జీఎస్టీ.. Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
జీఎస్టీ..
ఒక దేశం అంతర్జాతీయంగా రాజకీయశక్తిగా ఎదగాలంటే ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. ఈ ఆర్థిక పరిపుష్టికి పన్నులు కూడ ఒక కారణం. ప్రభుత్వాలు విధించే పన్నులు సామాన్యులకు అర్థమయ్యేలా, వారు సక్రమంగా చెల్లించేవిధంగా ఉండాలి. ముఖ్యంగా ఇవి పరోక్ష పన్నులుగా ఉన్నప్పుడే సులభంగా ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం ఏదైనా పన్ను రాబడితోనే సాధ్యం. దేశంలో ఇప్పటి వరకు అమలైన పరోక్ష పన్నుల వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ఒక్కో వస్తువుపై, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విఽధంగా పన్నులు ఉన్నాయి. దీంతో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు, వర్తకులు చెల్లింపుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టే దిశగా జిఎస్‌టి (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌)అనే అతి పెద్ద పన్ను సంస్కరణను ఇటీవల కార్యరూపంలోకి తీసుకువచ్చారు. దీని ద్వారా ఒకే దేశం ఒకే పన్ను అనే పద్ధతి ఏర్పడింది.
జిఎస్‌టి (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) వస్తు సేవల పన్ను
భిన్నత్వంలో ఏకత్వం అనే మాట వస్తు సేవల పన్నుకు సరిపోయేలా ఉంది. ఒకటే దేశం - ఒకటే మార్కెట్‌ - ఒకటే పన్ను అనే నినాదంతో స్వతంత్ర భారత పన్నుల చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. కనీ కనపడకుండా రకరకాల పన్ను బాదుళ్ళ కథ ముగిసిపోయింది.
 
స్వతంత్ర భారతావని చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణగా ప్రసిద్ధి పొందిన వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు నోచుకోవడం వెనుక సుదీర్ఘ కథ ఉంది. ఇది ఆచరణ రూపం దాల్చడం వెనుక దాదాపు 17 సంవత్సరాల కృషి ఉంది. ఎన్నో ఒడుదొడుకులను తట్టుకొని రాజకీయ ఆటుపోట్లను అధిగమించి, ఈ సంస్కరణ దేశ ప్రజల ముంగిటకు వచ్చింది. ఈ 17 సంవత్సరాల ప్రయాణం ఇలా సాగింది.
జిఎస్‌టి మజిలి
2000 సంవత్సరంలో ఆటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఎన్డీయే ప్రభుత్వం ఉన్న సమయంలో మొదటిసారిగా ఈ పన్ను సంస్కరణకు ఆలోచన ఉద్భవించింది. నాటి పశ్చిమ బెంగాల్‌ ఆర్థికమంత్రి అసిమ్‌దాస్‌ గుప్తా నేతృత్వంలో వాజ్‌పేయి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు సి.రంగరాజన్‌, పటేల్‌, బిమల్‌ జలాన్‌ నేతృత్వంలోని ఆర్థిక సలహా కమిటీ సిఫార్సు చేసింది.
జిఎస్‌టి రూపురేఖలను తయారుచేయడం, దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వ్యవస్థల ఏర్పాట్లు, మొదలైన బాధ్యత ఈ కమిటీ ప్రధాన విధి.
 
పన్ను సంస్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో వాజపేయి ప్రభుత్వం 2003లో విజయ్‌ కేల్కర్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 12వ ఆర్థిక సంఘం సూచించినట్లుగానే జిఎస్‌టిని తీసుకురావాలంటూ విజయ్‌ కేల్కర్‌ కమిటీ 2005లో సిఫార్సు చేసింది.
తరవాత వచ్చిన యుపిఎ ప్రభుత్వం 2005లో అప్పటి ఆర్థికమంత్రి పి.చిదంబరం జిఎస్‌టిని అమలులోకి తేవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. 2006లో పి.చిదంబరం జిఎస్‌టిని ప్రవేశపెట్టడానికి 2010 ఏప్రిల్‌ 1ని తుది గడువుగా ప్రకటించారు. అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. 2009లో జిఎస్‌టి మౌలిక స్వరూపాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖంగా ప్రకటించారు. 2010లో బిజెపి పాలిత రాష్ట్రాలు పలు అభ్యంతరాలను లేవనెత్తాయి. దీంతో ప్రభుత్వం ప్రకటించిన గడువుకాలం చెల్లిపోయింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల కంప్యూటరీకరణను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ యుద్ధ ప్రాతిపదికన వివరించింది. ఈ ప్రాజెక్టు జిఎస్‌టికి పునాది వేసింది.
2011లో లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బిజెపి, లెఫ్ట్‌, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. దీనిని పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత జిఎస్‌టి కమిటీ చైర్మన్‌గా అసిమ్‌దాస్‌ గుప్తా తప్పుకొన్నారు. ఆయన స్థానంలో కేరళ ఆర్థికమంత్రి కె.ఎం. మణికి బాధ్యతలు అప్పగించారు. 2013లో జిఎస్‌టితో రాష్ట్రాలకు ఏర్పడే నష్టాన్ని పూడ్చడానికి రూ.తొమ్మిదివేల కోట్లను ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రకటించారు. జిఎస్‌టి వివాదాల అథారిటీపై కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారాలను కల్పించడంతో స్థాయిసంఘం సమావేశాల్లో భాజాపా, లెఫ్ట్‌ పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి. 2014లో 15వ లోక్‌సభ రద్దుకావడంతో రాజ్యాంగ సవరణ బిల్లుకు కాలం చెల్లిపోయింది. తదుపరి ఎన్‌డిఎ అధికారంలోకి రావడం, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవడం, బిజెపికి లోక్‌సభలో అత్యధిక మెజారిటీ ఉండటం జిఎస్‌టికి కలిసివచ్చిన అంశం.
2015 ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జిఎస్‌టిని 2016 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. 2015 మేలో జిఎస్‌టికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 2015 ఆగస్టులో బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేయడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజ్యసభలో సరైన మెజారిటీ లేకపోవడమే అందుకు కారణం.
2016 మార్చిలో జిఎస్‌టి రేటుపై పరిమితి విధించాలన్న కాంగ్రెస్‌ ప్రతిపాదనకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. 2016 అగస్టులో బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. 2016 సెప్టెంబర్‌లో బిల్లుకు 16 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. 2016 నవంబర్‌లో నాలుగంచెల పన్ను స్వరూపాన్ని జిఎస్‌టి మండలి ఖరారు చేసింది.
2017 మార్చిలో జిఎస్‌టి అమలుకు సంబంధించి నాలుగు కీలక బిల్లులను పార్లమెంటు ఆమోదించింది. 2017 జూన్‌ 30 అర్థరాత్రి జిఎస్‌టి అమలులోకి తేవడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. 2017 జూలై ఒకటి నుంచి వస్తు, సేవల పన్ను అమలులోకి వచ్చింది.
జిఎస్‌టి ఆవశ్యకత
దేశంలో కేంద్ర పన్నులు.. కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, సివిడి (కౌంటర్‌ వెయిలింగ్‌ డ్యూటీ), ప్రత్యేక అదనపు కస్టమ్స్‌ డ్యూటీ, సేవాపన్నులు.
రాష్ట్ర పన్నులు
రాష్ట్ర వ్యాట్‌, కేంద్ర అమ్మకపు పన్ను, విలాస సుంకం, ప్రవేశపన్ను, వినోద పన్ను (స్థానిక సంస్థలు విధించేవి మినహా) ప్రకటనలపై పన్ను, కొనుగోలు పన్ను, లాటరీలు, పందాలు, జూదం, గాంబ్లింగ్‌, మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు (ముడి చమురు, పెట్రోలు, డీజిల్‌, సహజ వాయువు, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ఎటిఎఫ్‌), విద్యుత్‌లపై ఇలా రకరకాల పన్నులు దేశంలో ఉన్నాయి. దేశంలో ఒక మార్కెట్‌ లేదు దారి సుంకం, ఎంట్రీ ట్యాక్స్‌, చెక్‌పోస్టులు వంటి అనేక అడ్డుగోడలున్నాయి. ఈ పరిస్థితి దేశమంతటా స్వేచ్ఛాయుత వర్తకానికి అడ్డుగోడలా మారింది.
ఒకపక్క ప్రజలపై పన్నుల భారం అధికంగా ఉండగా అదే సమయంలో ప్రభుత్వానికి తగినంతగా ఆదాయం సమకూరడం లేదు. ఈ సమస్యలకు జిఎస్‌టితో చాలావరకు పరిష్కారం దొరకవచ్చు.
పన్ను శ్లాబులు
జిఎస్‌టి కౌన్సిల్‌ నాలుగు రకాలైన పన్ను శ్లాబులను ఆమోదించింది. దీని ప్రకారం (5ు), (12ు), (18ు), (28ు) పన్ను రేట్లు అమలవుతున్నాయి. ఒక్కో పన్ను శ్లాబు కింద వచ్చే వస్తువులు, సేవలు ఏవి అనేది ప్రభుత్వం నిర్ణయించింది. బంగారు ఆభరణాలకు (3ు) ప్రత్యేక జిఎస్‌టి రేటును ప్రతిపాదించారు.ఈ పన్ను శ్లాబులను జిఎస్‌టి కౌన్సిల్‌ సిఫార్సు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్‌టి రేట్లను నోటిఫై చేశాయి. ఒక వస్తువు లేదా సేవపై పన్ను తగ్గించాలనుకున్నా, పెంచాలి అనుకున్నా అది జిఎస్‌టి కౌన్సిల్‌కే సాధ్యం.
జిఎస్‌టి మండలికి కేంద్ర ఆర్థికమంత్రి (చైర్మన్‌), రాష్ట్రాల ఆర్థిక మంత్రుల్లో (సభ్యులుగా) సగంమంది సభ్యులు సమావేశానికి హాజరైతే ‘కోరం’ ఉన్నట్లు అవుతుంది. హాజరైన సభ్యుల్లో నాలుగింట మూడోవంతు సభ్యులు ఆమోదిస్తేనే ఏ నిర్ణయం అయినా కార్యరూపంలోకి వస్తుంది.
పన్నురేట్ల నిర్ణయం, సవరణ, తొలగింపు, పెంపు - తగ్గింపు, ప్రతి విషయంలోనూ తుది నిర్ణయం జిఎస్‌టి కౌన్సిల్‌దే.
రాష్ట్రాలపై ప్రభావం
ఇప్పటివరకు తయారీ కార్యకలాపాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకుపన్ను ఆదాయం అధికంగా సమకూరుతూ వచ్చింది. జిఎస్‌టితో వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు అధిక ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. అందువల్ల పారిశ్రామికంగా అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలు తొలుత జిఎస్‌టిని వ్యతిరేకించాయి. ఆదాయ నష్టాన్ని భరించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధపడిన తరవాత అవి జిఎస్‌టికి ఒప్పుకొన్నాయి. ప్రస్తుత ఏర్పాటు ప్రకారం జిఎస్‌టితో రాష్ట్రాల పన్ను రాబడి తగ్గితే దానికి వచ్చే అయిదేళ్లపాటు కేంద్రప్రభుత్వం భరిస్తుంది. ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి పన్ను ఆదాయానికి(మద్యం, పెట్రోలియం ఉత్పత్తుల మినహా) 14ు వృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆదాయంలో హెచ్చు తగ్గులు లెక్కిస్తారు. దీంతో పోల్చితే జిఎస్‌టి ద్వారా రాష్ట్రానికి సమకూరిన పన్ను రాబడి తక్కువ ఉంటే దానిని కేంద్రం భర్తీ చేస్తుంది.
జిఎస్‌టి మండలి
జిఎస్‌టి అమలు విషయంలో మండలిదే కీలకమైన పాత్ర. దీనిలో కేంద్రానికి, రాష్ట్రానికి బలమైన ప్రాతినిధ్యం ఉంది.
 
మండలిలో ఓటింగ్‌ అధికారాలు
జిఎస్‌టి మండలి నియమాల ప్రకారం కేంద్ర, రాష్ట్రాల్లో ఏ ఒక్కటి ఇతరుల ఆమోదం లేనిదే నిర్ణయం తీసుకోలేదు. ఏకాభిప్రాయ సాధనలో భాగంగా మండలి తీసుకొనే ప్రతి నిర్ణయానికి 3/4వ వంతు మెజారిటీ అవసరం. ఇందులో కేంద్రానికి ఓటు (వెయిటేజి) 1/3వ వంతు, రాష్ట్రాలకు 2/3వ వంతుగా ఉంటుంది. దీనివల్ల ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకోవాలి - అనుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్రాల ఏకాభిప్రాయం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్రాలు విభిన్న రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం తలేత్తినా మండలిదే తుది నిర్ణయం. కాకపోతే ఉత్పత్తి, ఉత్పత్తేతర రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక సంక్షోభాల పరిష్కారం మాత్రం మండలి ముందున్న పెద్ద సవాలుగా చెప్పవచ్చు. రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ‘వివాద పరిష్కార యంత్రాంగం’ ద్వారా పరిష్కరించుకోవచ్చు.
మండలి కార్యాచరణ
పన్నులు, పన్నురేట్లు, సర్‌ ఛార్జీలు అన్నింటిపైనా నిర్ణయం తీసుకుంటుంది. పన్ను విధింపులపై దీనిదే నిర్ణయం.
సామాన్యులను ఉపశమనం కలిగించే దిశగా ఏ వస్తు సేవలకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలనేది కూడా మండలి చూస్తుంది.
రాష్ట్రాల పన్ను అధికారుల పాలన పరమైన విధుల పంపకాలను కేంద్ర ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ బోరు పర్యవేక్షిస్తుంది.
జిఎస్‌టికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్రానికి, రాష్ట్రాలకు సిఫార్సు చేస్తుంది.
జిఎస్‌టిలో చేర్చే, మినహాయించే వస్తువులు, సేవల జాబితా, జిఎస్‌టి నమూనా చట్టాలు, నియమాలు, జిఎస్‌టి రేట్లు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు అదనపు వనరుల సేకరణకు ప్రత్యేక రేట్ల నిర్ణయం, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది.
ఓట్ల లెక్కలిలా
మండలిలో ఇద్దరు కేంద్ర మంత్రులకు 33 శాతం ఓటింగ్‌ వెయిటేజి, రాష్ట్ర మంత్రుల 31 ఓట్లకు 67శాతం వెయిటేజి ఉంటుంది. కేంద్ర మంత్రులకు ఒక్కో ఓటుకు 16.5ు వెయిటేజి ఉండగా, రాష్ట్రాల మంత్రులకు ఓటింగ్‌ వెయిటేజి 2.12శాతం ఉంటుంది.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 75శాతం ఓట్లు రావాలి. దీనినిబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కేంద్ర ఏకపక్షం 33శాతం ఓటింగ్‌తో లేదా రాష్ట్రాలు 67శాతం ఓటింగ్‌తో ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరని.
 
మండలి స్వరూపం
రాజ్యాంగంలోని సవరించిన ఆర్టికల్‌ 279 ఎ(1) ప్రకారం రాష్ట్రపతితో ఏర్పాటైన జిఎస్‌టి మండలి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వేదిక.
అధ్యక్షుడు: కేంద్ర ఆర్థికమంత్రి.
సభ్యులు: కేంద్ర ఆర్థిక / రెవిన్యూశాఖ సహాయమంత్రి. రాష్ట్రాల ఆర్థిక / పన్నులశాఖ మంత్రులు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే ఎవరైనా మంత్రి.
ఉపాధ్యక్షులు: రాష్ట్ర మంత్రుల్లో ఒకరు.
మల్లవరపు బాలలత
2016 సివిల్స్‌ ర్యాంకర్‌