బ్రెగ్జిట్‌ మన విద్యార్థులకు మంచిదేనా? Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
బ్రెగ్జిట్‌ మన విద్యార్థులకు మంచిదేనా?
12-09-2017: ప్రతి ఏడాది మన దేశం నుంచి వేల మంది విద్యార్థులు బ్రిటన్‌లో చదువుకోవటానికి వెళ్తుంటారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఒక రిఫరెండంలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాలని బ్రిటన్‌ ప్రజలు నిర్ణయించారు. బ్రెగ్జిట్‌ అని పిలిచే ఈ నిర్ణయం- విశ్వవిద్యాలయలపైన, విద్యా ప్రమాణాలపైన ఎలా ఉంటుందనే విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయ ప్రభావం భారత్‌ విద్యార్థులకు సానుకూలంగానే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
 
సానుకూలాంశాలేమిటి?
బ్రెగ్జిట్‌ ప్రభావం ఉన్నత విద్యపై ఎలా ఉంటుందనే విషయాన్ని విశ్లేషించటానికి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ అలెస్టర్‌ బుచన్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అంచనాల ప్రకారం- బ్రెగ్జిట్‌ తర్వాత బ్రిటన్‌లో చదవటానికి ఆసక్తి కనబరిచే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పదిశాతం పెరిగింది. దీనికి రెండు కారణాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి దాకా బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల వారు యూర్‌పలోని విద్యార్థులకు ఒక ఫీజు.. మిగిలిన దేశాల విద్యార్థులకు ఒక ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అందరు విద్యార్థులకు ఒకే ఫీజు వసూలు చేస్తారు కాబట్టి- బ్రిటన్‌లో చదవాలనుకొనే యూరోపియన్‌ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇలా మిగిలిన సీట్ల వల్ల భారత్‌ వంటి దేశాలకు చెందిన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. అంతే కాకుండా ఇప్పటి దాకా కొన్ని విశ్వవిద్యాలయాలు సీట్ల విషయంలో భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, అమెరికా వంటి దేశాలకు చెందిన విద్యార్థుల కన్నా ఈయూ విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవి. ఇప్పుడు అలాంటి ప్రాధాన్యతలు ఉండవు కాబట్టి ఇతర దేశాల విద్యార్థులకు ఎక్కువ సీట్లు లభిస్తాయి. అయితే ఈయూను వదిలేయాలనే బ్రిటన్‌ నిర్ణయం చాలా మంది విద్యావేత్తలను బాధించిందని.. వారిలో చాలా మంది బ్రిటిష్‌ విశ్వవిద్యాలయాలను వదిలి వెళ్లాలని భావిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇది కనక నిజమైతే- దీని ప్రభావం బ్రిటన్‌లో విద్యాప్రమాణాలపై తప్పకుండా పడుతుంది. ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.
 
భారత్‌కు లబ్ది?
ఇప్పటి దాకా బ్రిటన్‌ విశ్వవిద్యాలయాలు ఈయుతో కలిపి ఎరా్‌సమస్‌ ప్లస్‌ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీని వల్ల బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాలకు వంద కోట్ల స్టెర్లింగ్స్‌కు పైగా నిధులు ప్రతి ఏడాది అందుతూ ఉంటాయి. ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగితే ఈ నిధులు రావు. కానీ బ్రెగ్జిట్‌ పూర్తిగా అమలు అయ్యే దాకా తాము ఈ ప్రోగ్రాంను కొనసాగిస్తామని ఈయూ ప్రకటించింది. ఆ తర్వాతైనా ఈ ప్రోగ్రాంను ఆపేస్తారు. అప్పుడు బ్రిటన్‌- ఎరా్‌సమస్‌ ప్లస్‌ప్లస్‌ అనే ప్రోగ్రాంను అమలుచేయాలని కొందరు విద్యావేత్తలు ప్రతిపాదిస్తున్నారు. ఈయూ అందించే నిధులతో భారత్‌, చైనా, వంటి దేశాల విద్యార్థులను బ్రిటన్‌ విశ్వవిద్యాలయాలు చేర్చుకుంటాయి. దీనికి అవసరమైన సాయాన్ని ఈయూ అందిస్తుంది. దీని వల్ల భారత్‌, చైనా వంటి దేశాల నుంచి శాస్త్ర, సాంకేతిక నిపుణులు బ్రిటన్‌కు తరలి వస్తారని భావిస్తున్నారు. ఇది ఇటు ఈయూకు, అటు భారత్‌ వంటి దేశాల విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.
                                                                                              -స్పెషల్‌ డెస్క్‌