కెరీర్‌గా కళారంగాలు ఏం తక్కువ? Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
కెరీర్‌గా కళారంగాలు ఏం తక్కువ?
మా అబ్బాయి బి.టెక్‌ పూర్తి చేశాడు. ఇప్పుడేమో ఎం.టెక్‌ కాకుండా థియేటర్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేస్తానంటున్నాడు. ఎంత వారించినా వినిపించుకోవడం లేదు. దీన్ని పర్వర్షన్‌ అనుకోవాలో... అబ్‌నార్మాలిటీ అనుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. సినిమా రంగంలోకి వెళతానన్నా కొంత అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకూ అంతరించిపోతున్న రంగస్థలాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకోవడంలో ఏం వివేకం ఉందో నాకైతే బోధపడటం లేదు. ఈ విషయంలో నన్నేం చేయమంటారో చెప్పండి..
- సి. ప్రకాశ్‌రావ్‌, విశాఖపట్నం.
 
బి.టెక్‌లోకి ప్రవేశించడానికి ముందు కూడా అతనిలో ఈ తరహా ఆలోచనలు ఏవో ఉండే ఉంటాయి. కాకపోతే ఆ విషయంలో అప్పటికింకా ఒక స్పష్టత ఏర్పడకపోవడం వల్లనేమో ఆ కోర్సులో చేరిపోయాడు. ఇప్పుడు ఆ రంగం మీద ఒక స్పష్టత ఏర్పడి ఉంటుంది. అందుకే థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సు చేస్తానంటున్నాడు. ఆ అభీష్టం అతనిలో అంత బలంగా ఉంటే మీరు ఎలా వారించగలరు? రంగస్థలం అంతరించిపోతోంది అనే మీ మాటను తీసుకుంటే నిలబెట్టే వారెవరూ లేకపోతే ఏ రంగమైనా పతనమైపోతుంది. అందువల్ల ఎవరో కొందరు దాన్ని నిలబెట్టడానికి కంకణబద్దులు కావలసిందే. సినిమా ఎంత విస్తృతమైనదైనా కావచ్చు కానీ, రంగస్థలానికి కూడా దాని ప్రాధాన్యత దానికి ఉంది. ఒడిదొడుకులు అన్ని రంగంలోనూ ఉంటాయి. కొంత మంది సమర్థులు ప్రవేశిస్తే, అప్పటిదాకా పతనమైపోతున్నవి కూడా ప్రగతి పథంగా సాగిపోతాయి. నిజమే! సినిమాను చూసే వాళ్లంత పెద్ద సంఖ్యలో థియేటర్‌ను చూసే వాళ్లు ఉండరు. కానీ, చూసే వారి సంఖ్యను బట్టి దాని పరిధిని బట్టి దాని గొప్ప తక్కువలు ఆధారపడి ఉండవు కదా! లైవ్‌ ప్రెజెంటేషన్‌ థియేటర్‌ ఒక ప్రత్యేకత. అందువల్ల ప్రతి కళ దాని ప్రత్యేకతలతో పరిఢవిల్లవలసిందే, ఎన్ని కష్టనష్టాలున్నా దాన్ని నిలబెట్టాల్సిందే. మీ అబ్బాయి త న కెరీర్‌గా ఆ రంగాన్ని ఎంచుకుంటానంటే మీరెందుకు ఆక్షేపిస్తారు? గొర్రెదాటుగా ఒకే రంగంలోకి వెళ్లేకన్నా, భిన్నమైన, బాగా ఇష్టమైన రంగంలోకి వెళతామన్నప్పుడు మనమంతా ప్రోత్సహించాల్సిందే తప్ప అడ్డు చెప్పకూడదు. ఆ రంగంలో విపరీతంగా సంపాదించలేకపోవచ్చు కానీ, న చ్చిన ఆ రంగం అతనికి కొండంత ఆత్మసంతృప్తినిస్తుంది. అదే అతనికి ఒక గొప్ప ఐశ్వర్యం.
- డాక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌ రావు
కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు