బీటెక్, మెడిసిన్‌కు టాటా.. కామర్స్‌కు హాయ్ హాయ్ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బీటెక్, మెడిసిన్‌కు టాటా.. కామర్స్‌కు హాయ్ హాయ్
వాణిజ్యశాస్త్ర కోర్సులపై విద్యార్థుల ఆసక్తి
జీఎస్టీతో పెరిగిన ఉపాధి అవకాశాలు
ఎక్కువ ప్యాకేజీలతో కొలువులే కారణం
ఏఎన్‌యూలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు

ఆంధ్రజ్యోతి, విజయవాడ ఫీచర్స్‌/గుంటూరు(విద్య): అకౌంట్స్‌, ఫైనాన్స్‌లతో బీకాం పూర్తి చేశాడు. రెండేళ్లుగా టాక్స్‌ కన్సల్టెన్సీ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు. జీఎస్టీ రాకతో ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టాక్స్‌ కన్సెల్టెన్సీ సంస్థలో తాను కలలు కన్న ఉపాధి పొందాడు. ఇది రవి ఒక్కడి విజయగాథే కాదు. టాక్సేషన్‌లో వచ్చిన నవీన మార్పులు మరెంతో మంది కామర్స్‌ గ్రాడ్యుయేట్లు, పీజీ హోల్డర్ల జీవితాల్లో వెలుగులు నింపింది...
 
ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ల మాదిరి ప్రస్తుతం వాణిజ్య శాస్త్రం యువతను ఆకర్షిస్తోంది. రాజధాని నగరంగా అవతరించిన క్ర మంలో దాదాపు అన్ని ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ స్థా యి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీలు విజయవాడలో ఏర్పాటు కావడం ఈ దిశగా వారిని ఆలోచింప చేసిందని మార్కెట్‌ వర్గా లు పేర్కొంటున్నాయి. అద్భుతమైన కెరీర్‌, ఆకర్షణీయ వేతనం, వైట్‌ కాలర్‌ జాబ్‌.. ఇవన్నీ మార్పుకు కారణమయ్యాయి.
 
మెట్రో నగరాలైన దిల్లీ, ముంబై, కోల్‌కతా, చైన్నై యువత మాదిరి ప్రస్తుతం నగర యువత కామర్స్‌ కోర్సుల వెంట పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు పెరగడం కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో బీకాం, ఎంకాం కోర్సులు చేస్తే క్లరికల్‌ పోస్టులకే పరిమితం కావాలని వాణిజ్యశాస్త్రం చదవడానికి ఎక్కువ మంది ఇష్టప డేవారు కాదు. దేశ ఆర్థిక విధానాల్లో వస్తున్న సంస్కరణల ఫలితంగా కామర్స్‌ పట్టభద్రులకు ఇంజనీరింగ్‌ విద్యార్థుల కంటే ఎక్కువ ప్యాకేజీలతో కొలువులు లభించే పరిస్థితి నెలకొంది. జీఎస్టీ, నూతన పరిశ్రమల రాకతో అవకాశాలు పెరిగిన నేపథ్యంలో విద్యార్థులు వాణిజ్య శాస్త్ర కోర్సులపై ఆకర్షితులవుతున్నారు. సీఏ, సీఎంఏ, సీఎస్‌ వంటి కామర్స్‌ ఆధారిత వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లో సైతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఎంకాం చేశాక నెట్‌, సెట్‌ పూర్తి చేస్తే అధ్యాపకులుగా పనిచేసుకోవచ్చు. పీహెచ్‌డీ, ఎంఫీల్‌ చేసిన వారికి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి. దీంతో బీకాం తర్వాత ఎంకాం చదివే విద్యార్థుల శాతం పెరుగుతోంది.
 
జీఎస్టీ రాకతో మారిన పరిణామాలు
ఐటీరంగం కుదుపులకు లోనుకావడం, ఇంజనీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు తగ్గడం వంటి కారణాలు కామర్స్‌కు క్రేజ్‌ను పెంచాయనేది నిపుణుల అంచనా. ఇదే విధంగా ఒకే దేశం, ఒకే పన్ను పేరిట మోదీ సర్కారు తీసుకోచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అవకాశాలను విస్తృతం చేసింది. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు సైతం ప్రత్యేకంగా అకౌం టెంట్లను నియమించుకోవాల్సి వస్తోంది. అకౌంట్స్‌, ఫైనాన్స్‌, టాక్సేషన్‌ రంగాల్లో ఉపాధి అవకాశాలు విప రీతంగా పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌కు పెరుగు తున్న ఆదరణతో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. చిన్న, మధ్యస్థాయి పరిశ్రమల నిర్వాహకులు అకౌంటెన్సీలో పట్టు సాధిం చిన గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పిస్తున్నాయి. బ్యాం కింగ్‌ రంగంలో ఉద్యోగం సాధించాలని ఆసక్తి ఉన్న వారు ఇంటర్‌ తర్వాత బీకాంలో చేరుతున్నారు. మా ర్కెటింగ్‌ రంగంలో ఉపాధి సాధిద్దామనే లక్ష్యంతో ఉన్న వారు బీకాం తర్వాత మేనేజ్‌మెంట్‌ కోర్సులుచేసి అదనపు అర్హతలతో ఉద్యోగాలు అందుకుంటున్నారు.
 
పెరుగుతున్న విద్యార్థులు
మూడేళ్లుగా వాణిజ్య శాస్త్రంపై ఆసక్తితో డిగ్రీలో చేరే విద్యార్థులు ఏటా పది శాతం పెరుగుతుండటంతో జిల్లాలోని పలు కళాశాలల యాజమాన్యాలు సమకాలీన అవసరాలకు తగిన విధంగా కోర్సులు రూపకల్పన చేశాయి. ఆయా కోర్సులు, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి.
 
వాణిజ్య శాస్త్ర నిపుణులకు అవకాశాలు
అకౌంటెంట్‌, టాక్స్‌ కన్సల్టెంట్‌ (జీఎస్టీ, ఇన్‌కంటాక్స్‌), హెచ్‌.ఆర్‌ పర్సనల్‌, బ్యాంకర్‌, బీపీవో, ఆడిటర్‌, స్టాక్‌ బ్రోకర్‌, ఎక్స్‌పోర్ట్‌ ఇంపోర్ట్‌ మేనేజర్‌, ఫైనాన్స్‌ కన్సల్టెంట్‌, సీఏ, కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ, ఈవెంట్‌ మేనేజరు, ట్రావెల్‌ ఏజెంట్‌, ట్రావెల్‌ మేనేజర్‌, ప్రభుత్వ ఉద్యోగాలు, మార్కెట్‌ రీసెర్చర్‌, అనలిస్ట్‌, ఎంట్రాప్రెన్యూర్‌, ఇన్సూరెన్స్‌ కన్సల్టెంట్‌ పోస్టులున్నాయి
 
ఏఎన్‌యూలో ఆన్‌లైన్‌ కోర్సు
కేంద్ర ప్రవేశ పెట్టిన జీఎస్టీతో ఆర్థిక లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ కూడా కంప్యూటర్‌ ద్వారానే చేయాల్సి వస్తుంది. అందుకు సంబంధించిన నిపుణుల కొరత జిల్లాలో తక్కువగా ఉంది. దీంతో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా జీఎస్టీకి సంబంధించి మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశ పెట్టింది. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఒక సంవత్సర కాలపరిమితిలో ఉన్న ఈ కోర్సుకు ఫీజు రూ.1000 మాత్రమే. బీకాంలో జీఎస్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక పేపర్‌ను ప్రవేశ పెట్టాలని ఇటీవల వర్సిటీ అధికారులు తీర్మానించారు.
 
మార్కెట్‌ నైపుణ్యాలు సాధించాలి
జీఎస్టీతో వాణిజ్య శాస్త్ర అభ్యాసకుల ఉపాధి అవకాశాలు విస్తరించాయి. ఫైనాన్షియల్‌ కన్సెల్టింగ్‌ కంపెనీల్లో సీనియర్‌ స్థాయి నుంచి జూనియర్‌ స్థాయి వరకూ ఉపాధి అవకాశాలు 60 శాతం పెరిగాయి. టాక్సేషన్‌, అకౌంటెంగ్‌, డేటా ఎనాలసిస్‌ రంగాల్లో విస్తృతమైన డిమాండ్‌ ఏర్పడింది. మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి.
 
పెరిగిన ఉపాధి అవకాశాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధానాల్లో తీసుకువచ్చిన సంస్కరణలతో వాణిజ్య శాస్త్ర గ్రాడుయేట్లకు ఉపాధి అవకాశాలు విస్తరించాయి. మార్కెటింగ్‌, అకౌంటింగ్‌ రంగాల్లో గతంలో కంటే జాబ్‌లు పెరిగాయి. కామర్స్‌ కోర్సులపై గతంలో కంటే ఆసక్తి పెరిగింది.
 
ఆర్థిక సంస్కరణలే ప్రధాన కారణం
కేంద్ర ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు కామర్స్‌ కోర్సులకు మంచి ఆదరణ లభించేలా చేసింది. అనేక పరిశ్రమల్లో కామర్స్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలోనే కనీసం 35 వేల నుంచి రూ.50 వేల జీతాలు అందజేస్తున్నారు. ఫలితంగా కామర్స్‌ కోర్సులకు డిమాండ్‌ ఏర్పడుతోంది.
- మట్టుపల్లి మోహన్‌(డైరెక్టర్‌ - మాస్టర్‌మైండ్స్‌)
 
సీఏ నిపుణులకు డిమాండ్‌
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీతో ప్రతి వ్యాపారి తాను చేసిన లావాదేవీలకు సంబంధించిన అకౌంట్స్‌ చూపాలి. ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖాలు చేయాలి. ఇవన్నీ చేయాల్సింది సీఏ నిపుణులు. దీంతో వీరికి డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంఽధించిన ప్రాజెక్టు రిపోర్టులు తయారీలో సీఏలదే కీలక భూమిక. ఈ నేపథ్యంలో కామర్స్‌ కోర్సులకు ఆదరణ పెరుగుతుంది.
-అన్నా నందకిషోర్‌(డైరెక్టర్‌ - శ్రీమేధ కామర్స్‌ అకాడమి)