ఏ పుస్తకం చదవలేకపోతున్నా..! Diksuchi -Article
రాజస్థాన్‌: అళ్వార్‌లో ఫల్‌హరి బాబా అరెస్ట్, 15 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు|మిషన్ భగీరథ పనులపై డిసెంబర్ 31లోగా తొలి దశ పూర్తి చేయాలి, మరో ఆరు నెలల్లో రెండోదశను పూర్తి: సీఎం కేసీఆర్‌|భద్రాచలం రామాలయ రాజగోపురానికి స్వల్పంగా బీటలు, తెల్లవారుజామున రాజగోపురం నుంచి ఊడిపడిన రాతిపలకం|నెల్లూరు: భారత భూభాగం చుట్టూ ఉండే గాలి నాణ్యతపై ఇస్రో, నాసా సంయుక్త అధ్యయనం|అనంతపురం: ఉరవకొండ మండలం రాయంపల్లిలో పిచ్చి కుక్క స్వైరవిహారం|కృష్ణా: నందిగామ మణప్పురం బ్రాంచ్‌లో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారం మాయం|ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు, ఏడుగురు ఉపాధ్యక్షులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, 105 మందితో ఏపీ టీడీపీ కమిటీ|పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు దొంగిలిస్తున్నారని జగన్‌ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి: చంద్రబాబు|అమ్మాయిలను వేధించిన కేసులో ఈ నెల 17న అరెస్టయిన బీహార్ యువకుడు అభినయ్‌ పరారీ|అర్జున అవార్డు గ్రహీత సాకేత్ మైనేనికి రూ.75 లక్షల నజరానా ప్రకటించిన సీఎం చంద్రబాబు     
ఏ పుస్తకం చదవలేకపోతున్నా..!
నేను బి.టెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. అయితే, టెక్స్ట్‌బుక్స్‌తో పాటు జనరల్‌ బుక్స్‌ ముఖ్యంగా నాన్‌- ఫిక్షన్‌ పుస్తకాలు కూడా చదవాలన్నది నాలో మొదటి నుంచీ ఉన్న ఒక తీవ్రమైన అభిలాష. అందులో భాగంగానే అలాంటి పుస్తకాలు తరుచూ కొంటూ ఉంటాను. కానీ, తీరా చదవడానికి పూనుకునే సరికి నాకు అది సంపూర్ణంగా అర్థమైన భావన కలగదు. అందుకే ఒకటి రెండు పేజీల్ని అతి కష్టంగా చదివి ఆ తర్వాత మానేస్తాను. చదవాలన్న అభిలాష మనసులో ఉన్నా చాలాసార్లు అది కొనసాగడం మాత్రం జరగడం లేదు ఎందుకని?
పి. శరత్‌‌కుమార్‌, గుంటూరు.
 
అప్పటికే బాగా పరిచయం ఉన్న సబ్జెక్ట్‌ అయితే తప్ప కొత్తవన్నీ ఇలాంటి బరువైన భావనే కలిగిస్తాయి. అంత మాత్రాన ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఏ పుస్తకంలోని ఏ అధ్యాయమైనా తొలిసారి చదవడం మొదలెట్టినప్పుడు అందులోని కొన్ని వాక్యాలు, ఒక్కోసారి కొన్ని పదాలే అర్థమైనట్లు అనిపించవచ్చు. ముందు పదాలు మాత్రమే అర్థమై, ఆ తర్వాత వాక్యాలు, కొన్ని పేరాగ్రా్‌ఫలు, ఆ తర్వాత అధ్యాయాలు ఇలా దశల వారిగా అర్థమవుతూ ఉంటాయి. ఆ సబ్జెక్ట్‌ మీద కొంత అవగాహన ఏర్పడిన తర్వాత మాత్రం ఇక ఇలాంటి ఏ సమస్యలూ ఉండ కపోవచ్చు. వాస్తవానికి మొదటిసారి చదువుతున్నప్పుడే పుస్తకంలోని అణువణువూ అర్థం కావాలనుకోవడం ఒక రకంగా దురాశే అవుతుంది. లోతైన విషయం ఉన్న ఏ పుస్తకాన్నయినా కనీసం రెండు మూడుసార్లయినా చదివితేనే దాని లోతుపాతులు తెలుస్తాయి. అందువల్ల మొదటిసారి చదివినప్పుడే మొత్తంగా అర్థం కాకపోతే మనలో ఏదో లోపం ఉందనో, లేదా ఆ పుస్తక రచనే సరిగా లేదనో అనుకోకూడదు. మన హృదయానికి పరిచయం లేని పుస్తకాలు మొదట్లో కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కానీ, కొన్నాళ్లు పోయాక అవే మన హృదయానికి ప్రాణప్రదంగా అనిపిస్తాయి.
డాక్టర్‌ పి. కిరణ్‌కుమార్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు