిజ్ఞానం, తార్కిక విశ్లేషణను పరీక్షించే విధంగా ప్రశ్నల స్వరూపం ఉంటుంది. కొన్ని ప్రశ్నలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సరైన సమాధానాలను గుర్తిస్తేనే మార్కులను కేటాయిస్తారు. బయాలజీ, కెమిస్ర్టీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి విభాగానికి 50 మార్కులు కేటాయించారు. 2017లో మ్యాథ్స్‌, బయాలజీ, కెమిస్ర్టీ, ఫిజిక్స్‌ విభాగాల్లో 15 ప్రశ్నల చొప్పున ఇచ్చారు. విద్యార్థులు ఆసక్తి మేరకు ఎన్ని సబ్జెక్ట్‌ విభాగాలైనా ప్రయత్నించవచ్చు. మెరిట్‌ లిస్ట్‌ ప్రిపరేషన్‌లో సరైన సమాధానాలు రాసిన మూడు సబ్జెక్ట్‌ విభాగాలు, జనరల్‌ సెక్షన్‌లలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విభాగాల్లో నెగిటివ్‌ మార్కులు ఉంటాయి.
 
సబ్జెక్ట్‌ల వారీగా....
జనరల్‌ విభాగం: జనరల్‌ విభాగానికి ప్రత్యేకంగా సిలబస్‌ను నిర్ణయించలేదు. సైన్సెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి కావల్సిన దృక్ఫథం విద్యార్థిలో ఉందా లేదా అనే విషయాన్ని పరీక్షించడానికి ఈ విభాగంలో ప్రాధాన్యం ఇస్తారు. మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ, ఆస్ర్టానమీ, పర్యావరణం, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి అంశాల్లో చారిత్రక అవగాహనను తెలుసుకునేలా ప్రశ్నల స్వరూపం ఉంటుంది. కొన్ని ప్రశ్నలు 10వ తరగతి వరకు ఉన్న మ్యాథమెటిక్స్‌ నుంచి అడుగుతారు. మరికొన్ని ప్రశ్నలు విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. విద్యార్థుల కాంప్రెహెన్షన్‌ నైపుణ్యాలను పరిశీలించడానికి ప్యాసేజ్‌ / డేటా ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు.
బయాలజీ: ఈ సబ్జెక్ట్‌లో జనరల్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, జెనెటిక్స్‌, ఎకాలజీ - ఎవల్యూషన్‌, బయో టెక్నాలజీ, యానిమల్‌ ఫిజియాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, డీఎన్‌ఏ ధర్మాలు, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీ, ట్రాన్స్‌లేషన్‌, ట్రాన్స్‌క్రిప్షన్‌ మొదలైన అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి.
కెమిస్ర్టీ: ఈ సబ్జెక్ట్‌లో ఆర్గానిక్‌ కెమిస్ర్టీలో - జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ర్టీ, రియాక్షన్‌ మెకానిజం, స్టీరియోకెమిస్ర్టీ, నెమెడ్‌ రియాక్షన్స్‌, ఎరోమ్యాటిసిటీ, కార్బోహైడ్రేట్స్‌, అమైనో యాసిడ్స్‌, పాలిమార్స్‌; ఫిజికల్‌ కెమిస్ర్టీలో - మోల్‌ కాన్సెప్ట్‌, సొల్యూషన్స్‌, సాలిడ్‌ ేస్టట్‌, ఎలక్ర్టో కెమిస్ర్టీ, కెమికల్‌ కేౖనటిక్స్‌, థర్మో డైనమిక్స్‌ సంబంధిత అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ర్టీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎస్‌ - పీ బ్లాక్‌ మూలకాలు, డీ అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ మూలకాలు, మెటలర్జీ మొదలైన అంశాలు ప్రధానమైనవి.
ఫిజిక్స్‌: ఈ సబ్జెక్ట్‌లో జనరల్‌ ఫిజిక్స్‌, ఆప్టిక్స్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌, ఎలక్ర్టిసిటీ, మ్యాగ్నటిజమ్‌, మెకానిక్స్‌ అంశాలపై పట్టు సాధించాలి.
మ్యాథమెటిక్స్‌: ఈ సబ్జెక్ట్‌లో కాలిక్యులస్‌, ట్రిగొనామెట్రీ, కోఆర్టినేట్‌ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టర్స్‌ అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.
గుర్తుంచుకోవాల్సినవి
ఎన్‌సీఈఆర్‌టీ / సీబీఎస్‌ఈ 11, 12 తరగుతుల సైన్స్‌ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు.
నెస్ట్‌లో అడిగే ప్రశ్నలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు బట్టీ ధోరణిలో కాకుండా సబ్జెక్టును అవగాహన చేసుకుంటూ చదవాలి.
ఆయా సబ్జెక్ట్‌లలోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. తద్వారా సబ్జెక్ట్‌ను అధ్యయనం చేయడం సులభమవుతుంది.
విభిన్న అంశాలను అన్వయించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
వెబ్‌సైట్‌లో గత ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది.
సబ్జెక్ట్‌ల వారీగా తెలుగు అకాడమీ, సీబీఎస్‌ఈ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, అంశాల వారీగా స్టాండర్ట్‌ పుస్తకాలను చదవాలి.
కనీస స్కోర్‌ సాధిస్తేనే
ఒక విద్యార్థి మొత్తం స్కోరు అనేది ఆ విద్యార్థి జనరల్‌ విభాగం, ఇంకా అత్యుత్తమ స్కోరు సాధించిన మూడు సబ్జెక్టు విభాగాల్లో సాధించిన మార్కుల మొత్తంగా ఉంటుంది. ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ 100 స్కోర్ల సగటులో 20 శాతం అనేదాన్ని, ఆ విభాగానికి కటాఫ్‌ స్కోరు సెక్షన్‌ వైజ్‌ మినిమమ్‌ అడ్మిసబుల్‌ స్కోర్‌ (ఎస్‌మాస్‌)గా నిర్ణయిస్తారు. ఉదాహరణకు జనరల్‌ విభాగంలో అత్యుత్తమ 100 స్కోర్ల సగటు 40 మార్కులు అయితే జనరల్‌ విభాగానికి ఎస్‌మాస్‌ అనేది 40 గీ 0.2 = 8 మార్కులు అవుతుంది. ఈ ఎస్‌మాస్‌ వేర్వేరు విభాగాలకు ఎస్‌మాస్‌ వేర్వేరుగా ఉంటుంది.
ప్రతి విద్యార్థ్థి జనరల్‌, కనీసం మూడు సబ్జెక్టు విభాగాల్లో ఎస్‌మాస్‌ సమానమైన లేదా అధికమైన స్కోరు సాధించాలి. ఆ విధంగా సాధించిన విద్యార్థులను మాత్రమే మెరిట్‌ లిస్టు గణనలోకి తీసుకుంటారు. వీటితో పాటు అభ్యర్థులు మొత్తం ప్రశ్నపత్రం మార్కుల్లో 50 శాతం అంటే 100 మార్కులు కనీసంగా సాధించాలి. దీన్నే మినిమమ్‌ అడ్మిసబుల్‌ స్కోర్‌ (మాస్‌) అంటారు. మాస్‌కు సమానమైన, అధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెరిట్‌ ర్యాంకును కేటాయిస్తారు. మాస్‌ కంటే తక్కువ స్కోరు సాధించి, జనరల్‌; మూడు సబ్జెక్టుల విభాగాల్లో ఎస్‌మాస్‌ సాధిస్తే అలాంటి అభ్యర్థులకు మెరిట్‌ ర్యాంకును కేటాయించరు.
 
నెస్ట్‌ ద్వారా లభించే ప్రయోజనాలు
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైసర్‌) - భువనేశ్వర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై - డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్స్‌ - సీఈబీఎస్‌, ముంబై సంస్థల్లో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలు, ఆధునిక కంప్యూటేషనల్‌ సౌకర్యాలు ఉంటాయి.
ఆయా రంగాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులతో అవగాహన తరగతులను నిర్వహిస్తారు.
ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ లేదా దిశా స్కీమ్‌ ద్వారా నెలకు రూ. 5,000 ఉపకార వేతనం, సమ్మర్‌ ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ. 20,000 ప్రోత్సాహకం లభిస్తాయి.
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తప్పనిసరిగా ఉంటాయి.
బార్క్‌- ట్రైనింగ్‌ స్కూల్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటర్వ్యూకు ఈ రెండు సంస్థల విద్యార్థులకు నేరుగా అర్హత లభిస్తుంది. అందులో ఎంపికైతే సైంటిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించే అవకాశం లభిస్తుంది.
ఇంటిగ్రేటెడ్‌ పీజీ కావడంతో డిగ్రీ, పీజీని ఒకే చోట చదివే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 5, 2018.
నెస్ట్‌ - 2018 పరీక్ష తేదీ: జూన్‌ 2, 2018.
తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, కర్నూలు, చీరాల, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
వెబ్‌సైట్‌: www.nestexam.in