హండ్రెడ్‌ పర్సెంట్‌ రికార్డ్‌! Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
హండ్రెడ్‌ పర్సెంట్‌ రికార్డ్‌!
జాతీయ అర్హత పరీక్షల్లో నూటికి నూరు మార్కులు సాధించాలంటే అంత సులువు కాదు. ఆ మాటకొస్తే అలా సాధించిన వారు కూడా లేరు. ఆ రికార్డును బద్దలు కొట్టాడు ఉదయపూర్‌కు చెందిన కల్పిత్‌ వీర్వల్‌. జెఈఈ-మెయిన్స్‌లో 360ల మార్కులకుగాను 360 మార్కులు సాధించి మొట్టమొదటి విద్యార్థిగా లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ముంబై ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న కల్పిత్‌ విశేషాలు ఇవి...
 
నెలల తరబడి కోచింగ్‌లు తీసుకున్నా, నిపుణుల చేత పాఠాలు చెప్పించుకున్నా 100 శాతం మార్కులు సాధించడం చాలా కష్టం. కానీ ఉదయర్‌పూర్‌కు చెందిన కల్పిత్‌ ప్రముఖ సంస్థల్లో కోచింగ్‌ తీసుకోకుండానే జెఈఈ-మెయిన్స్‌లో 100 శాతం మార్కులు సాధించాడు. ఇండియాలో ‘కోచింగ్‌ హబ్‌’గా పేరున్న కోట ప్రాంతం ఉదయపూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కల్పిత్‌ తల్లితండ్రులు అక్కడికి కోచింగ్‌కు వెళ్లమని సూచించారు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే హైదరాబాద్‌కి వెళ్లమన్నారు. కానీ వాళ్ల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. రోజూ ఒక క్రమపద్ధతిలో చదివే ఏ కోచింగ్‌ తీసుకోకుండానే మంచి మార్కులు సాధిస్తానన్న నమ్మకం ఉండేది.
 
అందుకే తల్లితండ్రులు ఆఫర్‌ చేసినా కోచింగ్‌కు వెళ్లలేదు. ఉదయపూర్‌లో చిన్న సెంటర్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. ‘‘పరీక్షలో మంచి మార్కులు వస్తాయని నమ్మకంగా ఉన్నాను. కానీ 360కి 360 మార్కులు వస్తాయని మాత్రం అనుకోలేదు. లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డును కూడా ఊహించలేదు’’ అని కల్పిత్‌ తన మనసులో మాటను వెలిబుచ్చారు. నూటికి నూరు మార్కులు వచ్చాయంటే అతను రోజులో 20 గంటలు చదివి ఉంటాడని, నిద్రాహారాలు మానేసి ప్రిపేర్‌ అయి ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ కల్పిత్‌ అలా ఎప్పుడూ చదవలేదు. ‘‘రోజులో 15 గంటలు చదవను. రోజూ ఒక క్రమపద్ధతిలో చదవడం నాకు చాలా సహాయపడింది’’ అని తన ప్రిపరేషన్‌ రహస్యాన్ని పంచుకున్నారు కల్పిత్‌ వీర్వల్‌.
 
పేరెంట్స్‌ సహకారం
కల్పిత్‌ తండ్రి పుష్పేంద్ర వీర్వల్‌ ఒక సాధారణ ఉద్యోగి. మహారాణా భూపాల్‌ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తున్నారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అన్నయ్య జోధ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఎంబిబిఎస్‌ చదువుతున్నారు. ‘‘మా అబ్బాయిని ‘కోట’ లేదా ‘హైదరాబాద్‌’కు కోచింగ్‌కు పంపించమని అందరూ సూచించారు. కానీ నాకు వాడిపై అదనపు ఒత్తిడి పెట్టడం ఇష్టం లేదు. అందుకే నిర్ణయాన్ని తనకే వదిలేశాను. ఎక్కడికీ వెళ్లకుండానే మేం ఊహించని రికార్డును నెలకొల్పాడు’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు కల్పిత్‌ తండ్రి పుష్పేంద్ర.
 
తొమ్మిదోతరగతి చదువుతున్నప్పుడు ఇండియన్‌ జూనియర్‌ సైన్స్‌ ఒలింపియాడ్‌లోనూ, పదోతరగతిలో నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌లో ఈ కుర్రాడు టాపర్‌గా నిలిచాడు. తాజాగా ఈ రికార్డులో స్థానం సంపాదించడం వెనక చాలా శ్రమ దాగుంది. కల్పిత్‌ ఏడాదిలో ఒక్క రోజు కూడా క్లాసులను మిస్‌ చేసుకోలేదు. ‘‘మా అమ్మానాన్న నా ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. ఒక్కరోజు కూడా నేను జలుబు, దగ్గుతో బాధపడలేదు. స్కూల్‌కు, కోచింగ్‌కు వెళ్లిన సమయం పక్కన పెడితే ఇంట్లో 5-6 గంటలు చదువుకునేవాణ్ణి’’ అని తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. కాలేజ్‌లో ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేవాడట. జాతీయస్థాయి పోటీల్లో స్కూల్‌ తరపున ప్రాతినిద్యం వహించాడట.
 
భవిష్యత్తుపైనే దృష్టంతా...
గతంలో నేను పడిన శ్రమకు ఇప్పుడు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా భవిష్యత్తుపైనే అంటున్నాడు కల్పిత్‌. ‘‘నా దృష్టంతా వర్తమానం, భవిష్యత్తుపైనే ఉంది. నా లేటెస్ట్‌ అఛీవ్‌మెంట్‌ గతానికి సంబంధించినది. లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్సు వారు గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే పరీక్షల్లో ఇదే తరహా విజయాలను కొనసాగించడానికి అది నాకు అవసరమైన స్ఫూర్తినిస్తుంది’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘రికార్డ్స్‌ ఉన్నవే చెరిపేయడానికి! రాబోయే రోజుల్లో నా రికార్డును సైతం బద్దలుకొట్టేది చూడాలని ఉంది’’ అంటున్నాడు కల్పిత్‌.
 
జెఈఈ-అడ్వాన్స్‌డ్‌లో కల్పిత్‌ వీర్వల్‌ ర్యాంకు 109. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రవేశాల కోసం దాదాపు 11.8 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 2.2 లక్షల మంది ఫైనల్‌ పరీక్షకు ఎంపికయ్యారు. వీరిలో 109వ ర్యాంకు సాధించాడు కల్పిత్‌. మెయిన్స్‌లో ఒక్క మార్కు కూడా కోల్పోలేదు. అతను సాధించినది చిన్న విషయమేమీ కాదు. అందుకే ‘ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్స్‌’ కేటగిరీలో లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటు దక్కింది. అయితే 109వ ర్యాంకు రావడం కొంత అసంతృప్తికి గురి చేసినా, ముంబై ఐఐటీలో కంప్యూటర్‌సైన్స్‌ సీటు రావడం ఆనందాన్నిచ్చింది అంటాడు కల్పిత్‌.