ఆహారాన్ని నిల్వ చేసుకునే వేర్లు..(టార్గెట్‌ టిఆర్‌టి బయాలజీ) Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆహారాన్ని నిల్వ చేసుకునే వేర్లు..(టార్గెట్‌ టిఆర్‌టి బయాలజీ)
ఆవరణ వ్యవస్థలన్నింటిలో ఉత్పత్తిదారులు మొక్కలే. ఇవి పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మొక్కలకు ప్రాణం ఉందని, అవి కూడా తమ భావాలను వ్యక్తపరుస్తాయని జగదీశ్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు.
 
దేశాల ఆధారంగా మొక్కలు మూడు రకాలుగా పెరుగుతాయి. నేలమీద, నీటిలో, ఎడారిలో కూడా మొక్కలు పెరుగుతాయి.
నేలమీద పెరిగే మొక్కలు: వేప, మామిడి, గులాబి మొదలైనవి.
నీటిలో పెరిగే మొక్కలు: తామర, హైడ్రిల్లా, వాలీస్‌నేరియా.
ఎడారిలో పెరిగే మొక్కలు: నాగజెముడు, బ్రహ్మ జెముడు, ఖర్జూరం తదితరాలు.
ఆకృతుల ప్రకారం కూడా మొక్కలను మూడు రకాలుగా విభజించారు.
తీగలు: పందిళ్లపై చెట్లపై ఏదో ఒక ఆధారంతో ఇవి పెరుగుతాయి. ఉదా: మల్లె, బీర, కాకర.
పొదలు: మొదలు భాగం నుంచి కొమ్మలు గుంపులు గుంపులుగా పెరుగుతాయి. ఉదా: గులాబి, మిరప, చామంతి, గన్నేరు.
వృక్షాలు: కాండం దృఢంగా ఉండి పెద్దగా విశాలమైన కొమ్మలతో పెరుగుతాయి. ఉదా: వేప, రావి, చింత, మామిడి.
జీవితకాలం ఆధారంగా మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించారు.
ఏక వార్షికాలు: ఏడాది లోపు జీవితకాలాన్ని పూర్తిచేసుకొంటాయి. ఉదా: వరి, రాగి, గోధుమ, జొన్న, మొక్క జొన్న వంటి గడ్డి జాతి మొక్కలు, కంది పెసర, అనప వంటి పప్పు ధాన్యాల మొక్కలు.
ద్వివార్షికాలు: రెండేళ్లలోపు జీవిత కాలాన్ని పూర్తి చేసుకుంటాయి. ఉదా: క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి
బహు వార్షికాలు: రెండేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయి. ఉదా: వేప, రావి, చింత, జామ
బీజ దళాల ఆధారంగా మొక్కలు రెండు రకాలు.
ఏకదళ బీజాలు: రెండు సమాన భాగాలుగా వేరు చేయడానికి వీలులేని విత్తనాలను కలిగి ఉంటాయి. ఉదా: గడ్డి జాతి మొక్కలు (వరి, గోధుమ, రాగి, సజ్జ, కొబ్బరి.)
ద్విదళ బీజాలు: రెండు సమ భాగాలుగా చేయగలిగే విత్తనాలతో ఉంటాయి. ఉదా: పప్పు ధాన్యాల మొక్కలు (కంది, శనగ, వేరుశనగ, చిక్కుడు, మామిడి)
పుష్పించే తత్వాన్ని బట్టి మొక్కలను రెండు రకాలుగా పరిగణిస్తారు.
మొక్క భాగాలు: మొక్కల్లో ప్రధానంగా వేప, కాండం, పత్రాలు అనే భాగాలు ఉంటాయి.
వేరు: నేల లోపలి భాగంలో మొక్క వేళ్లు ఉంటాయి. భూమి నుంచి నీటిని, లవణాలను గ్రహించి మొక్కకు అందిస్తాయి. మొక్క కిందికి ఒంగిపోకుండా యాంత్రిక బలాన్ని ఇస్తాయి. కొన్ని మొక్కల్లో వేర్లు శాసక్రియకు సహాయం చేస్తాయి. వేర్లమీద సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని వేరు వెంట్రుకలు లేదా మూల కేశాలు అంటారు. ఇవి నేలలోని నీటిని, లవణాలను పీల్చి వేర్లకు అందిస్తాయి. క్యారెట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, చిలగడ దుంప వంటి మొక్కల వేర్లు ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. మర్రి వంటి మొక్కల్లో శాఖల నుంచి కూడా వేర్లు ఏర్పడి ఆధారాన్నిస్తాయి. వేర్లలో ప్రధాన వేరు వ్యవస్థ, గుబురు/ పీచు వ్యవస్థ అనే రెండు రకాలు ఉంటాయి.
ప్రధానమైన వేర్లు: కొన్ని మొక్కల్లో ప్రధానమైన వేరు మందంగా మారి సన్నని వేర్లతో ఉంటుంది. ప్రధాన వేరును తల్లి వేరు అనీ, సన్నని వేరును పార్వ్శ వేరు అనీ అంటారు. ఉదా: వేప, మామిడి, చిక్కుడు, చింత, మిరప.
పీచు/ గుబురు వేర్లు: కొన్ని మొక్కల్లో కాండం నుంచి సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు ఏర్పడతాయి. వీటినే పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు ఉండదు. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఉదా: వరి, మొక్కజొన్న, జొన్న, తాటి మొదలైనవి. ఎడారి మొక్కల్లో లోతైన వేరు వ్యవస్థ ఉంటుంది.
కాండం వ్యవస్థ: ఇందులో శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి. నిటారుగా పెరిగే కాండం ఉంటుంది. మొలకెత్తే విత్తనం పిండంలోని ప్రథమ కాండం నుంచి ఈ వ్యవస్థ వృద్ధి చెందుతుంది.
విధులు: వేర్లు గ్రహించిన నీటిని, లవణాలను కాండంలోని దారు కణజాలం మొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది. పత్రాలు తయారుచేసిన ఆహారాన్ని కాండంలో ఉండే పోషక కణజాలం ద్వారా మొక్క ఇతర భాగాలకు అందుతుంది. కాండం వేర్లకు, ఆకులకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాండం కొన్ని మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. ఉదా: బ్రహ్మ జెముడు, కాక్టస్‌. చెరకు, పసుపు, అల్లం, నీరుల్లి, బంగాళదుంప వంటి మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది.
పత్రం
పత్రమనేది మొక్కలో అత్యంత ముఖ్యమైన భాగం. దీనినే ఆహార కర్మాగారం అని కూడా అంటారు. కాండం కణుపుల వద్ద పత్రం ఏర్పడుతుంది. పత్రంలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి.. పత్ర పీఠం, పత్రవృంతం, పత్ర దళం
పత్ర పీఠం, పత్రాన్ని కాండానికి అతికించి నీరు, లవణాలు, ఆహార పదార్థాల రవాణాలో సహాయం చేస్తుంది.
పత్రపీఠాన్ని పత్ర దళాన్ని కలిపి ఉంచేదే పత్రవృంతం. పత్ర దళం వెడల్పుగా ఉంటుంది. ఇందులో మధ్య ఈనె, పార్శ్వపు ఈనెలు ఉంటాయి. పత్రంలోని ముఖ్యమైన పనులన్నీ పత్రదళంలోనే జరుగుతాయి.
ఈనెలు, పత్ర దళానికి యాంత్రిక బలాన్ని ఇస్తాయి.
ఈనెల ఆధారంగా పత్రాలు రెండు రకాలు. అవి.. జాలాకార ఈనెల వ్యాపనం, సమాంతర ఈనెల వ్యాపనం.
జాలాకార ఈనెల వ్యాపనంలో ఈనెలు జాలవలె అమరి ఉంటాయి. ఉదా: తల్లివేరు వ్యవస్థ ఉన్న మొక్కలు
సమాంతర ఈనెల వ్యాపనంలో ఈనెలు సమాంతరంగా ఉంటాయి. ఉదా: పీచువేరు వ్యవస్థ ఉన్న మొక్కలు
పత్రం విధులు: పత్రంలోని పత్ర రంధ్రాలు వాయు వినిమయంలో తోడ్పడుతాయి. మొక్కల్లో అధికమైన నీరు పత్ర రంధ్రాల ద్వారా బయటకు వెళుతుంది. దీనిని భాష్పోత్సేకం అంటారు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడంలో సహాయపడు తుంది. మరి కొన్ని మొక్కల్లో పత్రాలు ఆహారాన్ని నిల్వచేయడంలో సహాయం చేస్తాయి. ఉదా: అలొవెర. ప్రత్యుత్పత్తిలో కూడా పత్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఉదా: రణపాల (బ్రయోఫైటా)