కెరీర్‌గా యోగా..! Diksuchi -Article
అనంతపురం: ధర్మవరంలో కిడ్నాపైన రుషిత ప్రియ(6) క్షేమం|సంగారెడ్డి: ఇస్నాపూర్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో లేని ఖాతాలు సృష్టించి రూ. 12 కోట్లు కాజేసిన ఫీల్డ్ ఆఫీసర్|మెట్రోరైలును నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: కేటీఆర్|కమల్‌హాసన్‌ను కలిసిన కేజ్రీవాల్‌..కేంద్రంపై పోరాటానికి కలిసిరావాలని కమల్‌ను కోరిన కేజ్రీవాల్|జపాన్‌ ఓపెన్‌ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి|కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే |కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి|నల్గొండ: ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి సోదరుడి భార్య శ్రీలత(45) ఉరివేసుకుని ఆత్మహత్య|అమరావతి: కంచె ఐలయ్య వైశ్యులందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు: మంత్రి సోమిరెడ్డి|జపాన్‌ ఓపెన్‌లో ముగిసిన సింధు పోరు, ప్రిక్వార్టర్స్‌లో ఒకుహరా చేతిలో 18-21 ,8-21తో పరాజయం     
కెరీర్‌గా యోగా..!
నేను ఇంటర్‌ పూర్తి చేశాను. రెగ్యులర్‌ కోర్సులు చదవాలని లేదు. కొంత భిన్నమైన కెరీర్‌ ఎంచుకోవాలనుకుంటున్నాను. అయితే యోగా పట్ల ఆసక్తి ఉంది. దీనిని కెరీర్‌గా ఎంచుకోవచ్చా? యోగాను కోర్సుగా అందించే సంస్థలు ఏమైనా ఉన్నాయా తెలుపగలరు?
- ప్రత్యూష, విజయవాడ
యోగాకు ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగింది. భిన్నమైన కెరీర్‌ గురించి ఆలోచించే వారికి ఇది పనికి వస్తుంది. అయితే దీనిని కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నవారు లోతుగా అధ్యయనం చేయాలి. హాబీగా పైపైన నేర్చుకునే వారికి అంతగా ఉపయోగం ఉండదు. యోగా నైపుణ్యాలతోపాటుగా, ఫిలాసఫీ, అనాటమిని కూడా తెలుసుకోవాలి. అప్పుడే సమగ్రంగా ఉంటుంది.
యోగా అనేది అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సుగా అందుబాటులో ఉంది. అయితే డిగ్రీ, పీజీలతో పాటుగా సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. వీటికి ఎలాంటి విద్యార్హతలు, ప్రత్యేక వయసు అక్కరలేదు. ఈ కోర్సులు సంస్థలను బట్టి కాల వ్యవధి వారాల నుంచి సంవత్సరాల వరకు ఉంటాయి. కొన్ని సంస్థలు అందించే కోర్సుల్లో నేచురోపతి, ఆయుర్వేద సబ్జెక్టులను కూడా కలిపి బోధిస్తారు. నిజంగా యోగా టీచింగ్‌లో ఉండాలంటే బేసిక్‌ హ్యూమన్‌ అనాటమి, ఫిలాసఫి, ఆరోగ్య రక్షణ అంశాలపై పట్టుసాధిస్తే మంచిది. మైండ్‌ అండ్‌ యోగా, ఫిలాసఫి ఆఫ్‌ యోగా, పర్‌స్పెక్టివ్‌ ఆఫ్‌ యోగా తదితర విభాగాలుగా యోగా ఉంటుంది. ఇందులో మీకు అనుకూలమైనది ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఇది చదువుతూనే దీనితోపాటు రెగ్యులర్‌ డిగ్రీ కోర్సు కూడా చేసేందుకు కొన్ని సంస్థలు అంగీకరిస్తాయి.
కొన్ని యోగ కోర్సులు నడిపే సంస్థలు
రామమణి అయ్యంగార్‌ మెమోరియల్‌ యోగా ఇన్‌స్టిట్యూట్‌, ముంబై-పుణె
బీహార్‌ స్కూల్‌ ఆఫ్‌ యోగా(బిఎ్‌సవై), ముంగేర్‌ బీహార్‌, పుణె
శివానంద యోగా వేదాంత, యోగా టీచర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ కేరళ(దీనికి ఢిల్లీలో బ్రాంచ్‌ ఉంది)
కృష్ణమాచార్య యోగా మందిరం, చెన్నై
గురుకుల కంగ్రి విశ్వవిదాలయ, హరిద్వార్‌
బాబా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, అల్వార్‌
దేవ్‌ సంస్కృతి విశ్వవిద్యాలయ(దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో సెంటర్లు ఉన్నాయి)
గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా హెల్త్‌పోర్టల్‌(www.nhp.gov.in)లో కూడా యోగా శిక్షణ సంస్థల లిస్టు ఉంది.
గోవర్ధనం కిరణ్‌కుమార్‌
చిరునామా: వివరాలు ఇవిగో, కేరాఫ్‌ ఎడ్యుకేషన్‌ డెస్క్‌, ఆంధ్రజ్యోతి, ప్లాట్‌ నెం.76, రోడ్‌ నెం.70,
అశ్వినీ ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌, జర్నలిస్ట్‌ కాలనీ,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500 033