శాస్త్ర-సాంకేతిక అంశాలు-పరిచయం Diksuchi -Article
నెల్లూరు: మనుబోలు మండలం బద్వేలు క్రాస్‌రోడ్డు దగ్గర కారు బోల్తా, ముగ్గురికి గాయాలు|కర్నూలు: 16 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర|రంగారెడ్డి: మైలార్‌దేవ్‌పల్లిలో కింగ్స్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై దుండగుల కాల్పులు|కడప: జగన్ సీఎం అయితే తన ఆస్తులు పెరుగుతాయి..చంద్రబాబు సీఎంగా ఉంటే ప్రజల ఆస్తులు పెరుగుతాయి: మంత్రి సోమిరెడ్డి|సిరిసిల్ల: అన్ని గ్రామాల్లో కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణాలు నిర్మిస్తాం: మంత్రి కేటీఆర్|హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ తమ్ముడిపై కేసు నమోదు|అమరావతి: చీఫ్‌విప్‌గా పల్లె రఘునాథరెడ్డి పేరు, శాసనమండలి చీఫ్‌ విప్‌గా పయ్యావుల కేశవ్‌ పేరు ఖరారు|అనంతపురం: జెట్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగాల పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూలు చేసిన యువకుడు|ఢిల్లీ: సరి, బేసి విధానానికి ఎన్జీటీ గ్రీన్‌సిగ్నల్, కాలుష్యం పెరిగినప్పుడు అమలు చేసుకోవచ్చన్న ఎన్జీటీ|శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారు.. నిరసనగా అసెంబ్లీని బహిష్కరించాం: వైసీపీ నేత ధర్మాన     
శాస్త్ర-సాంకేతిక అంశాలు-పరిచయం
సైన్స్ అండ్ టెక్నాలజీ

ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో నియామక పరీక్షల ప్రశ్నపత్రం సరళి కూడా మారింది. అందుకు అనుగుణంగా సిలబస్‌ లో కూడా కొన్ని సంస్థాగత మార్పులు చోటు చేసుకొన్నాయి. జనరల్‌ సైన్స అని పేర్కొంటూనే శాస్త్ర-సాంకేతిక (సైన్స్ అండ్ టెక్నాలజీ) రంగంలో భారత సాధించిన విజయాలపై ప్రశ్నలు వస్తున్నాయి. సుమారు 10-15 ప్రశ్నలు అడిగే అవకాశం లేకపోలేదు. కనుక అభ్యర్థి ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ అంశాలను చదివేక్రమంలో వాటిపై ప్రస్తుతం జరుగుతున్న మార్పులను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ఇందులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏమిటి? అందులోని అంశాలు, వాటిలో భారత సాధిస్తున్న పురోగతి తదితర వివరాలను అభ్యర్థి ఆకళింపు చేసుకోవాలి.

ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో పది ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి....
1. శాస్త్ర-సాంకేతిక రంగ అంశాలు-పరిచయం
2. రక్షణ రంగం
3. అణుశక్తి
4. ఖగోళ అంశాలు్క్షఅంతరిక్ష విజ్ఞానం
5. సమాచార, ప్రసార రంగం
6. నానో టెక్నాలజీ
7. రోబోటిక్స్‌
8. శక్తి వనరులు
9. పర్యావరణం
10. బయోటెక్నాలజీ అండ్ ఆరోగ్య సంబంధిత అంశాలు
 
ఈ అంశాల్లో వాటి చరిత్రనే కాక, వర్తమానంలో జరుగుతున్న మార్పులపై అభ్యర్థి దృష్టి సారించాలి. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో భారత చేపట్టిన పరిశోధనలు, రూపొందించిన కార్యక్రమాలు వాటిని అమలు చేసిన విధానం, ఎదుర్కొన్న సవాళ్లు వంటి అంశాలపై అవగాహన తప్పనిసరి.

శాస్త్ర-సాంకేతిక రంగ అంశాలు
ఈ విభాగంలో శాస్త్ర-సాంకేతిక రంగ సంస్థల ఏర్పాటు, అవి నెలకొన్న ప్రదేశం, ప్రస్తుతం ఆ సంస్థ అధిపతుల సమాచారాన్ని తెలుసుకోవాలి.
 సైన్స్క్షటెక్నాలజీ ప్రోత్సాహానికి ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలు, సమావేశాలపై దృష్టి సారించాలి.
శాస్ర్తాలు, పరికరాలు, నూతన ఆవిష్కరణలు, శాస్త్రవేత్తలపై అవగాహన ఉండాలి.
 
రక్షణ రంగం
సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా భారత రక్షణ రంగం చాలా ముఖ్యమైన విభాగం.
 మొదటగా రక్షణ రంగ వ్యక్తులు, వారి పదవులు, వారికి ఉన్న బిరుదులు తెలిసి ఉండాలి.
 త్రివిధ దళాలు, అవి ప్రతి ఏటా వివిధ దేశాలతో చేసే విన్యాసాలు, తీవ్రవాదుల దాడిలో, విపత్తు సమయాల్లో నిర్వహించే చర్యలు గుర్తుంచుకోవాలి.
 ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో కుదిరిన రక్షణ ఒప్పందాలు, వాటి ప్రత్యేకతలు, గతంలో జరిగిన రక్షణ ఒప్పందాలపై దృష్టి సారించాలి.
 రక్షణ రంగానికి సంబంధించిన కేంద్రాలు, అవి నెలకొన్న ప్రదేశాలపై అవగాహన తప్పనిసరి.
 ఏది యుద్ధనౌక? ఏది యుద్ధ విమానం వంటి అంశాలు అభ్యర్థికి తెలిసి ఉండాలి.
 అణు జలాంతర్గాములు, యుద్ధ ట్యాంకులు, రాకెట్‌ లాంచర్లు, యుద్ధ విమానం, యుద్ధ నౌక, క్షిపణులు వంటి వాటిపై ప్రశ్నలు పక్కాగా వస్తాయి. వాటిని భారత ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొంది, ఏ దేశంతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తోందో తెలుసుకోవాలి.
 క్షిపణుల్లో వాటి పరిధి, వాటిని ప్రయోగించే ప్రదేశం, ఏ తరహా క్షిపణి అనే అంశాలపై కచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
 
అణుశక్తి
ముఖ్యంగా అణు విద్యుత కేంద్రాలు, భారజల కేంద్రాలు, అణు రియాక్టర్లపై కచ్చితమైన అవగాహన తప్పనిసరి.
వాటిని ఎక్కడ నెలకొల్పారు? సామర్థ్యం? ఏర్పాటులో వివిధ దేశాల భాగస్వామ్యంపై ప్రశ్న లు వస్తాయి.

ఖగోళ అంశాలు అండ్ అంతరిక్ష విజ్ఞానం

ఖగోళ అంశాలు అంటే గ్రహాల అన్వేషణ, ఉపగ్రహాల సమాచారాన్ని విస్తృత పరుచుకొనే ప్రక్రియ.
 అంతరిక్ష కేంద్రాలు, ఇస్రో సాధించిన విజయాలు, వైఫల్యాలను గుర్తుపెట్టుకోవాలి.
 వాహక నౌకలు, వాటి ద్వారా ప్రయోగించే ఉపగ్రహాలు, వాటి ఉపయోగం ్క్ష విదేశీ ఉపగ్రహాలు తదితర సమాచారం తెలిసి ఉండాలి.
 నేవిగేషన వ్యవస్థకు సంబంధించిన అంశాలపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
సమాచార, ప్రసార రంగం
 ఆధునిక సూపర్‌ కంప్యూటర్స్‌, పదజాలం, మొబైల్‌ టెక్నాలజీ దానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలపై అభ్యర్థి దృష్టి సారించాలి.
 ఈ రంగంలో భారత తీసుకొంటున్న చర్యలు, వాటి ఫలితాలు పరిశీలించాలి.
 
నానో టెక్నాలజీ
 నానో టెక్నాలజీ అనేది సరికొత్త అంశం. దీనికి సంబంధించిన ముఖ్య సంఘటనలు, భారత తీసుకొంటున్న చొరవను గమనించాలి.
 ఈ శాస్త్ర అనువర్తనాలు, దీనిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవాలి.
రోబోటిక్స్‌
 దేవుడి సృష్టి మనిషి. ఆ మనిషి ప్రతి సృష్టే మర మనిషి (రోబో). వాటి రకాలు, ఉపయోగాలు తెలుసుకోవాలి.
 
శక్తి వనరులు
 ఇవి రెండు రకాలు. సంప్రదాయ, సంప్రదాయేతర శక్తి వనరులు.
 సౌర, జల, హైడ్రోజన, టైడల్‌ విద్యుత తయారీ, థర్మల్‌ విద్యుత కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలిసి ఉండాలి.
 శక్తి వనరుల నూతన అన్వేషణ, వాటి గుర్తింపులో భారత పాత్రను అధ్యయనం చేయాలి.
 
పర్యావరణం
 కాలుష్య కారకాలు, వాటిని అరికట్టడంలో రూపొందించిన చట్టాలు ముఖ్యమైనవి.
 పర్యావరణ పరిరక్షణకు తీసుకొంటున్న చర్యలు, నిర్వహించిన సమావేశాలను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
 అంతరించిపోతున్న జీవజాతులు, జీవవైవిధ్య పరిరక్షణలో భారత పాత్రపై అధ్యయనం చేయాలి.
 
బయో టెక్నాలజీ అండ్ ఆరోగ్య అంశాలు
 జీవ సాంకేతికశాస్త్రంలో భారత ప్రగతి, మూల కణ సాంకేతికత, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌లో జరిగే మార్పులను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
 క్లోనింగ్‌ ప్రక్రియ, తద్వారా ఏర్పడిన నూతన జీవులు, సృష్టించిన సంస్థ/దేశం వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
 వ్యాధులు, వాటి నిర్మూలన. నివారణకు అందుబాటులో ఉన్న నూతన పరిజ్ఞానంపై కూడా అవగాహన ఉండాలి.
 ప్రపంచ ఆరోగ్య సంస్థ ్క్ష భారత ప్రభుత్వం వ్యాధుల నిర్మూలనకు తీసుకొన్న ప్రత్యేక చర్యలపై అధ్యయనం చేయాలి.
 
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. 2006లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌకలో 195 రోజులు గడిపి రికార్డు సృష్టించిన భారత సంతతికి చెందిన మహిళ?
ఎ) నీర్జాబానోతు బి) వినీత కౌర్‌ సి) కల్పనాచావ్లా డి) సునీతా విలియమ్స్‌
సమాధానం: డి
 
2. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు?
ఎ) విక్రం సారాభాయి బి) అబ్దుల్‌ కలాం సి) హోమి.జె.బాబా డి) డాక్టర్‌ ఎ.ఎస్.రావు
సమాధానం:ఎ
 
3. ఇటీవల భారత ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే బరాక్‌-8 అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? దీన్ని ఏ దేశ సహకారంతో రూపొందించారు?
ఎ) అమెరికా బి) రష్యా సి) ఇరాన డి) ఇజ్రాయిల్‌
సమాధానం: డి
 
4. భారత తొలి సూపర్‌ కంప్యూటర్‌?
ఎ) ఆదిత్య బి) పరమ్‌ యువ సి) పరమ్‌ డి) విక్రమ్‌-100
సమాధానం: సి
5. భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్‌ జరిగే కేంద్రం?
ఎ) NRSC బి) ISRO సి)  IIRS  డి) SHAR
సమాధానం: ఎ
 
6. భారతలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత కేంద్రం?
ఎ) నరోరా బి) రావత భటా సి) తారాపూర్‌ డి) కల్పక్కం
సమాధానం: డి
 
7. భారతలో తొలి న్యూక్లియర్‌ రియాక్టర్‌?
ఎ) కామని బి) సిరస్‌ సి) అప్సర డి) ధ్రువ
సమాధానం: సి