సివిల్స్ 22వ ర్యాంకర్.. చెబుతున్న విషయాలివి Diksuchi -Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
సివిల్స్ 22వ ర్యాంకర్.. చెబుతున్న విషయాలివి
శిఖరప్రాయమైన సివిల్స్‌లో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఇంటర్వ్యూ కీలకమైనది. అభ్యర్థి బహుముఖ ప్రజ్ఞాపాఠవాలను, వ్యక్తిత్వాన్ని పరీక్షించేందుకు ఇంటర్వ్యూను ఉద్దేశించారు. సివిల్స్‌ సీనియర్‌ అధికారులకు తోడు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులు ఈ ఇంటర్వ్యూలో పాలుపంచుకుంటారు. అభ్యర్థి నేపథ్యం, హాబీలు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నిస్తారు. అభ్యర్థులు చెప్పే జవాబులను బట్టి అత్యంత ప్రాధాన్యం కలిగిన సివిల్‌ సర్వీసులకు వారు ఎంతవరకు అర్హులో నిగ్గుతేలుస్తారు. ఇంటర్వ్యూల తీరూతెన్ను తెలుసుకొనేందుకు ఉపకరిస్తాయన్న అభిప్రాయంతో ఈ ఏడాది సివిల్స్‌లో 22వ ర్యాంకు సాధించిన ముజామిల్‌ఖాన్‌ ఇంటర్వ్యూ మీకోసం...
 
బోర్డ్‌ ఛైర్మన్‌ ఇతర సభ్యులకు అభివాదాల తరవాత ఛైర్మన్‌ ప్రశ్నించడం ఆరంభించారు. వార్మ్‌హోల్‌, క్వాంటమ్‌ పిజిక్స్‌పై మళ్ళీ అందులో భారత స్థానం తదితరాలపై అడిగారు. చేతులు ఉపయోగించి సమాధానాలు చెప్పనా అని అడిగితే. అవసరమైతే పేపర్‌ కూడా ఇస్తామని చెప్పారు. నేను ఆయా ప్రశ్నలకు వివరంగా ఛైర్మన్‌ అంగీకారం తెలిపే స్థాయిలో జవాబిచ్చాను. తదుపరి ప్రశ్నలు అడిగే అవకాశాన్ని మెంబర్‌కు ఛైర్మన్‌ కల్పించారు.
 
మెంబర్‌: మీరు తెలంగాణ నుంచి వచ్చారు కదా... ఉద్యమం తరవాత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
జ: అప్పటి నుంచి కచ్చితమైన ఎదుగుదల కనిపిస్తోంది. అగ్రికల్చర్‌, ఇరిగేషన్‌, ఎలక్ట్రిసిటీ, సంక్షేమ పథకాలు వాటిలో కొన్ని. వ్యతిరేక అంశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగం ఆరు శాతం ఉంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రాజకీయంగా చూస్తే పూర్తిగా గుత్తాధిపత్యం కనిపిస్తోంది. మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. అయితే సరైన ప్రతిపక్షం లేకుంటే భవిష్యత్తులో అది అధికారంలో ఉన్న వారికి గర్వం ఎక్కువయ్యేలా చేస్తుందని అనుకుంటున్నాను.
 
మెంబర్‌: ఉదయం నాలుగు గంటల నుంచే కోచింగ్‌ క్లాసులకు మీ రాష్ట్రం కేంద్రం కదా! దానిపై అభిప్రాయం ఏమిటి?
జ: నేను కూడా అలాంటి ఒక ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చిన వాడినే. అయితే అక్కడి టీచింగ్‌ పద్ధతిని నేనూ వ్యతిరేకిస్తున్నాను. సంకుచితత్వానికి దారితీసేలా ఉంటుంది. అది తెలివితేటలు పెరిగేందుకు ఉపకరించదు.
 
మెంబర్‌: ఆ సిస్టమ్‌పై నీ విమర్శ ఏమిటి?
జ: (ఒక సెకను ఆగి) అటు పేరెంట్స్‌ని, ఇటు పిల్లలను భయపెట్టేలా వ్యవస్థ ఉంది. లెర్నింగ్‌ ఆగిపోయింది. అంతా సమాచారమే మిగులుతోంది. (మెంబర్‌ చిరునవ్వు చిందించారు)
 
మరో మెంబర్‌: రైల్వేలో కొత్తగా ఏర్పాటు చేసిన తొమ్మిదో జోన్‌పై చెప్పండి...
(నాకు తెలియదు అనగానే గెస్‌ చేయమన్నారు. రైల్వేలో తను పనిచేసిన విభాగాన్ని ఉద్దేశించి అడిగారు. ఆ విభాగం ఒంటిరిగా ఉంటుందని, అది రైల్వేలో పనిని నిరోధిస్తోందని అన్నారు. అయితే రెండో అభిప్రాయంతో నేను అంగీకరించలేదు. అలా ఆ విభాగంపై కొంత లోతైన చర్చ జరిగింది.)
 
ప్ర: సబ్సిడీ నుంచి ఏ ఐటెమ్‌ తొలగించాలంటారు?
జ: కిరోసిన్‌ సార్‌
 
ప్ర: (నవ్వుతూనే) ఎందుకు?
జ: ఆధునిక సమాజంలో కిరోసిన్‌కు చోటు లేదు. అదో డర్టీ ఫ్యూయల్‌
 
ప్ర: సబ్సిడీలు మంచివా, కాదా?
జ: రెండు కోణాలు ఉన్నాయండి. ఆయా వస్తువుల డెలివరీ ఎవరికి అన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
 
రెండో మెంబర్‌: ఇప్పటికే దానిపై కొంత చొరవ తీసుకున్నట్టు ఉంది....
జ: ఆధార్‌తో అనుసంధానం చేశారనుకోండి. అదే వేరే ఇష్యూ.
 
మరో మెంబర్‌: కమ్యూనికేషన్‌ కోసం జియోస్టేషనరీ ఉపగ్రహాలు అవసరమా?
(24* 7 కమ్యూనికేషన్‌ కోసం అది ఉపకరిస్తుంది సర్‌. ఇదే సందర్భంలో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ ప్రిన్సిపల్స్‌, వాటిని కొండ ప్రాంతాల్లో ఏర్పాటు, వీశాట్‌ టెక్నాలజీ తదితరాలపై అడిగిన వాటికి సంక్షిప్తంగా జవాబులు చెప్పాను.)

నాలుగో మెంబర్‌: మీరు గతంలో బ్యాంకులో పని చేశారు కదా?
(అవునండి అని చెప్పగానే సహకార బ్యాంకుల ఫంక్షనింగ్‌పై ప్రశ్నించారు)
జ: ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌లో భాగంగా వాటి ఉనికి చాలా అవసరం. 1980 నుంచే అవి స్థంభించాయి.
 
మెంబర్‌: మీరు చెప్పింది కరెక్ట్‌. బ్యాంకింగ్‌ను మీరు ఎలా చూడాలని అనుకుంటున్నారు.
జ: బ్యాంకింగ్‌ రంగం చాలా కీలకం. అయితే అవి మరింత ముందుకు కదలాలంటే మరిన్ని చర్యలు అవసరం. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ మోడల్‌ని ఉపయోగించాలి. మొబైల్‌ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తే ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ సాధించవచ్చు.
 
మెంబర్‌: ఎవల్యూషన్‌ తప్పనిసరి అంటారు. యంత్రాల మాదిరిగా మానవ శరీరంలో మార్పులు రావటం లేదు...
జ: ఎవల్యూషన్‌ అనేది నిరంతర ప్రక్రియ. అదే మనిషి శరీరంలోని కండరాల విషయానికి వస్తే, వయసుతో వాటి శక్తి తగ్గుతుంది.
 
రేపు మనం మరో జాతి కావచ్చు. ఉదాహరణకు ఇప్పటి నాచేయి స్థానంలో యంత్రాన్ని అమర్చితే ఇప్పటికంటే 50 రెట్లు ఎక్కువ బరువు మోయవచ్చు. ఇదంతా బయలాజకల్‌ పాయింట్‌లో అభిప్రాయమే. మానవాతీతం అంటే ఇదే. ఇది లాజికల్‌గా కరెక్ట్‌ కావచ్చు. అయితే ఈ పరిణామక్రమాన్ని నేను అంగీకరించను.
(ప్రశ్నించిన సభ్యుడు పెద్దపెట్టున నవ్వారు. తరవాత కృతజ్ఞతలు చెప్పి బైటకు వచ్చాను)