ఆలివ్‌ బోర్డ్‌మేనేజ్‌మెంట్‌,బ్యాంక్‌ కోచింగ్‌లో Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
ఆలివ్‌ బోర్డ్‌మేనేజ్‌మెంట్‌,బ్యాంక్‌ కోచింగ్‌లో
కాలానుగుణంగా జరిగే మార్పులు కోచింగ్‌ విషయంలోనూ చోటుచేసుకుంటున్నాయి. నేటి తరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ కోచింగ్‌ను అయిదేళ్ళ క్రితమే ఆరంభించిన సంస్థ ఆలివ్‌బోర్డ్‌. ఎంబిఎలో ప్రవేశానికి ఉద్దేశించిన వివిధ టెస్టులకు తోడు బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు అవసరమైన సమగ్ర మెటీరియల్‌ను ఆలివ్‌ బోర్డ్‌ అందిస్తోంది. రిజిష్టర్డ్‌ యూజర్లకు నెట్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర మెటీరియల్‌, వీడియో లెక్చర్స్‌ అందిస్తోంది. గ్రూప్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌, కస్టమరైజ్డ్‌ స్టడీ ప్లానర్స్‌, ఆలిండియా టెస్ట్‌ సిరీస్‌, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌, అనాల్సిస్‌, వెంటనే ఫీడ్‌బ్యాక్‌తో కోచింగ్‌ను పరిపుష్టం చేశారు. కోచింగ్‌ సదుపాయం అంతంతమాత్రంగా ఉండే టూటైర్‌, త్రీటైర్‌ పట్టణాల్లోని అభ్యర్థులే లక్ష్యంగా మొత్తం ప్లాన్‌ను రూపొందించారు. దేశవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది రిజిష్టర్డ్‌ యూజర్లు తమకు ఉన్నారని ఆలివ్‌బోర్డ్‌ కోఫౌండర్‌ అభిషేక్‌ పాటిల్‌ వెల్లడించారు. తమ ప్రత్యేకతలను ఈ సందర్భంలో ఆయన వివరించారు. వ్యక్తిగత దృష్టి ఇందులో కీలకమైన అంశం. అంటే తమ వద్ద రిజిష్టర్‌ అయిన అభ్యర్థి కోర్సు లెర్నింగ్‌లో భాగంగా గ్రామర్‌లో వీక్‌ ఉన్నట్టయితే, అదే విషయాన్ని అతని దృష్టికి తీసుకెళతారు. గ్రామర్‌పై పట్టు సాధించేలా మెటీరియల్‌, లెక్చర్స్‌ తదితర అవకాశాలను అదనంగా కల్పిస్తారు. గ్రూప్‌ స్టడీ రెండో అంశం. కొంత మంది అభ్యర్థులను కలిపి వారికి అనుకూలంగా ఉన్న సమయంలో గ్రూప్‌ స్టడీని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక అభ్యర్థి మరొకరితో ఆన్‌లైన్‌ చాట్‌ చేసుకోవచ్చు. సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాదు, సరికొత్త ఐడియాలను షేర్‌ చేసుకోవచ్చు. లెర్నింగ్‌ ప్రాసె్‌సలో భారాన్ని సులువైన పద్ధతుల్లో తగ్గించుకోవచ్చు. మూడోది ఒకే వేదికపై అన్నీ అందుబాటులోకి తేవడం. ఈ రోజుల్లో అభ్యర్థులకు జనరల్‌ నాలెడ్జ్‌ దాదాపు అన్ని పరీక్షలకు అవసరం. దాంతోపాటు అవసరమైన లెర్నింగ్‌ మెటీరియల్‌ను ఒకే వేదికపై అందించడం తద్వారా సర్వసమగ్రతకు చోటు కల్పించడం ఈ ప్రక్రియలో ప్రత్యేకత. అభ్యర్థి తన అవసరాన్ని బట్టి ఫీజు చెల్లించి ఈ ఆన్‌లైన్‌ కోర్సులో చేరవచ్చు. ఏదైనా పరీక్షకు సంబంధించి మొత్తం కోర్సులో చేరాలనుకుంటే గరిష్ఠంగా రూ.నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇవి ఆరు వందల నుంచి ఎనిమిది వందల గంటల కోర్సులుగా ఉంటాయి. కొంత మంది ప్రత్యేకించి మాక్‌ టెస్టులు లేదా మెటీరియల్‌ మాత్రమే తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఈ ఫీజు రూ.500 నుంచి మొదలవుతుంది. ఏటా జనవరి 31ని కటాఫ్‌ డేట్‌గా పెట్టుకున్నారు. ఆ తరవాత రోజు నుంచి ఎప్పుడు చేరినా చివరి వరకు అంటే తదుపరి ఏడాది జనవరి 31 వరకు కోర్సు అందుబాటులో ఉంటుంది. ఏటా ఫిబ్రవరి 1 నుంచి అంతవరకు జరిగిన వివిధ టెస్టులను పరిగణనలోకి తీసుకుని యావత్తు మెటీరియల్‌ను నవీకరిస్తారు. తదుపరి ఏడాది జరిగే పరీక్షలకు అనువుగా ఆధునీకరిస్తారు. అభ్యర్థి తన అవసరం, అవకాశం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆ ఆన్‌లైన్‌ కోర్సులో చేరవచ్చు.
వెబ్‌సైట్‌: https://www.oliveboard.in/
 
వెటర్నరీ
భారతదేశంలో 70 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అలా జీవించే రైతుకు వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండు కళ్ళలాంటివి. వ్యవసాయానికి సంబంధించిన విద్య, మెలకువలను అందించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేస్తోంది. అలాగే పాడి పరిశ్రమ, జీవరాశులకు సంబంధించిన విద్యను అందించడానికి తెలంగాణలో పీవీ నర్సింహారావు తెలంగాణ
వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌,
జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి. సీట్లు, కోర్సుల వివరాలను పీవీ నర్సింహారావు తెలంగాణ
వెటర్నరీ విశ్వవిద్యాలయం
ఇన్‌చార్జి రిజిస్ర్టార్‌
డాక్టర్‌ కె.కొండల్‌ రెడ్డి తెలిపారు.
అర్హత
బీవీఎస్సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ) కోర్సులో చేరేందుకు బైపీసీతో ఇంటర్మీడియట్‌ చదివిన విద్యార్థులు ప్రాథమికంగా అర్హులు. దీనికి తోడు ‘ఎంసెట్‌’ లో ర్యాంక్‌ సాధించాలి. విద్యార్థుల ప్రాధాన్యంలో మెడిసిన్‌ తరవాతి స్థానంలో ఈ కోర్సు ఉంటుంది.
కళాశాలలు
వెటర్నరీ సైన్స్‌ చదవాలనుకుంటున్న విద్యార్థుల కోసం రాజేంద్రనగర్‌, కోరుట్లలో వెటర్నరీ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 75 మంది విద్యార్థులను ఏటా చేర్చుకుంటారు. తెలంగాణ ఎంసెట్‌లో సాధించిన ర్యాంక్‌ ప్రాతిపదిక. 15 శాతం సీట్లను ఓపెన్‌ కేటగిరికి కేటాయిస్తారు. వీటికి మాత్రం ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. అయితే ఇక్కడ సీటు కావాలనుకునే ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ రాసి ర్యాంక్‌ సాధించాలి. ఇక ఆలిండియా పూల్‌కు నిర్దేశించిన సీట్లను పొందాలంటే నీట్‌లో ర్యాంక్‌ తప్పనిసరి. ఆ సీట్లకు దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్థులైనా పోటీపడవచ్చు. పీజీ స్థాయిలో ఎంవీఎస్సీ కోర్సును కేవలం రాజేంద్రనగర్‌లో మాత్రమే అందిస్తున్నారు. 44 సీట్లు మాత్రమే ఉన్నాయి.
 
కోర్సులో సబ్జెక్టులు
కోర్సు కాలవ్యవధి ఐదున్నర సంవత్సరాలు. మొదటి నాలుగేళ్ళు కళాశాలలో చదువుతోపాటు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. చివరి సంవత్సరం ఇంటర్న్‌షిప్‌. హాస్పిటల్స్‌, ఫార్మా కంపెనీలు, డెయిరీ ఫారమ్‌లలో ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ.ఏడు వేల చొప్పున ఉపకార వేతనం అందజేస్తారు. గతంలో వెటర్నరీ కోర్సు సెమిస్టర్‌ విధానంలో ఉండేది. ప్రస్తుతం దేనికది ఏడాది కోర్సుగా మలిచారు. అంటే వెటర్నరీ మొదటి సంవత్సరం పాసైతేనే రెండో ఏడాది కోర్సులోకి వెళ్ళడానికి విద్యార్థులు అర్హులు. వెటర్నరీ కోర్సులో భాగంగా అనాటమి, పారాసైటాలజీ, పాథాలజీ, ఫిజియోలజీ, ఫార్మకాలజీ, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్‌, వెటర్నరీ ఎక్స్‌టెన్షన్‌, మైక్రో బయాలజీ, లైవ్‌స్టాక్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, వెటర్నరీ బయో కెమెస్ర్టీ, యానిమల్‌ న్యూట్రిషన్‌, గైనకాలజీ, వెటర్నరీ మెడిసిన్‌, వెటర్నరీ సర్జరీ, లైవ్‌స్టాక్‌ ఫార్మ్‌ కాంప్లెక్స్‌, వెటర్నరీ క్లినికల్‌ కాంప్లికేషన్స్‌, పౌల్ర్టీ సైన్స్‌, న్యూట్రిషన్‌ తదితర కోర్సులను చదవాల్సి ఉంటుందన్నారు.
ఉద్యోగావకాశాలు
వెటర్నరీ కోర్సులను పూర్తి చేసినవారికి ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్లుగా ఉద్యోగాలు వస్తాయి. అవేకాకుండా ప్రైవేట్‌ రంగంలో చాలా అవకాశాలుంటాయి. ఫీడ్‌, ఫార్మా, పౌల్ర్టీ ఇండస్ర్టీలలో, ప్రైవేట్‌ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు రాయడానికి కూడా వెటర్నరీ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌)లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఆర్మీలో రిమౌంట్‌ వెటర్నరీ కోర్‌గా, ఇండో టిబెటిన్‌ బోర్డర్‌ ఫోర్స్‌లో ఉద్యోగాలు లభిస్తాయి.
 
బీవీఎస్సీ తరవాత
బీవీఎస్సీ అనంతరం రెండేళ్ల ఎంవీఎస్సీ చదవవచ్చు. రాజేంద్రనగర్‌ వెటర్నరీ కళాశాలలో చదవడానికి అవకాశముంది. ఎంవీఎస్సీ పూర్తయిన తరవాత మూడు సంవత్సరాల పీహెచ్‌డీ కోర్సులు చేయవచ్చు.
 
ఫీజు
బీవీఎస్సీ చదవడానికి ఏటా రూ.40వేల వరకు ఫీజు ఉంటుంది. బాలురు, బాలికల కోసం ప్రత్యేక వసతి గృహాలు ఉంటాయి. వెటర్నరీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్పోర్ట్స్‌కు అవకాశాలు ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలు లేవు. నీట్‌ ఫలితాల తరవాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బీవీఎస్సీ కోర్సుల్లో చేరడానికి నోటిఫికేషన్‌ ఇస్తుంది. ఇతర వివరాలకు  www.tsvu.nic.in, ww-w.-pjt-sa-u.a-c.-in లో చూడవచ్చు.
- అప్పారెడ్డిగూడెం భీమయ్య
 
ఏపీలో
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరులలోని కాలేజీలు బీవీఎస్సీ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో 75 సీట్లు ఉన్నాయి. మొత్తం 225 సీట్లు. వీటిలో 85శాతం ఏపీ విద్యార్థులకు లభిస్తాయి. మిగిలిన 15 శాతం ఓపెన్‌ కోటా. ఏపీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా సీట్లు ఇస్తారు. ఓపెన్‌ కోటా సీట్లకు తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. అయితే ఏపీ ఎంసెట్‌ రాసి ఉండాలి.
ఎంవీఎస్సీని కూడా మూడు కాలేజీల్లోనూ ఆఫర్‌ చేస్తున్నారు. 114 సీట్లు ఉన్నాయి. 14 వరకు స్పెషలైజేషన్లు ఉన్నాయి.
పిహెచ్‌డిని తిరుపతి, గన్నవరం కాలేజీల్లో మాత్రమే అందిస్తున్నారు. గత ఏడాది 43 మందికి పరిశోధన చేసే అవకాశం కల్పించారు.
ఫస్ట్‌ స్టెప్‌
 
సిఎ ఫౌండేషన్‌
జూ సిఎ కోర్సుకు ‘సిఎ ఫౌండేషన్‌’ అనేది ప్రవేశ పరీక్ష అని చెప్పవచ్చు. ఈ ఫౌండేషన్‌ పూర్తిచేసిన వారే సిఎ కోర్సు చదవడానికి అర్హులు.
ఇంజనీరింగ్‌ మెడిసిన్‌ చేయాలనుకొనే వారికి ఎంసెట్‌, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలను ఎలా నిర్వహిస్తారో అలాగే సిఎ చదవాలనుకొనే వారికి ఈ ఫౌండేషన్‌.
 సహజంగా ప్రతి ప్రవేశపరీక్షను మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. గతంలో ఇప్పటి సిఎ ఫౌండేషన్‌ స్థానంలో నిర్వహించిన సిపిటి పరీక్షను కూడా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతోనే జరిపేవారు. అయితే సిఎ ఫౌండేషన్‌ పరీక్షలో 50 శాతం మార్కులకు డిస్ర్కిప్టివ్‌, తతిమా 50 శాతం మార్కులకు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి.
సిఎ ఫౌండేషన్‌లో మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉండటం వల్ల విద్యార్థులకు విశ్లేషించే నైపుణ్యం పెరుగుతుంది. అలానే డిస్ర్కిప్టివ్‌ ప్రశ్నలు ఉండటం వల్ల భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంటుంది.
నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సిఎ విద్యార్థికి అన్నిరకాల నైపుణ్యాలు ఉండాలన్న ఉద్దేశంతో సిలబ్‌సను ఇలా మార్చారు.
సబ్జెక్టులు - మార్పులు
జూ నూతన సిఎ ఫౌండేషన్‌ కోర్సులో బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌ (40 మార్కులు), లాజికల్‌ రీజనింగ్‌ (20 మార్కులు), బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌ (40 మార్కులు) అనే మూడు కొత్త సబ్జెక్టులను సిలబ్‌సలో కలిపారు.
 
పరీక్ష విధానంలో మార్పులు
పాత విధానం ప్రకారం సిపిటి పరీక్షను 200 మార్కులకు గాను ఒకేరోజు మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహించేవారు. సిపిటిలోని నాలుగు పేపర్లలో ప్రతి దానిలో 30శాతం మార్కులను సాధించాలి. మొత్తమ్మీద 200 మార్కులకుగాను 100 మార్కులు (50శాతం) సాధించాల్సి ఉండేది. తప్పు సమాధానాన్ని గుర్తిస్తే 0.25 మార్కును అంటే నెగెటివ్‌ మార్కుగా తీసివేసేవారు.
జూ నూతన విధానం ప్రకారం సిఎ ఫౌండేషన్‌ పరీక్ష నాలుగు పేపర్లుగా, ఒక్కో పేపర్‌ 100 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులకు
నాలుగు రోజులు (ఒక్కో పేపర్‌ - ఒక్కో రోజు) నిర్వహిస్తారు. పేపర్‌-1, 2 డిస్ర్కిప్టివ్‌ పద్ధతిలో; పేపర్‌-3, 4 ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతాయి.
జూ సిఎ ఫౌండేషన పరీక్షలు సిపిటి మాదిరిగా జూన, డిసెంబర్‌లో కాకుండా ఏటా మే, నవంబర్‌ నెలల్లో నిర్వహిస్తారు.
జూ సిఎ ఫౌండేషనలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అలాగే నాలుగు పేపర్లు కలిపి 400 మార్కులకు గానూ 50 శాతం మార్కులు అంటే 200 మార్కులు సాధించాలి.
ఎవరు అర్హులు?
ఇంటర్మీడియెట్‌ లేదా 10+2 తత్సమాన పరీక్ష రాసిన వారు ఎవరైనా సిఎ ఫౌండేషన కోర్సుకి నమోదుచేయించుకోవచ్చు. నమోదు చేయించుకున్న నాలుగు నెలలకి సిఎ ఫౌండేషన రాయవచ్చు.
 
న్యూ
పేపర్‌-1: ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌
ఆఫ్‌ అకౌంటింగ్‌
పేపర్‌-2: బిజినెస్‌ లాస్‌
(60 మార్కులు)
బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌ (40 మార్కులు)
పేపర్‌-3: బిజినెస్‌ మేథమెటిక్స్‌
(40 మార్కులు)
లాజికల్‌ రీజనింగ్‌
(20 మార్కులు)
స్టాటిస్టిక్స్‌ (40 మార్కులు)
పేపర్‌-4: బిజినెస్‌ ఎకనామిక్స్‌
(60 మార్కులు)
బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌ (40 మార్కులు)
గమనిక: ఇందులో మొదటి రెండు పేపర్లు డిస్ర్కిప్టివ్‌ పద్ధతిలో, చివరి రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయి.
 
ఓల్డ్‌
సిపిటి కోర్సులోని సబ్జెక్టులు, మార్కులు (పాత విధానం)
అకౌంట్స్‌ సబ్జెక్టు 60 మార్కులు
మర్కంటెల్లా 40 మార్కులు
ఎకనామిక్స్‌ 50 మార్కులు
క్యూ.టి.(మేథమెటిక్స్‌ అండ్‌
స్టాటిస్టిక్స్‌) 50 మార్కులు
 
కౌన్సెలింగ్‌ కెరీర్‌...
 
వివరాలు ఇవిగో
 
నేను బైపిసితో ఇంటర్‌ చదువుతున్నాను. కౌన్సెలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నా కోరిక. దీని కోసం ఏమి చదవాలి? తరవాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి, సలహా ఇవ్వగలరు?
- కృష్ణవేణి, వైజాగ్‌
 
 రెగ్యులర్‌ కెరీర్‌ కాకుండా కొంచెం భిన్నమైన కెరీర్‌ ఎంచుకోవాలనుకోవడం అభినందనీయం. ఇంటా, బయట, ఆఫీసులు అన్నింటా ఒత్తిడి ఎక్కువగా ఉంటున్న ఈ రోజుల్లో కౌన్సెలర్లకు మంచి డిమాండ్‌ ఉంది. కౌన్సెలింగ్‌ అనేది స్పెషలైజేషన్‌ ద్వారా వెళ్లే రంగం. సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లు దీనిలో బాగా రాణిస్తారు. సైకాలజీ మానవుని ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. సైకాలజీ చదివినవారు తమ వద్దకు వచ్చేవారి సమస్యలను సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే మీరు డిగ్రీలో సైకాలజీ సబ్జెక్టును ఎంచుకోండి. ఇంటర్‌ ఏ కోర్సు చదివినవారైనా ఇందులో చేరడానికి అర్హులు. దీని తరువాత ఎంఏ సైకాలజీ చదవండి. అందులో కౌన్సెలింగ్‌ స్పెషలైజేషన్‌ తీసుకుంటే సరిపోతుంది. తెలుగు రాషా్ట్రలతో సహా దేశంలోని చాలా యూనివర్సిటీలు సైకాలజీని అందిస్తున్నాయి.
ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌, స్వచ్ఛంద సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సొంతంగా కూడా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. వివిధ రకాల వయస్సు ఉన్న వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చేలా స్పెషలైజేషన్‌ చేయవచ్చు. చిల్డ్రన్‌ సైకాలజిస్టులు పిల్లల్లోని ఎమోషనల్‌, బిహేవియరల్‌ డిజార్డర్‌లను అధ్యయనం చేస్తారు. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో వీరి అవసరం ఎక్కువగా ఉంటుంది.