శివాజీ, తానీషా...గోల్కొండ ఒప్పందం (పోటీ పరీక్షల ప్రత్యేకం) Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
శివాజీ, తానీషా...గోల్కొండ ఒప్పందం (పోటీ పరీక్షల ప్రత్యేకం)
మరాఠా రాజ్య స్థాపన
 
శివాజీ
మహారాష్ట్రలో మరాఠా రాజ్యాన్ని స్థాపించింది శివాజీ. ఇతడు క్రీ.శ. 1627లో శివనేర్‌ దుర్గంలో షాజీ బోంస్లే, జిజియాబాయిలకు జన్మించాడు. చిన్నతనం నుంచి పుణెలో పెరిగాడు. తల్లి బోధనలతో స్ఫూర్తి పొందాడు. నిరక్షరాస్యురాలైన తల్లి దగ్గర రామాయణం, మహాభారతం గాధలను నేర్చుకొన్నాడు. శివాజి తన సంరక్షకుడైన దాదాజీ కొండదేవ్‌ వద్ద యుద్ధ విద్యలు నేర్చుకొన్నాడు. ఇతనికి ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాస్‌. రామదాస్‌ ‘దశబోధ’ అనే గ్రంథాన్ని రచించాడు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమకారుడైన తుకారాంతో శివాజీకి సన్నిహిత సంబంధం ఉండేది.
 
శివాజి ఆక్రమణలు
క్రీశ. 1647లో శివాజీ మొదటి ఆక్రమణ తోరణదుర్గం. ఆ తరవాత కొండానా, పురంధర్‌ ప్రాంతాలను ఆక్రమించాడు. 1656లో శివాజీ, జావళి కోట ఆక్రమణను గొప్పదిగా చెబుతారు 1659లో శివాజీ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి బీజాపూర్‌ సుల్తానులు అఫ్జల్‌ఖాన్‌ను పంపారు. కానీ ఇతనిని శివాజీ మాయోపాయంతో విషపు పులిగోళ్లను ధరించి చంపేశాడు. క్రీ.శ. 1660-63లో శివాజీని బంధించుటకు ఔరంగజేబు తన మేనమామ షయిస్త ఖాన్‌ను పంపగా అతడు కూడా పరాజితుడయ్యాడు.
 
శివాజి పరాజయం
క్రీ.శ.1665లో మరోసారి శివాజీని అణచివేసేందుకు ఔరంగజేబు, రాజా జైసింగ్‌ ఆధ్వర్యంలో పెద్ద సైన్యాన్ని పంపాడు. జై సింగ్‌, శివాజీని చిన్న చిన్న యుద్ధాల్లో ఓడించాడు. పరాజితుడైన శివాజీ 1665లో రాజా జైసింగ్‌తో పురంధర్‌ సంధి చేసుకొన్నాడు. ఈ సంధి ప్రకారం శివాజీ తన అధీనంలో ఉన్న 23 కోటలను మొగలులకు ఇచ్చాడు. కుమారుడు శంభాజీతో కలసి ఔరంగజేబు ఆస్థానాన్ని దర్శించడానికి ఒప్పుకొన్నాడు. సంధి ప్రకారం ఔరంగజేబు ఆస్థానానికి వెళ్లిన శివాజీని మొగలులు బంధించి ఆగ్రా కోటలో ఉంచారు. ఈ కోట నుంచి శివాజీ తప్పించుకొన్నాడు.
 
శివాజి విజయ పరంపర
మొగలుల చెర నుంచి తప్పించుకొన్న శివాజీ స్వైర విహారం చేసి తాను పొగొట్టుకున్న కోటలన్నింటినీ ఆక్రమించుకొన్నాడు. 1672లో సూరత్‌ను కొల్లగొట్టాడు. 1674లో మహారాష్ట్రలోని రాయగఢ్‌ను రాజధానిగా చేసుకొని గాగభట్టు అనే పండితుని ఆధ్వర్యంలో అక్కడే పట్టాభిషిక్తుడై ఛత్రపతి బిరుదు పొందాడు. శివాజి పట్టాభిషేకాన్ని చూడడానికి ఆక్సిన్‌దన్‌ అనే ఆంగ్లేయుడు వచ్చాడు. క్రీ.శ 1676లో శివాజీ, గోల్కొండ నవాబు తానీషా మధ్య గోల్కొండ ఒప్పందం జరిగింది. మహారాష్ట్ర సామ్రాజ్య నిర్మాతగా పేరొందిన శివాజీ 1680లో మరణించాడు.
 
శివాజీ పరిపాలనా విధానం
శివాజీ రాజ్యానికి స్వరాజ్యమని పేరు. అష్ట ప్రధానులు అనే ఎనిమిది మంది మంత్రులుండేవారు. చౌత్‌ (1/4 వంతు), సర్దేశ్‌ముఖ్‌ (1/10 వంతు) అనే పన్నులు విధించాడు. శివాజీ రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు. వీటినే సుభాలు అంటారు. సుభాకు అధిపతి సుబేదార్‌. సుభాలను పరిగణాలుగా, పరిగణాలను తరఫ్‌లుగా విభజించాడు. 2/5 వంతు వరకు భూమి శిస్తు వసూలు చేశాడు. పటేల్‌, కులకర్ణి అనే గ్రామాధికారులు ఉండేవారు. కొలాబా అనే ప్రాంతం వద్ద నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
 
శివాజీ ఆస్థానంలో అష్ట ప్రధానులు
పీష్వా ప్రధాని
అమాత్య (మజుందార్‌) ఆర్థిక మంత్రి
సుమంత్‌ (దాబీర్‌) విదేశాంగ మంత్రి
మంత్రి (వకియానావిస్‌) నిఘా, స్వదేశీ వ్యవహారాలు
(హోం శాఖ మంత్రి) సచివ్‌ (సుర్నవిష్‌) లేఖల సూపరింటెండెంట్‌ (ఉత్తర ప్రత్యుత్తరాలు)
సేనాపతి (సారినోబత్‌) సైన్యాధిపతి
పండిత్‌రావ్‌ (సదర్‌) మతాధిపతి
న్యాయాధీష్‌ న్యాయమూర్తి
 
శంభాజి (1680 - 89)
శివాజీ కుమారుడు శంభాజి. ఔరంగజేబు దక్కన్‌ విధానంలో భాగంగా ఇతనిని మొగల్‌ సేనాని ముకారిచ్‌ ఖాన్‌ చంపి అతని కుమారుడైన షాహును, ఔరంగజేబు ఆస్థానంలో బంధించాడు. షాహుకు ఔరంగజేబు కుమార్తె జెబురున్నీసా విద్యను బోధించేది.
 
రాజారాం (1689 - 1700)
శంభాజీ తరవాత మహారాష్ట్రులకు నాయకత్వం వహించాడు. షాహు చెప్పులను సింహాసనంపై ఉంచి పరిపాలన కొనసాగించాడు. 1700లో ఆకస్మికంగా మరణించాడు. దీనితో అతని భార్య తారాబాయి తన కుమారుడైన మూడో శివాజీకి సంరక్షకురాలిగా ఉంటూ మహారాష్ట్రులకు నాయకత్వం వహించింది.
 
తారాబాయి (1700 - 1708)
తారాబాయి తన కుమారుడైన మూడో శివాజీ పేరు మీదుగా రాజ్య పాలన చేసింది. ఔరంగజేబు మరణం తరవాత మొగల్‌ చక్రవర్తి అయిన బహదూర్‌ షా - ఐ, కోటలో బందీగా ఉన్న షాహును విడుదల చేశాడు. దీనితో మరాఠా రాజ్యంలో వారసత్వ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో షాహు విజయం సాధించి మరాఠాలకు నాయకత్వం వహించాడు.
 
షాహు (1708 - 1749)
షాహు సతారాలో పట్టాభిషేకం చేసుకొన్నాడు. ఇతనికి వారసత్వ యుద్ధంలో సహాయం చేసిన బాలాజి విశ్వనాథ్‌ను పీష్వాగా నియమించుకొన్నాడు. ఇతని కాలం నుంచే మరాఠా రాజుల ప్రాధాన్యం తగ్గి పీష్వాల ఆధిపత్యం ప్రారంభమైంది. క్రమంగా పీష్వాలు పరిపాలనను తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు.