ఈయూలో మెడిసిన్‌ Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఈయూలో మెడిసిన్‌
ఎంబిబిఎస్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడిసిన బ్యాచిలర్‌ ఆఫ్‌ సర్జరీ).. ఇంటర్మీడియెట్‌ బైపీసీలో చేరిన ప్రతి విద్యార్థి కల. తీవ్రమైన పోటీ, పరిమిత సంఖ్యలో సీట్లు, అధిక ఫీజుల కారణంగా మెడిసిన్‌ కోసం విదేశాలవైపు అడుగులు వేస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్న గమ్యం యురోపియన యూనియన (ఈయూ). యూర్‌పలోని 28 దేశాల కూటమే యురోపియన యూనియన. ఉమ్మడి కరెన్సీ యూరో.
 
పెద్ద తేడాలేదు: సిలబస్‌ విషయంలో మన దేశానికి యురోపియన యూనివర్సిటీలకు పెద్ద తేడా ఏమీ ఉండదు. కాకపోతే మనది ఉష్ణ ప్రభావితం దేశం కాబట్టి దానికనుగుణంగా వచ్చే వ్యాధులపై సిలబ్‌సలో ఎక్కువ ఫోకస్‌ ఉంటుంది. అదే యురోపియన యూనియనలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వచ్చే వ్యాధులపై ఎక్కువ దృష్టి ఉంటుంది. వైద్య విద్యకు సంబంధించిన ప్రాథమిక సబ్జెక్ట్‌లు ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయి. యురోపియన యూనియనలో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు పెద్దపీట వేస్తారు అకడమిక్‌ పరంగా నిర్వహించే పరీక్షలు తక్కువగా ఉంటాయి.
కోర్సు స్వరూపం: యురోపియన యూనియనలో ఎంబిబిఎ్‌సను ఎండి అని కూడా వ్యవహరిస్తారు. కోర్సు కాలవ్యవధి క్లినికల్‌ ట్రైనింగ్‌తో కలిపి ఆరు-ఆరున్నరేళ్లు. ఎంచుకున్న దేశం, యూనివర్సిటీని బట్టి కూడా కోర్సు వ్యవధి మారుతూ ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. మన దేశంలో చదివిన వారితో సమానంగా యురోపియన యూనియన దేశాల నుంచి ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన వారి డిగ్రీ చెల్లుబాటవుతుంది. కాకపోతే మన దేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే ఎంసిఐ (మెడికల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఇండియా) నిర్దేశించిన ఫారెన మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించాలి.
అర్హత-ప్రవేశ ప్రక్రియ: యురోపియన యూనియన మెడికల్‌ ఇనస్టిట్యూట్‌లలో చదవడానికి కావల్సిన అర్హత 50 శాతం మార్కులతో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ర్టీలతో 10+2/తత్సమానం. వయసు: 18 ఏళ్లు. ప్రవేశం పొందాలంటే ప్రీ మెడికల్‌ ఎగ్జామ్‌ అర్హత, టోఫెల్‌/ఐఈఎల్‌టిఎస్‌ స్కోర్‌ (6.0) కావాల్సి ఉంటుంది. ప్రీ మెడికల్‌ ఎగ్జామ్‌లో మన విద్యార్థులు సునాయసంగా అర్హత సాధించవచ్చు. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉండే ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు. అర్హత కోసం ప్రీ మెడికల్‌ ఎగ్జామ్‌లో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. ప్రీ మెడికల్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధిస్తే అడ్మిషన, వీసా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు ఎంచుకున్న యూనివర్సిటీ నిర్దేశించిన విధంగా అడ్మిషన ప్రక్రియను పూర్తి చేయాలి. దీని ఆధారంగా యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స లెటర్‌ వస్తుంది. అటుపై వీసా కోసం సంబంధిత దేశ రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
 
ట్యూషన్ ఫీజు: ఎంచుకున్న దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
ఉదాహరణకు స్లొవేకియాలో ఏడాదికి 12వేల యూరోలు, చెక్‌ రిపబ్లిక్‌లో 11-13వేల యూరోలు, బల్గేరియాలో 9వేల యూరోలు, హంగరీలో 12-15 వేల యూరోలు అవసరం. విదేశీ విద్యార్థులకు అధిక శాతం యూనివర్సిటీల్లోనే నివాస సౌకర్యం కల్పిస్తారు. భోజనం విషయానికొస్తే ఇండియా, చైనీస్‌ సంబంధిత వంటకాలు అన్నీ అందుబాటులో ఉంటాయి. స్థానికుల సహాయంతో భారతీయ వంటకాలను సిద్ధం చేసేందుకు కొన్ని యూనివర్సిటీలు కూడా ఏర్పాట్లు చేస్తాయి. సరాసరి భోజన, వసతి తదితరాలకు కలిపి దాదాపు 500-700 యూరోలు అవసరం.
అడ్వాంటేజెస్‌: యురోపియన యూనియన యూనివర్సిటీల నుంచి ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన వారికి పలు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో బెస్ట్‌ మెడికల్‌ ఇనస్టిట్యూట్స్‌లో అత్యుత్తమ ఫ్యాకల్టీ, ఆధునాతన ల్యాబ్‌, మౌలిక సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అభ్యసించవచ్చు. కోర్సు పూర్తి చేసిన తరవాత అక్కడే ఉండి పీజీ కూడా చేయవచ్చు. కోర్సు తరవాత శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. తద్వారా వీసా లేకుండానే దాదాపు 100 దేశాల్లో పర్యటించవచ్చు. యూర్‌పతోపాటు నాలుగు ఖండాల్లో డిగ్రీ చెల్లుబాటు అవుతుంది. యూర్‌పలో డాక్టర్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. కాబట్టి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి.
వెబ్‌సైట్‌: www.vestyn-education.org, info@vestyn-education.org,
uk@vestyn-education.org
 

టెట్‌ -ఉపాధ్యాయ వృత్తికి తొలిమెట్టు
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ‘స్కూల్‌ ఎడ్యుకేషన డిపార్ట్‌మెంట్‌’ టెట్‌ నోటిఫికేషనను విడుదల చేసింది. తెలంగాణ స్టేట్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టిఎస్‌ టెట్‌-2017) పేరుతో ఈ నోటిఫికేషన విడుదలైంది. ఈ పరీక్షను 2017 జూలై 23న నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పడిన
31 జిల్లాల్లో తొలిసారిగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జాతీయస్థాయిలోని ఎనసిఇఆర్‌టికి రాష్ట్రస్థాయి అనుసంధాన సంస్థ ఎస్‌సిఇఆర్‌టి ఈ పరీక్ష
నిర్వహణ బాధ్యతను స్వీకరించింది.
భారతదేశ ప్రాథమిక విద్యారంగంలో ప్రాథమిక మార్పులకు అంకురార్పణ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరంభమైంది. భారత పార్లమెంటు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ‘ప్రాథమిక విద్యాహక్కు’ను గుర్తించింది. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కమిటీ సిఫార్సులు, పిఓఏ లేదా ప్రోగ్రామ్‌ ఆఫ్‌ యాక్షన్‌ ప్రణాళికలు, ప్రొఫెసర్‌ రామ్మూర్తి కమిటీ తీర్మానాలు మొదలైన అంశాల ప్రాతిపదికగా 2002 డిసెంబరు 12న 86వ రాజ్యాంగ సవరణ చేశారు. ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21కి ‘ఎ’ క్లాజ్‌ను చేర్చి ప్రాథమిక విద్య (1 నుంచి 8వ తరగతి వరకు - 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు) అందరికి అందుబాటులోకి వచ్చేవిఽధంగా ప్రాథమిక హక్కుగా మార్చారు.
ఈ ప్రాథమిక విద్యాహక్కును అమలు చేయడానికి అవసరమైన చట్టాన్ని 2009 జూలై 20న భారత పార్లమెంట్‌ ఆమోదించింది. 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొంది 2010 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని ‘ఉచిత, నిర్భం ద విద్యకు బాలల హక్కుల చట్టం 2009’గా పిలుస్తున్నారు. ఈ చట్టంలో 7 అధ్యాయాలు, 38 నిబంధనలు ఉన్నాయి.
ఈ చట్టంలోని 23వ నిబంధన ఉపాధ్యాయ నియామకాలు, అర్హతలను వివరిస్తుంది. దీనిని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా అధీకృతం చేసిన అకడమిక్‌ సంస్థ నిర్ధారించిన అర్హతలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఉపాధ్యాయులుగా అర్హులు. అంటే ఎన్‌సిటిఇ(నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన) గుర్తించిన అర్హతలు కలిగినవారు మాత్రమే. ఈ అంశంపై ఎన్‌సిటిఇ 2010 ఆగస్టు 23న స్పష్టమైన ఆదేశాలతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏపీ టెట్‌ పేపరుతో ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌, ఫోర్త్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం టిఎస్‌ టెట్‌ పేరుతో 2016లో తొలిసారి పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష ఉత్తీర్ణత అర్హత ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది.
 
ప్రాథమిక అర్హతలు
డిఎడ్‌, బిఇడి, భాషా పండితులు లేదా వాటికి సమానమైన విద్యార్హతలు గల అభ్యర్థులు.
పై డిగ్రీల సాధనలో ఉన్న ఫైనల్‌ పరీక్షకు సంసిద్ధమవుతున్నవారు.
ప్రధానంగా 1 నుంచి 8వ తరగతి బోధనకు సంసిద్ధమవుతూ, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, మండల పరిషత, జిల్లా పరిషత పాఠశాలల్లో, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పని చేసేందుకు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి.
జూ అదేవిధంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయినంత మాత్రన ఉద్యోగం లభించదు. ఉద్యోగ అర్హతగా మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలను ఈ అర్హత క్రమంలోకి తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.
 
పరీక్ష ప్రక్రియ
టిఎస్‌ టెట్‌ 2017లో ప్రాథమికంగా రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్‌-1: 1 నుంచి 5వ తరగతి బోధనకు అవసరమైన అర్హత సాధించాల్సిన వారు పేపర్‌-1 రాయాలి.
పేపర్‌-2: 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారు పేపర్‌-2 రాయాలి.
అయితే అర్హతలున్న అభ్యర్థులకు రెండు పేపర్లు రాసే అవకాశాన్ని కల్పించారు.
పరీక్ష తేదీ: 2017 జూలై 23 (ఆదివారం)
పేపర్‌-1: ఉదయం 9.30 నుంచి 12.00 వరకు
పేపర్‌-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు
రెండు పరీక్షలకు కాల పరిమితి విడివిడిగా రెండున్నర గంటలు కేటాయించారు.
 
దరఖాస్తు విధానం
టిఎస్‌ టెట్‌-2017 నోటిఫికేషన్‌లో పరీక్ష ఫీజు రూ.200గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపునకు 2017 జూన్‌ 12 నుంచి 2017 జూన్‌ 24 వరకు సమయాన్ని ఇచ్చారు. అయితే అప్లికేషన్ల సబ్మిషన్‌ మాత్రం 2017 జూన్‌ 13 నుంచి 2017 జూన్‌ 28 వరకు ఉంది. తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం టెట్‌ పరీక్ష నిర్వహించినప్పుడు పరీక్ష కేంద్రాలను పరిమితంగా కేటాయించారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో మాత్రం 31 జిల్లా కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా ప్రకటించారు. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను నిర్ణయించుకొనే స్వేచ్ఛ కూడా ఉంది. రద్దీ గల పరీక్ష కేంద్రాల నుంచి అవకాశం ఉన్న కేంద్రాలకు మారే అవకాశం ఆన్‌లైన్‌లోనే కల్పించారు.
 
టెట్‌ సిలబస్‌ / పరీక్ష పద్ధతి / ఉత్తీర్ణ అంశాలు
ఈ సిలబ్‌సలో స్వల్ప స్థాయిలో కొన్ని మార్పులు చేశారు. ప్రధానంగా తెలంగాణ విద్యా ప్రక్రియలో అంతర్భాగంగా మారిన సమగ్ర నిరంతర మూల్యాంకన పద్ధతి (సిసిఇ)ను చేర్చారు. అదేవిధంగా చైల్డ్‌ డెవల్‌పమెంట్‌, పెడగాగి విభాగంలో స్వల్ప మార్పులు చేశారు. సాంఘికశాస్త్ర విభాగంలో నూతన జిల్లాల సమాచారం, ప్రభుత్వ పథకాలపై విద్యార్థుల సమాచారంపై అభ్యర్థులకు కనీస అవగాహన ఉండాలి. అదేవిధంగా రెండు పేపర్లలోనూ 150 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది. అయితే ప్రశ్నల విషయంలో స్థాయిపర భేదాలుంటాయి. అభ్యర్థులు http://tstet.cgg.gov.in నుంచి సిలబస్‌ పూర్తి సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పాస్‌ క్రైటేరియా
కమ్యూనిటీ పాస్‌మార్కులు
జనరల్‌ 60ు అంతకంటే ఎక్కువ
బిసి (అన్ని
తరగతులు) 50ు అంతకంటే ఎక్కువ
ఎస్సీ/ఎస్టీ/
దివ్యాంగులు 40ు అంతకంటే ఎక్కువ
టెట్‌ వ్యాలిడిటీ - వెయిటేజ్‌
టిఎస్‌ టెట్‌ సర్టిఫికెట్‌ ఏడు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ఏదైనా టీచర్‌ పోస్టు భర్తీలో 20ు వెయిటేజీ ఉంటుంది. అయితే అభ్యర్థులు దీనిని అర్హత పరీక్షగానే పరిగణించాల్సి ఉంటుంది తప్ప ఉద్యోగ గ్యారంటీ పరీక్షగా కాదు.
 
పరీక్ష ఉత్తీర్ణతకు సూచనలు
అభ్యర్థులు ఈ కింది అంశాలను అవగతం చేసుకోవడం ద్వారా విజయాన్ని పొందే అవకాశాలుంటాయి.
సిలబ్‌సను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి అంశంపైనా అవగాహన కలిగి ఉండాలి.
గత ప్రశ్నపత్రాల సరళిని పరిశీలించాలి. వాటికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ఆరంభించాలి.
టైమ్‌ ప్రిపరేషన్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌లపై అభ్యర్థులకు స్పష్టత ఉండాలి.
తమ విషయ పరిజ్ఞానంతోపాటు చైల్డ్‌ డెవల్‌పమెంట్‌, పెడగాగి, ఇంగ్లీష్‌ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అప్లికేషన్‌ లేదా అనువర్తింపు ప్రశ్నలపై పట్టుకు ప్రత్యేకంగా సాధన చేయాలి.
 
సీశాట్‌ - బ్యాంకు
రీజనింగ్‌, క్యు.ఎ. ఒకటేనా
సీశాట్‌ పేపర్‌లో ఇచ్చే ప్రశ్నలు... బ్యాంకు రీజనింగ్‌ /క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ఇచ్చే ప్రశ్నలు ఒకటేనా?
ఈ ప్రశ్నకు జవాబు ఒకటే!
సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ పేపర్‌-2 (సీశాట్‌)లో చాలామంది క్వాలిఫై కాలేకపోతున్నారు. సీశాట్‌లో చాలా మందికి ఎక్కువ మార్కులు రావడం లేదు. కారణం... బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్‌ / క్లర్క్‌ పోస్ట్‌లకు నిర్దేశించిన ‘రీజనింగ్‌ ్క్ష మెంటల్‌ ఎబిలిటీ’, ‘క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’లకు ప్రిపేర్‌ అయినట్లు దీనికి కాకపోవడం. బ్యాంకు ఎగ్జామ్‌లకు ప్రిపేరయ్యేవారు, ఈ పేపర్‌లో చాలా సులువుగా క్వాలిఫై అవుతారు. సీశాట్‌లో క్వాలిఫై కావటానికి, వీటిపై కమాండ్‌ ఉంటే చాలు ప్రిలిమ్స్‌లో మీరు గెలిచినట్టే...
యూపీఎస్సీ ఇచ్చిన సిలబస్‌ ప్రకారం, గతంలో వచ్చిన ప్రశ్నల సంఖ్య ఈ కింది విధంగా ఉంది-
2014లో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ అంశంపై 13 ప్రశ్నలు ఇచ్చారు. కానీ 2016లో ఇదే అంశంపై దాదాపు 31 ప్రశ్నలు వచ్చాయి. క్రమేణా ఈరకమైన ప్రశ్నలు పెరుగుతూ వస్తున్నాయి.
2014లో బేసిక్‌ న్యూమరసి అంశంలో 30 ప్రశ్నలు ఇస్తే, 2016లో కాస్తంత తగ్గాయి. 20 ప్రశ్నలు (లెక్కలు) ఇచ్చారు.
ఏదేమైనా పేపర్‌-2 (సీశాట్‌)లో ఉన్న 80 ప్రశ్నల్లో, 50ునికి పైగా ప్రశ్నలు ఈ రెండు టాపిక్స్‌ మీదే వచ్చాయి.
గమనిక: డేటా ఇంట్రప్రిటేషన్‌కి అంటే చార్ట్‌లు, గ్రాఫ్‌లకు సంబంఽ దించిన ప్రశ్నలు క్రమేణా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ, సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాసే అభ్యర్థులు, స్టాటిస్టిక్స్‌కి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి, ప్రాక్టీసు చేయాలి. ఏదైనా ప్రశ్న అడిగితే జవాబు రాసేట్టుగా ఉండాలి.
1) జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలను ఈ కిందివిధంగా వర్గీకరించవచ్చు:-
ఎ) రక్త సంబంధిత బంధుత్వం
బి) మనుషులను గ్రూపింగ్‌ చేయడం : ధరించే వస్ర్తాలను బట్టి, నివసించే నగరాలను బట్టి, వృత్తులను బట్టి, బంధుత్వాన్ని బట్టి
సి) ఒకే లైన్‌లో ఉండటం బట్టి / పోలికలను బట్టి
డి) వృత్తాకార టేబుల్‌ / దీర్ఘ చతురస్రాకార టేబుల్‌ చుట్టూ కూర్చోవటాన్ని బట్టి
ఇ) ప్రసంగాలను, ఈవెంట్స్‌ను, ప్రయాణాలను షెడ్యూలింగ్‌ చేయడం
ఎఫ్‌) ఏ దిశలో ప్రయాణిస్తున్నది గుర్తించటం
జి) మిస్సింగ్‌ నంబర్స్‌ హెచ్‌) సీక్వెన్స్‌ సిరీస్‌
ఐ) కోడింగ్‌ ్క్ష డికోడింగ్‌ జె) లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్‌లు
కె) క్యాలెండర్‌ తేదీలు ఎల్‌) డేటా సఫిషియెన్సీ
గతంలో నాన్‌ ్క్ష వెర్బల్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వెర్బల్‌ ప్రశ్నలు అధికమౌతున్నాయి. వెర్బల్‌ ్క్ష నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ కోసం ఆర్‌. ఎస్‌.అగర్వాల్‌, టాటా మెక్‌ గ్రాహిల్‌ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
 
నమూనా ప్రశ్నలు:
1) A person climbs a hill in a straight path from point 'O' on the ground in the direction of north-east and reaches a point 'A' after travelling a distance of 5 km. Then, from the point 'A' he moves to point 'B' in the direction of north-west. Let the distance AB be 12 km. Now, how far is the person away from the starting point 'O'?
a) 7 km b) 13 km c) 17 km d) 11 km
Answer :(b)
2) A person walks 12 km due north, then 15 km due east, after that 19 km due west and then 15 km due south. How far is he from the starting point?
a) 5 km b) 9 km c) 37 km d) 61 km
Answer : (a)
సామాన్య గణితశాస్త్రం నుంచి ఇచ్చే లెక్కలు సగటు, శాతం, లాభ నష్టాలు, కాలం, వేగం, దూరం, కాలం-పని, గడియారాలు, సామాన్య / బారువడ్డీ, చక్ర వడ్డీ, నిష్పత్తులు, మిక్స్‌చర్స్‌, భాగస్వామ్యాలు, మెన్సురేషన్‌ (రేఖా గణితం) ప్రాబబిలిటి, మొదలైవని ఉంటాయి.
For this section you must go thoroughly, Quantitative Aptitude by RS Agarwal and Quicker Maths (Magical Book Series) by M. Tyra.
గణితశాస్త్రంలో మౌలిక అంశాలు తెలుసుకోవటం కోసం, ఎన్‌సిఇఆర్‌టి 9, 10, 11, 12 తరగతులకు కేటాయించిన గణితశాస్త్రం పుస్తకాలు చదవండి. ప్రాక్టీసు చేయండి. అలాగే ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌, క్వికర్‌ మేథ్స్‌ (రచయిత: ఎం.టైరా)పుస్తకాలను ప్రాక్టీస్‌ చేయండి. జిఆర్‌ఇ, గేట్‌ వంటి పరీక్షలు రాసిన వారు వీటిని చక్కగా ఆన్సర్‌ చేస్తారు.
పదో తరగతి స్టాండర్డ్‌ అని యూపీఎస్సీ సిలబస్‌లో తెల్పినప్పటికీ, ఈ అంశం కింద ఇచ్చే ప్రశ్నలను లెవెల్‌-1 (చాలా సులువైనవి), లెవెల్‌-2 (కొంచెం కష్టమైనవి), లెవెల్‌-3 (బాగా కష్టమైనవి) అని విడగొట్టవచ్చు.
గణితశాస్త్రం నుంచి వచ్చిన నమూనా ప్రశ్నలు(కష్టతరమైనవి):
 
1) Ram and Shyam work on a job together for four days and complete 60% of it. Ram takes leave then and Shyam works for eight more days to complete the job. How long would Ram take to complete the entire job alone?
a) 6 days b) 8 days
c) 10 days d) 11 days
Answer : (c)
2) 30g of sugar was mixed in 180 ml water in a vessel A, 40 g of sugar was mixed in 280 ml of water in vessel B and 20 g of sugar was mixed in 100 ml of water in vessel C. The solution in vessel B is
a) sweeter than that in C b) sweeter than that in A
c) as sweet as that in C
d) less sweet than that in C
Answer : (d
 
గమనిక: వీటిని ఆన్సర్‌ చేయటానికి, బేసిక్‌ సూత్రాలు తెలియాలి, బాగా ప్రాక్టీసు చేయాలి.
- ప్రాతూరి పోతయ్యశర్మ